దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్ | Shruti Haasan Respond On Making Kamal Haasan Biopic | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: ఛాన్సే లేదు.. నాకు ఆ అర్హత లేదు

Published Mon, Jun 17 2024 7:12 AM | Last Updated on Mon, Jun 17 2024 2:11 PM

Shruti Haasan Respond On Making Kamal Haasan Biopic

కమల్ హాసన్‌ పేరు చెప్పగానే విలక్షణ నటుడు అనే పదం మాత్రమే గుర్తొస్తుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గీత రచయిత.. ఇలా కమల్‌కి చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇతడి కూడా కూతురు శ్రుతి హాసన్ కూడా  తక్కువేం కాదు. నటి, సంగీత దర్శకురాలు, గాయని, గీత రచయితగా గుర్తింపు సంపాదించింది. ఈమె ఇటీవల ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసం రాసిన ఇంగ్లీష్ పాటని తండ్రి కమలహాసన్‌ తమిళంలో అనువదించాడు. 'ఇనిమేల్‌' పేరుతో రూపొందిన ఈ ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్)

ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రుతిహాసన్‌.. రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. మీ తండ్రి కమలహాసన్‌ బయోపిక్‌ని మీరు తీస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. దానికి అవకాశమే లేదని బదిలిచ్చింది. తన తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొంది.

ఇక్కడ ఎందరో మంచి దర్శకులు ఉన్నారని, తన తండ్రి కమలహాసన్‌ బయోపిక్ వాళ్లయితే అద్భుతంగా తీయగలరని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి సినిమాల విషయానికొస్తే.. గతేడాది చివర్లో 'సలార్'లో నటించి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. 

(ఇదీ చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement