కొరిశెపాడు(ప్రకాశం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం కొంగపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కొంగపాడు నుంచి వెళ్తున్న పాలవ్యాన్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Fri, Nov 11 2016 9:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement