
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 74 నిమిషాల్లో 16–21, 21–10, 21–18తో లోక్ లోక్ లుయ్–వింగ్ యంగ్ ఎన్జీ (హాంకాంగ్) జంటపై శ్రమించి గెలిచింది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టోలతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–17తో లింగ్ ఫాంగ్ హు–జియావో మిన్ లిన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మరోవైపు భారత ఆటగాళ్లు సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment