
హీరోయిన్ శ్రియ
సౌత్ లో సీనియర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియ త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 35 ఏళ్ల వయసులోనూ ఈ జనరేషన్ హీరోయిన్ లకు గ్లామర్ లో పోటి ఇస్తున్న ఈ భామ సీనియర్ హీరోల సరసన నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ మార్చిలో పెళ్లికూతురు కానుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్ కు చెందిన ఈ భామ డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయిట. అయితే ఈ విషయంపై శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక సమాచరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment