
శ్రియ
‘ఇంతకీ మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్నను కథానాయికల ముందుంచితే.. జనరల్‌గా వారి సమాధానం దాదాపు ఒకేలా ఉంటుంది. ‘అప్పుడేనా? ప్రస్తుతం సినిమాలతో బిజీ. పెళ్లి చేసుకునే తీరికెక్కడిది. అందుకు చాలా టైమ్ ఉంది’ అంటారు. అదే ప్రశ్న శ్రియను అడిగితే.. డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్‌లో ఆగ్రహం ఉంటుంది. ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న వింటే చాలు.. ‘మైండ్ యువర్ బిజినెస్’ అని ఘాటుగా సమాధానమిస్తారు. ఆ సంగతలా ఉంచితే.. తాజాగా రష్యాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో శ్రియ వివాహం జరగనుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
సౌత్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆ యువకుని కుటుంబసభ్యులతో పెళ్లి విషయంపై శ్రియ కుటుంబం మాట్లాడిందని భోగట్టా. పెళ్లికి రెండు కుటుంబాలూ సమ్మతం తెలిపాయని సమాచారం. మార్చిలో వీరి వివాహం రాజస్థాన్‌లో జరగనుందని టాక్. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం సింపుల్‌గా జరపాలని ప్లాన్ చేస్తున్నారట. ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్నకు మండిపడుతున్న శ్రియ.. ఈ వార్తకు ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment