విజయ సేతుపతితో గాయత్రి రొమాన్స్
విజయ సేతుపతితో గాయత్రి రొమాన్స్
Published Mon, Dec 23 2013 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
విజయ సేతుపతి, గాయత్రిలది హిట్ పెయిర్ అన్నది నడువుల కొంచెం పక్కత్తు కానోమ్ చిత్రంతోనే రుజువైంది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి రమ్మి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ముచ్చటగా మూడోసారి ఈ జంట రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. విజయ సేతుపతి తాజాగా నటిస్తున్న మెల్లిసై చిత్రంలో గాయత్రినే హీరోయిన్. ఈ విషయాన్ని విజయ సేతుపతినే స్పష్టం చేశారు.
దీని గురించి ఆయన మాట్లాడుతూ మెల్లిసై చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీ అని పేర్కొన్నారు. ఇందులో గాయత్రి ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే గాయత్రికి విజయ సేతుపతి సిఫార్సు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి మాత్రం హీరోయిన్ల ఎంపిక దర్శక నిర్మాతలదేనని ఈ విషయంలో తన జోక్యం ఉండదని అంటున్నారు. ఏదేమయినా హిట్ పెయిర్ నటిస్తున్న ఈ మెల్లిసై చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు.
Advertisement
Advertisement