విజయ్‌సేతుపతితో కీర్తిసురేశ్ | Keerthy Suresh set to team up with Vijay Sethupathi? | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో కీర్తిసురేశ్

Published Sat, Sep 24 2016 2:33 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

విజయ్‌సేతుపతితో కీర్తిసురేశ్

విజయ్‌సేతుపతితో కీర్తిసురేశ్

పేరులోనే కీర్తిని పొదుగుకున్న నటి కీర్తీసురేశ్. ఇక వృత్తి పరంగానూ అలాంటి పయనం వైపే అడుగులు వేస్తున్నారీ సగం తమిళం, సగం మలయాళం బ్యూటీ. కీర్తీసురేశ్ తల్లి నటి మేనక తమిళియన్ అన్న సంగతి, తండ్రి సురేశ్ మలయాళీ అన్నది తెలిసిందే. అయితే కీర్తీసురేశ్ మాత్రం అటు మలయాళం, ఇటు తమిళంతోపాటు తెలుగు నటిగానూ మారిపోయారు. తమిళంలో నటించిన రజనీమురగున్ సంచలన విజయం సాధించింది.
 
  అదే విధంగా తెలుగులో నటించిన నేను శైలజా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ చక్కనమ్మ త మిళంలో ఇప్పటికి నటించింది రెండు చిత్రాలే. అందులో ఒకటి యావరేజ్‌గా ఆడిన చిత్రమే. అయితే అమ్మడి క్రేజ్ మాత్రం జెట్ స్పీడ్‌లో పెరిగిపోతోంది. రెండో సారి శివకార్తికేయన్‌తో జత కట్టిన రెమో చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఇళయదళపతితో భైరవ చిత్రంలో నటిస్తున్నారు.
 
  అదే విధంగా తెలుగులోనూ మరో చిత్రం చేస్తున్నారు. తాజాగా విజయ్‌సేతుపతితో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వరుస విజయాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్న విజయ్‌సేతుపతి నటించిన ధర్మదురై విజయాన్ని సాధించింది. తాజాగా కాక్కాముట్టై చిత్ర ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో నటించిన ఆండవన్ కట్టళై చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇందులో బాక్సింగ్ భామ రితికాసింగ్ నాయకిగా నటించారు.
 
 విజయ్‌సేతుపతి ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో మడోనా సెబాస్టియన్ నాయకిగా నటిస్తున్నారు. విజయ్‌సేతుపతి మరో చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. రేణుగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా లవ్లీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రాన్నీ భారీ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక వార్త వెలువడలేదన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement