
గచ్చిబౌలి: తన ప్రతిష్టకు భంగం కలిగించడమేగాక, లైగింక వేధింపులకు పాల్పడారని, సినీ నటి గాయత్రి గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు బిగ్‌బాస్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి ఆమె బిగ్‌బాస్ అధినేత అభిషేక్, కో–ఆర్డినేటర్ రఘుపై రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మణికొండలోని జైహింద్‌నగర్‌లో ఉంటున్న గాయత్రిగుప్తా సోమవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో సినీ నటి గాయత్రీ గుప్తా
ఆమె నుండి వివరాలు సేకరించిన పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అభిషేక్, రఘు ఆమె ఇంటికి వచ్చిన సమయంలో వారి వెంట ఎవరు ఉన్నారనే విషయంపై ఆరా తీయగా, మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా గాయత్రిగుప్తా తెలిపింది. వారిని విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని డీఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభిషేక్, రఘులకు నోటీసులు అందజేస్తామన్నారు. అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మూడు నెలల అనంతరం తనను రిజెక్ట్ చేసినట్లు ప్రకటించడంతో సినిమా అవకాశాలు కోల్పోయానని గాయత్రిగుప్తా ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment