ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం అసెంబ్లీ వేదికగా బయటపడిందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సి.గాయత్రి ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత మహిళలకు రుణమాఫీ చేయలేదని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని వెల్లడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి..వడ్డీలతో కలిపి డ్వాక్రా రుణాలు రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.
చంద్రబాబు మాటలను నమ్మి మహిళలు డ్వాక్రా రుణాలు కట్టడం మానేశారని , ప్రస్తుతం బ్యాంక్‌లు మహిళలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని వ్యాక్యానించారు. బాబు మాటలు నమ్మి రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ మోసపోయారని చెప్పారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment