nishith
-
Gayatri, Nishit Reddy: స్వీడన్లో పెళ్లి.. నిర్మల్‌లో విందు
సాక్షి, నిర్మల్: ఇప్పుడంతా ఆన్లైన్ జమానా. జూమ్‌లో మీటింగ్‌లు, వాట్సప్‌లో వీడియో కాలింగ్లే కాదు.. ఏకంగా ఆన్లైన్లో పెళ్లిళ్లు చేసుకునే రోజులొచ్చాయి. ఈ మధ్య నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి ఇలాగే జరుగగా, ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే ఇలాంటి వివాహం మరొకటి నిర్వహించారు. ఎక్కడో.. స్వీడన్లో జరుగుతున్న పెళ్లిని ఇక్కడున్న కుటుంబమంతా ఆన్లైన్లో వీక్షించారు. చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..) వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రానికి చెందిన అబ్బడి మంజుల–శ్రీనివాస్‌రెడ్డిల కుమార్తె గాయత్రి, ఎర్ర ప్రసాద్‌రెడ్డి–పుష్పలతల కుమారుడు నిశిత్‌రెడ్డి ఇద్దరూ సాఫ్ట్వేర్లే. ఉద్యోగరీత్యా వీరిద్దరూ స్వీడన్లో ఉంటున్నారు. స్వదేశంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి సమయానికి కరోనా నిబంధనలు అడ్డువచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ పెళ్లికి సిద్ధమయ్యారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల గణేశ్ ఆలయంలో ఆదివారం ఇక్కడి కాలమాన ప్రకారం 12గంటలకు వివాహం చేసుకున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') అక్కడి స్నేహితులు, వారి కుటుంబసభ్యుల సహకారంతో పూర్తిగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిర్మల్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో ఉండే వారి కుటుంబాలు పెద్ద టీవీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని తమ పిల్లల పెళ్లిని వీక్షించారు. ఆన్లైన్లో ఆశీర్వదించేశారు. బంధుమిత్రులు లైవ్‌లోనే కొత్తజంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ పెళ్లయిన తర్వాత ఇక్కడ విందు ఆరగించారు. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్.. నిశ్చిత్ సమృద్ధి
ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. నిశ్చిత్ సమృద్ధి పేరుతో నాన్ లింక్డ్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. పన్ను రహిత, కచ్చితమైన రాబడులకు ఇందులో హామీ ఉంటుందని సంస్థ ప్రకటించింది. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, రిటైర్మెంట్ వరకు జీవితంలో వివిధ దశల్లో అవసరాలకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఇన్కమ్, ఎండోమెంట్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. తమ అవసరా లకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. అంటే రాబడులు, రక్షణ రెండింటి కలయికే ఈ బీమా ప్లాన్. పరిమిత కాలం పాటు అంటే ఏడాది, ఆరేళ్లు, ఏడేళ్లపాటే ప్రీమియం చెల్లించి.. ఎంపిక చేసుకున్నంత కాలం జీవితబీమా రక్షణ పొందొచ్చు. -
ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు
మంత్రి నారాయణకు సీఎం దంపతుల పరామర్శ నెల్లూరు రూరల్: మంత్రి నారాయణ కొడుకు నిషిత్ అకాల మరణం తనను కలచి వేసిందని, ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శనివారం వచ్చి ఆయనను పరామర్శించారు. నిషిత్ చిత్రపటానికి పూలమాల వేసి వారు నివాళులర్పించారు. నారాయణ కుటుంబ సభ్యులతో సీఎం కొంతసేపు గడిపారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం దురదృష్టకరం, బాధాకరమన్నారు. మంత్రి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఉంటే, నారాయణ విద్యాసంస్థలను నిషిత్ సమర్థంగా నడిపేవాడన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో కొడుకు మృతిచెందడం నారాయణకు తీరని లోటన్నారు. ఈ విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లిపోయారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నిశిత్ కారు ప్రమాదం వీడియో...
-
ఎగసిపడ్డ కన్నీటికెరటం
► నిషిత్ మరణంతో శోక సంద్రంలో ఆప్తులు ► హాజరైన పార్టీశ్రేణులు, ప్రముఖులు నెల్లూరు(టౌన్) : రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ ఏకైక కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు , బంధువులు తల్లడిల్లి పోయారు. చిన్న తనం నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న నిషిత్ అకాల మరణ వార్తను తట్టుకోలేక కుటుంబ సభ్యులతో పాటు నారాయణ విద్యాసంస్థల íసిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు. నిషిత్ మరణ వార్త తెలుసుకున్న పలువురు టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కి తరలివెళ్లారు. 22 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ విలపించారు. మంత్రి నారాయణ విదేశీ పర్యటనలో ఉండటంతో పార్టీ మంత్రులు, నాయకులు సంఘటనస్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చురుకైనవాడు మంత్రి పొంగూరు నారాయణకి ఒక్క కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చిన్నవాడైన కుమారుడు నిషిత్ 1994 జూలై, 4న నెల్లూరులో జన్మించాడు. విద్యావిషయాలతో పాటు అన్నిరంగాల్లో చురుగ్గా వ్యవహరించేవాడు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కాన్సెప్ట్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివారు. ఆరు నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం ఇంటర్మీడియట్‌ను బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ కళాశాలలో పూర్తి చేశాడు. సింగపూర్‌లో బ్యాచిలర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితమే డైరెక్టర్‌గా బాధ్యతలు తండ్రి నారాయణ బాధ్యతలు పంచుకోవడంలో నిషిత్ ఎప్పుడూ ముందుండేవాడు. అటు కుటుంబ సభ్యులు ఇటు బంధువులతో కలివిడిగా ఉంటూ అందరివాడుగా మన్ననలు పొందాడు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి యజమాని కంటే కూడా తోటి సభ్యుడిగా ఉంటూ వారి బాధలను పంచుకుంటారని చెబుతున్నారు. బీబీఎం కోర్సు చదువుతున్న సమయంలోనే వారంలో ఐదు రోజులు కళాశాలకి వెళ్లి మిగతా రెండు రోజులు సంస్థ బాధ్యతలు నిర్వహించేవాడు. తండ్రి నారాయణ రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో విద్యాసంస్థల బాధ్యతలను నిషిత్ స్వీకరించాడు. రెండేళ్ల క్రితం నుంచి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడిప్పుడే వృద్ధిచెందుతున్న నిషిత్ అకాల మరణం చెందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.