
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.
చదవండి: పోలీసుల అదుపులో సినీనటుడు శివాజీ
Comments
Please login to add a commentAdd a comment