గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌ | In Delhi Chinese Man Arrested For Running Spy Ring | Sakshi
Sakshi News home page

గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

Published Fri, Sep 21 2018 10:57 AM | Last Updated on Fri, Sep 21 2018 10:57 AM

In Delhi Chinese Man Arrested For Running Spy Ring - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ‘స్పై రింగ్‌’కు (గూఢచార్యనికి సంబంధించిన కార్యక్రమాలు) పాల్పడుతున్న ఓ చైనా దేశీయున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఆధార్‌ కార్డ్‌తో పాటు పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైనా దేశీయుడైన చార్లీ పెంగ్‌(39) 5 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చాడు. గుర్‌గావ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫారిన్‌ కరెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చార్లీ పెంగ్‌ ఎక్కువగా హిమాచల్‌ ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని  మీద నిఘా పెట్టారు.

చార్లీ గూఢచార్యానికి పాలపడుతున్నట్లు తెలియడంతో పోలీసులు అతని నివాసం మీద దాడి చేశారు. ఈ సందర్భంగా  పోలీసులు అతని ఆధార్‌ కార్డ్‌, పాస్‌పోర్టు, 3. 5 లక్షల రూపాయల దేశీయ కరెన్సీ, 2000 అమెరికన్‌ డాలర్లు, 2 వేల థాయ్‌ కరెన్సీతో పాటు ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అతను మణిపూర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకుని పాస్‌పోర్ట్‌ పొందినట్లుగా పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement