china Man
-
లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!
చైనాలో 28 ఏళ్ల వ్యక్తి 680 మిలియన్ యువాన్స్ (రూ. 795 కోట్ల కంటే ఎక్కువ) లాటరీ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చైనా దేశంలో ఇదే అతి పెద్ద లాటరీ కావడం గమనార్హం. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించిందని చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ వెల్లడించింది. చైనాకు చెందిన ఓ చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్‌పై బెట్టింగ్ చేశాడు, దీంతో అతని ప్రతి టిక్కెట్‌కు 5.16 మిలియన్ యువాన్స్ బహుమతి లభించిందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే విజేత వివరాలను సంస్థ బయటపెట్టలేదు. లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఈ నెల 7న బహుమతి స్వీకరించారని, ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. ఇంత డబ్బు లాటరీ గెలిచాననే ఆనందంలో అతనికి నిద్ర పట్టలేదని, ఉద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. మొదట్లో తనని తానె నమ్మలేదని, ఇది నిజమా.. కాదా అని నమ్మడానికి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నట్లు తెలిపారు. చైనా నిబంధనల ప్రకారం గెలుచుకున్న బహుమతిలో ఐదోవంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: రెస్టారెంట్‌గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్ చైనాలో ఇప్పటి వరకు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ ఇదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2012లో బీజింగ్‌కు చెందిన ఒక వ్యక్తి 570 మిలియన్ యువాన్లు, గత ఏడాది తూర్పు జియాంగ్జి ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి 200 మిలియన్ యువాన్లను లాటరీలో గెలుచుకున్నారు. -
గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ‘స్పై రింగ్’కు (గూఢచార్యనికి సంబంధించిన కార్యక్రమాలు) పాల్పడుతున్న ఓ చైనా దేశీయున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైనా దేశీయుడైన చార్లీ పెంగ్(39) 5 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చాడు. గుర్గావ్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫారిన్ కరెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చార్లీ పెంగ్ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. చార్లీ గూఢచార్యానికి పాలపడుతున్నట్లు తెలియడంతో పోలీసులు అతని నివాసం మీద దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అతని ఆధార్ కార్డ్, పాస్‌పోర్టు, 3. 5 లక్షల రూపాయల దేశీయ కరెన్సీ, 2000 అమెరికన్ డాలర్లు, 2 వేల థాయ్ కరెన్సీతో పాటు ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అతను మణిపూర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకుని పాస్‌పోర్ట్ పొందినట్లుగా పోలీసులు తెలిపారు. -
ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు!
బీజింగ్: అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. ఈ ఘటన చైనాలో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జౌలో ఓ చిన్నారి తన ఇంట్లో మూడో అంతస్తులో ఆడుకుంటోంది. అప్పటివరకూ బాగానే ఉంది. అలా అడుకుంటున్న బాలిక కొంత సమయంలోనే ఇంటి బాల్కనీ వైపు వెళ్లింది. ఏదో వస్తువు అందుకునే క్రమంలో పట్టుతప్పి మూడో అంతస్తు నుంచి పడిపోయింది. బాల్కనీ పక్కన ఉన్న కొద్దిపాటి భాగంపై పడ్డ చిన్నారి ప్రాణభయంతో ఏడుస్తుంటే ఓ షాపు ఓనర్ లాంగ్ చంక్వెన్ వెంటనే స్పందించారు. వెంటనే నాలుగో అంతస్తుకు వెళ్లి బాల్కనీ కిటికీ నుంచి తలకిందులుగా వేలాడుతూ చిన్నారికి సాయం చేసే యత్నం చేశారు. దీంతో మరో వ్యక్తి అక్కడికి వచ్చి చంక్వెన్ కాళ్లు పట్టుకుని కిటికీలోంచి లోపలికి లాగుతుండగా, బాలిక చేతిని పట్టుకుని అతికష్టమ్మీద పైకి లాగి ప్రాణాలు రక్షించారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చిన్నారిని కాపాడిన షాపు ఓనర్ స్థానికంగా హీరో అయ్యారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు ఆయన చూపిన ధైర్య సాహసాలను స్థానికులు మెచ్చుకుంటున్నారు. చిన్నారిని కాపాడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు తమ సెల్ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. -
ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో సాహసం
బీజింగ్: చైనాలో టాయ్యన్ నగరానికి చెందిన 55 ఏళ్ల గావో బింగ్గువో సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. తేనె అమ్ముకునే గావో తేనె టీగలతో సాహస కార్యక్రమం చేశాడు. గావో తన ఒంటిపైకి దాదాపు 11 లక్షల తేనెటీగలను ఆకర్షించాడు. వీటి బరువు 109 కిలోలు. దీంతో గతంలో ఉన్న రికార్డు (85 కిలోలు బరువు)ను గావో బద్దలుకొట్టాడు. ఈ సాహసం చేసే సమయంలో గావో లోదుస్తులు మాత్రమే ధరించాడు. మొదట కొన్ని వందల తేనెటీగలు మాత్రమై ఆయన శరీరంపై వాలాయి. ఆ తర్వాత లక్షలాది తేనెటీగలు వచ్చి ఆయన ఒంటిపై చేరాయి. గావో తన పెదవులపైకి తేనెటీగలు రాకుండా ఉండేందుకు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఈ సాహసం చేసే క్రమంలో ఆయన శరరీ ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగింది. అయినా పట్టుదలతో రికార్డు సృష్టించాడు. అన్నట్టు గావోకు తేనెటీగలతో దశాబ్దాల అనుబంధముంది. 35 ఏళ్లుగా తేనెటీగలను సంరక్షిస్తున్నాడు.