కామారెడ్డిలో పాస్‌పోర్టు కార్యాలయంలో మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోస్టల్ అధికారులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సామగ్రితోపాటు కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాట రీలు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి.
ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గది పక్కనే పోస్టల్ శాఖ ఉత్తరాల గది ఉండటంతో హుటాహుటిన సిబ్బంది ఆ ఉత్తరాల సంచులను బయటకు తీసుకువచ్చి ఎదురుగా ఉన్న ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో మాత్రం అంతా అగ్నికి ఆహుతైంది. పాస్‌పోర్టులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉంటాయని, ఫైళ్లు ఎప్పటికప్పుడు తరలిస్తామని, ఎలాంటి డేటా, ముఖ్యమైన ఫైళ్లు నష్టపోలేదని, ఫరి్నచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని పోస్టల్ శాఖ అధికారి రాజు తెలిపారు.
26 నుంచి కామారెడ్డి పీవోపీఎస్కేలో కార్యకలాపాలు నిలిపివేత
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): కామారెడ్డిలోని పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో నిర్వహణ కారణాలతో ఈ నెల 26 నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జె. స్నేహజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26 నుంచి అపా యింట్మెంట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వాటిని రీ షెడ్యూల్డ్ చేసుకునే ఆప్షన్లను ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment