దేశ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలిసారి సొంతింటి కలల్ని నిజం చేసేలా 40,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.33,04,918) వరకు డబ్బుల్ని ఆదా చేసుకునే వెసలు బాటు కల్పించింది. దీంతో పాటు విధులు నిర్వహించే వారికి వర్క్ పర్మిట్, ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులు కెనడాలో నివసిస్తున్నట్లైతే వారికి వీసా ఎలిజిబులిటీ గడువును పొడిగించింది. ఇందుకోసం అర్హులు నివాసానికి సంబంధించిన పత్రాల్ని అందించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కెనడాలో సొంత ఇల్లు తీసుకోవాలని ఉండి, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆగిపోయిన వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. పన్ను ప్రోత్సాహకాలు పొందడంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. దీంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్ధులు సైతం సొంతింటిని కొనుగోలు చేసే వీలు కలుగుతుంది.
వర్క్ పర్మిట్ హోల్డర్లు, ఇతర దేశాల విద్యార్థులను ఆహ్వానించి వారికి అవకాశాలు కల్పించే విషయంలో తమ నిబద్ధతను చాటి చెప్తుంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారు కెనడాలో కొత్త ఇల్లు తీసుకునే సదుపాయం ఉంటుంది.
ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ (ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ) అర్హతలు
కెనడా ప్రభుత్వం అందించే పథకంతో లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ తప్పని సరి వీటితో పాటు
తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తేనే : కెనడాలో గడిచిన ఐదేళ్లలో భార్య లేదా భర్త / భాగస్వామి పేరు మీదు ఇల్లు కొనుగోలు చేయకూడదు.
కనీసం 18 సంవత్సరాలు నిండాలి : ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్‌ను ప్రారంభించిన నాటికి అర్హులైన వయస్సు 18 ఏళ్ల నుంచి 71 ఏళ్ల వయస్సు ఉండాలి.
కెనడియన్ నివాసి : కెనడియన్ రెసిడెంట్ (పౌరులు, శాశ్వత నివాసితులు, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం నివాస అవసరాలను తీర్చే కొంతమంది తాత్కాలిక నివాసితులు).
వర్క్ పర్మిట్ హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు నివాసితులుగా అర్హత పొందడానికి ట్యాక్స్ ఇయర్ సంవత్సరంలో కనీసం 183 రోజులు దేశంలో నివసించాలి.
ఆర్థిక సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న మూడు రకాల ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్లు
డిపాజిటరీ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది నగదు, టర్మ్ డిపాజిట్లు లేదా గ్యారెంటీడ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికేట్లు (జిఐసి) కలిగి ఉన్న బ్యాంకు ఖాతా.
ట్రస్ట్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఈ ఖాతాను ట్రస్టీగా ట్రస్ట్ కంపెనీతో తెరవవచ్చు. నగదు, టర్మ్ డిపాజిట్లు,జీఐసీలు, ప్రభుత్వ .. కార్పొరేట్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నిర్దేశిత స్టాక్ ఎక్ఛేంజ్‌లలో లిస్ట్ అయిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అర్హతను కలిగి ఉంటుంది.
ఇన్స్యూర్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది యాన్యుటీ (లైసెన్స్ పొందిన యాన్యుటీ ప్రొవైడర్) ఒప్పందం.
కాగా, అర్హత కలిగిన నివాసాలలో సింగిల్-ఫ్యామిలీ గృహాలు, పాక్షికంగా విడిపోయిన గృహాలు, టౌన్ షిప్‌లు, కండోమినియం యూనిట్లు (లేదా కాండోలు), అపార్ట్మెంట్ యూనిట్లు, మొబైల్ గృహాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment