ఇక అక్రమార్కులకు చెక్.. మరింత భద్రంగా పాస్‌పోర్టు! | Indians likely to get e-passports soon: MEA Secretary Sanjay Bhattacharyya | Sakshi
Sakshi News home page

ఇక అక్రమార్కులకు చెక్.. మరింత భద్రంగా పాస్‌పోర్టు!

Published Thu, Jan 6 2022 3:09 PM | Last Updated on Thu, Jan 6 2022 3:49 PM

Indians likely to get e-passports soon: MEA Secretary Sanjay Bhattacharyya - Sakshi

కొన్ని సినిమాల్లో చూపించినట్లు కొందరు అక్రమార్కుల నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి వాటిని అసాంఘీక కార్యకలాపాలకు వాడుతుంటారు. దీనివల్ల, నిజమైన పాస్‌పోర్టు గల వ్యక్తులు కొన్నిసార్లు చిక్కుల్లో చిక్కుకొని శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అయితే, ఇక అలాంటి అక్రమార్కుల ఆటలు సాగవు. భవిష్యత్‌లో నకిలీ పాస్‌పోర్టులు అనే మాట రాకుండా ఉండటానికి కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. త్వరలో భారతీయ పౌరులు చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్టులను పొందనున్నారు. 

బయోమెట్రిక్ డేటా సురక్షితం 
ఈ-పాస్‌పోర్టుల అక్రమార్కుల ఆటలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్టుల వద్ద తనికి ప్రక్రియ వేగంగా జరగనుంది. ఈ-పాస్‌పోర్టులకు సంబంధించిన సమాచారాన్ని ఎంఈఏ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య జనవరి 5న ట్వీట్ వేదికగా పేర్కొన్నారు. "పౌరుల కోసం భారతదేశం త్వరలో తర్వాతి తరం ఈ-పాస్‌పోర్టులను ప్రవేశపెట్టనుంది. ఇవి బయోమెట్రిక్ డేటాను సురక్షితం చేస్తాయి. వీటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్టుల వద్ద తనికి ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వీటిని నాసిక్ ఇండియా సెక్యూరిటీ ప్రెస్'లో తయారు చేస్తారు" అని భట్టాచార్య ట్వీట్ చేశారు. ఈ-పాస్‌పోర్టులు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన చెప్పారు.

చిప్‌ను ట్యాంపర్ చేస్తే..
"పౌరులకు అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన చిప్-ఎనేబుల్డ్ ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తుంది. దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో పొందుపరుస్తారు. ఈ పాస్‌పోర్టులో ఉన్న చిప్‌లో వివరాలను నిల్వ చేస్తారు. ఒకవేళ ఎవరైనా చిప్‌ను ట్యాంపర్ చేసినట్లయితే, సదురు మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సిస్టమ్ దానిని గుర్తించగలుగుతుంది. ఫలితంగా పాస్‌పోర్టు ఉన్న ప్రయాణాల డేటా భద్రంగా ఉంటుంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది మార్చిలో రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. భారతదేశంలో ఉన్న 36 పాస్‌పోర్టు కార్యాలయాలు ఈ-పాస్‌పోర్టులను జారీ చేయనున్నాయి.

(చదవండి: జియో బంపర్‌ ఆఫర్‌, ఇక యూజర్లకు పండగే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement