
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నేటి పరిస్థితుల్లో ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు విమాన ప్రయాణికులు బెంబేలెత్తి పోతున్నారు. కరోనా వైరస్ ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న భయం కంటే పది నుంచి పక్షం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందన్నదే అసలు భయం. దీనికి క్యాథె పసిఫిక్ ఏర్‌లైన్స్‌తో కలసి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఓ తరుణోపాయాన్ని కనుగొన్నది.
‘కామన్ పాస్’ పేరిట ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఫోన్‌లో డౌన్‌లో చేసుకోవాలి. విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ముందు ప్రయాణికులు విధిగా ‘కోవిడ్–19’ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వాటి ఫలితాలను ఈ ఫోన్ యాప్ ద్వారా భద్రపర్చాల్సి ఉంటుంది. ఇక ఏ విమానాశ్రయంలోనైనా సంబంధిత అధికారులు ఎవరడిగిన మొబైల్ ఫోన్లో ఈ యాప్‌ను ఓపెన్‌చేసి చూపిస్తే సరిపోతుంది. దీన్ని ఈ వారం నుంచి హీత్రూ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు.
ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రభుత్వాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘కామన్స్ ప్రాజెక్ట్ ఫౌండేషన్’ వివిధ భాషల్లో ఈ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుంది. విమానాశ్రయ సిబ్బంది, సరిహద్దు భద్రతా సిబ్బందికి ఈ కోడ్‌ను స్కాన్ చేసే అవకాశం ఉంటుంది. లండన్, న్యూయార్క్, హాంకాంగ్, సింగపూర్ నగరాల మధ్య తిరిగే ప్రయాణికుల నుంచి వాలంటీర్లను ఎంపిక చేసి ‘కామన్ పాస్’ విధానాన్ని ప్రయోగాత్మక ప్రవేశ పెట్టి పరిశీలిస్తారు.
చదవండి: కరోనాను జయించిన ఊబకాయ మహిళ
Comments
Please login to add a commentAdd a comment