ఆదిత్య గార్డెన్‌లో ఓ వ్యక్తి నుంచి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుంటున్న రెవెన్యూ అధికారులు
నిజాంపేట్: కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన వారి వివరాల ఆధారంగా అధికారులు సంబంధిత వ్యక్తుల నుంచి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంటున్నారు. అందులో భాగంగా బాచుపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల నుంచి 50 వరకు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పాస్‌పోర్టులు అధికారుల వద్ద ఉంటాయి. ఆర్‌ఐలు షన్ముఖం, జగదీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment