కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. సంక్రాంతి సెలవులు కూడా త్వరలోనే రానున్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది ఆలా.. సరదాగా విదేశాల్లో చక్కర్లు కొట్టి వచ్చేద్దాం అనుకుంటారు. అయితే వీసా (Visa) సమస్య కారణంగా మిన్నకుండిపోతారు. కానీ వీసా అవసరం లేకుండానే కొన్ని దేశాలను చుట్టి వచ్చేయొచ్చని బహుశా కొందరికి తెలిసుండకపోవచ్చు.
వీసా అవసరం లేకుండానే కొన్ని దేశాల్లో.. కొన్ని రోజులు ఉండవచ్చు. ఇలాంటి దేశాలు 12 వరకు ఉన్నాయి. భారతీయులు (Indians) వీసాతో పనిలేకుండానే (Visa Free Countries) పర్యటించగల దేశాల జాబితా..
●థాయిలాండ్
●భూటాన్
●నేపాల్
●మారిషస్
●మలేషియా
●ఇరాన్
●అంగోలా
●డొమినికా
●సీషెల్స్
●హాంకాంగ్
●కజఖ్‌స్థాన్
●ఫిజీ
భారతీయులు పైన పేర్కొన్న దేశాల్లో దాదాపు 60 రోజుల వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. పర్యాటకాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగటానికి కొన్ని దేశాలు ఈ వీసా రహిత విధానం ప్రవేశపెట్టాయి. ఇది ఆ దేశాల ఆర్ధిక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే కాకుండా.. పర్యాటకులు కూడా అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment