
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్‌లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్‌మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
నిలిపివేసిన అపాయింట్‌మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..)
Comments
Please login to add a commentAdd a comment