Slot
-
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సులభతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్‌లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్లను మంజూరు చేశారు. -
పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
ఓటు వేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి!
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్ల ముందు చాంతాడంత లైన్లు! వరుసలో నిరీక్షించే ఓపిక లేక కొందరు ఆ బారులను చూసే వెనక్కి వెళ్లిపోతుంటారు. అలాగాకుండా ఓటుకు స్లాట్‌ను బుక్ చేసుకొని మనకు కుదిరిన టైంలో వెళ్లి ఓటేస్తే? ఎన్నికల సంఘం ఆలోచన కార్యరూపం దాలిస్తే ఇది నిజం కానుంది. ‘ఈ విధానంతో ఓటర్లు బారులను తప్పించుకోవచ్చు. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. పోలింగ్ సమయాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ సౌకర్యం కల్పించడంపై యోచిస్తున్నాం’ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా గురువారమిక్కడ తెలిపారు.