న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది హెన్లీ అండ్ పార్ట్‌నర్స్. ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో ఇండియా 85వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. గతేడాది 84వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి ఒక స్థానం కిందికి జారింది. ఈ జాబితాలో ఇండియాకు 58 స్కోరు లభించింది. అంటే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్ సహాయంతో 58 దేశాలను సందర్శించవచ్చు. తజికిస్థాన్‌తో పాటు భారత్ కు ఈ ర్యాంకు లభించింది. ఓ టూరిస్ట్‌గా వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. అంటే మీరు ఆ దేశంలో దిగిన తర్వాత అక్కడ వీసా తీసుకోవచ్చు.
మరోసారి మొదటిస్థానంలో జపాన్:
పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో 191 స్కోరుతో జపాన్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం వరుసగా మూడు సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 190 స్కోరుతో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా కలిసి సంయుక్తంగా నిలిచాయి. మన పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ ఈ ఏడాది కూడా అత్యల్ప స్కోరు 26తో చివరి స్థానాన్ని పొంది ప్రపంచంలోనే చెత్త పాస్‌పోర్ట్ గా నిలిచింది. మరోవైపు, మన దాయాది పాకిస్తాన్ 32 స్కోరుతో చివరి నుంచి నాల్గవ ర్యాంకును పొందింది.
ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు:
1. జపాన్: 191
2. సింగపూర్: 190
3. జర్మనీ, దక్షిణ కొరియా: 189
4. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్: 188
5. ఆస్ట్రియా, డెన్మార్క్: 187
6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్: 186
7. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్: 185
8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా: 184
9. కెనడా: 183
10. హంగరీ: 182
Comments
Please login to add a commentAdd a comment