గంట వ్యవధిలో పాస్‌పోర్ట్‌! | Hyderabad Regional Passport Office Given Passport In Hour | Sakshi
Sakshi News home page

గంట వ్యవధిలో పాస్‌పోర్ట్‌!

Published Sat, Jun 18 2022 1:00 AM | Last Updated on Sat, Jun 18 2022 2:44 PM

Hyderabad Regional Passport Office Given Passport In Hour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర సేవల కల్పనలో హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలికకు తప్ప నిసరి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు ధ్రువీకరించడంతో చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లాల్సి వచ్చింది.

ఈక్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ కేంద్రం అధికారులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన కార్యా లయ అధికారులు అక్కడికక్కడే దరఖాస్తును ప్రాసెస్‌ చేసి తదుపరి చర్యలు తీసు కుని కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్‌ జారీ చేసినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల చూపిన అంకితభావం ఫలితం గానే గంటలో పాస్‌పోర్ట్‌ జారీ చేసి బాధితురాలికి అందించినట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement