ఆధునిక కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతుంటారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఆఖరికి పిల్లలను తీసుకెళ్లాలన్నా తప్పకుండా మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ కథనంలో మైనర్ పాస్‌పోర్ట్ ఎలా తీసుకోవాలి? దానికవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవి అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పిల్లల కోసం పాస్‌పోర్ట్ పొందాలనుకునేవారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 7 నుంచి 15 రోజుల లోపల ఇంటికి వస్తుంది.
మైనర్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్..
- జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)
- ఆధార్ కార్డ్ లేదా తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్
- తల్లిదండ్రుల పాస్‌పోర్ట్స్ (అందుబాటులో ఉంటే)
- తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ప్రూఫ్ (పిల్లలు భారతదేశం వెలుపల జన్మించినట్లయితే)
ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి!
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా..
- మైనర్ పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి, లాగిన్ ఐడీ అండ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
- ఆ తరువాత దానికయ్యే అమోంట్ చెల్లించాల్సి ఉంటుంది.
- అమౌంట్ చెల్లించిన తరువాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయాలి.
- మీరు అపాయింట్‌మెంట్ సమయంలో అప్లికేషన్ ఫారమ్, ఫీజు చెల్లించిన రసీదు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
- అపాయింట్‌మెంట్ రోజు మీ బిడ్డను పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి.
- పాస్‌పోర్ట్ అధికారి మీ అప్లికేషన్ & డాక్యుమెంట్‌లను పరీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకుంటాడు. ఆ తరువాత పాస్‌పోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది.
- అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ లభిస్తుంది. దీని ద్వారా పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- అప్లికేషన్ సిద్దమైన తరువాత మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు, లేదా మీ చిరునామాకు డెలివరీ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment