Step by step process
-
దశల వారీగా ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్ఐఆర్ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
మైనర్ పాస్‌పోర్ట్ అప్లై చేయాలా.. సింపుల్ ప్రాసెస్ ఇదే!
ఆధునిక కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతుంటారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఆఖరికి పిల్లలను తీసుకెళ్లాలన్నా తప్పకుండా మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ కథనంలో మైనర్ పాస్‌పోర్ట్ ఎలా తీసుకోవాలి? దానికవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవి అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిల్లల కోసం పాస్‌పోర్ట్ పొందాలనుకునేవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 7 నుంచి 15 రోజుల లోపల ఇంటికి వస్తుంది. మైనర్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్.. జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) ఆధార్ కార్డ్ లేదా తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్ తల్లిదండ్రుల పాస్పోర్ట్స్ (అందుబాటులో ఉంటే) తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ప్రూఫ్ (పిల్లలు భారతదేశం వెలుపల జన్మించినట్లయితే) ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి! ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా.. మైనర్ పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత దానికయ్యే అమోంట్ చెల్లించాల్సి ఉంటుంది. అమౌంట్ చెల్లించిన తరువాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయాలి. మీరు అపాయింట్మెంట్ సమయంలో అప్లికేషన్ ఫారమ్, ఫీజు చెల్లించిన రసీదు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. అపాయింట్మెంట్ రోజు మీ బిడ్డను పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్ అధికారి మీ అప్లికేషన్ & డాక్యుమెంట్లను పరీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకుంటాడు. ఆ తరువాత పాస్‌పోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ లభిస్తుంది. దీని ద్వారా పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సిద్దమైన తరువాత మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు, లేదా మీ చిరునామాకు డెలివరీ చేసుకోవచ్చు. -
దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రతిపాదించింది. ఎకానమీని మళ్లీ పట్టాలెక్కించే దిశగా.. ముందుగా 22–39 ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్నవారు విధులకు హాజరయ్యేలా అనుమతించాలని సూచించింది. అలాగే, చిన్న.. మధ్య స్థాయి సంస్థలకు తోడ్పాటునివ్వాలని, వైరస్ పరీక్షా కేంద్రాలను మరింతగా పెంచాలని పేర్కొంది. లాక్డౌన్ నుంచి బైటపడాల్సిన వ్యూహానికి సంబంధించి రూపొందించిన నోట్లో ఫిక్కీ ఈ అంశాలు ప్రస్తావించింది. అటు లాక్డౌన్ ఉపసంహరణపై కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా దాదాపు ఇటువంటి సూచనలే చేసింది. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలని సూచించింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరో 2 వారాలు లాక్డౌన్ కొనసాగించాలని పేర్కొంది. సంఘటితరంగ పరిశ్రమలను 50% సామర్థ్యంతో పనిచేయించి, వారం మార్చి వారం ఉపా«ధి కల్పిస్తే కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించవచ్చని తెలిపింది. ఏప్రిల్ 30 దాకా దేశీవిదేశీ విమానాలు, రైళ్ళు, ఇంటర్సిటీ బస్సులు, మెట్రోరైళ్ళు నడపకూడదని, 50% సామర్థ్యంతో ప్రజారవాణా కోసం బస్సులను అనుమతించవచ్చని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది. -
‘హాట్ స్పాట్స్’ కాని ప్రాంతాల్లో..!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా వైరస్ హాట్‌స్పాట్స్ కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను క్రమానుగతంగా ఉపసంహరించేలా ప్రణాళిక రూపొందించాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా గత గురువారం ప్రధాని లాక్డౌన్ ఎత్తివేత దిశగా సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక రంగంపై కరోనా ప్రతికూల ప్రభావం అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేలా లాక్డౌన్ అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రులను ఆదేశించారు. లాక్డౌన్ ప్రకటన అనంతరం తొలిసారి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కేబినెట్ భేటీ నిర్వహించారు. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం గురించి ఈ భేటీలో చర్చించారు. పంట కోతల సమయంలో రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ప్రధాని కోరారు. ‘రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఈ పంట కోతల సమయంలో సాధ్యమైనంత సాయాన్ని వారికి ప్రభుత్వం అందించాలి’ అని స్పష్టం చేశారు. పంటలను మార్కెట్లకు చేర్చేందుకు సాంకేతికత సాయం తీసుకోవాలని, క్యాబ్ సర్వీస్ అగ్రిగేటర్ల తరహాలో ట్రక్ సర్వీస్ అగ్రిగేటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చేమో ఆలోచించాలని సూచించారు. గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను సేకరించే విషయంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు లభించిన ఒక అవకాశంగా భావించాలని ప్రధాని సూచించారు. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మంత్రిత్వ శాఖలు ‘వ్యాపార కొనసాగింపు ప్రణాళిక’లను సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. లాక్ డౌన్ అనంతరం అమలు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన 10 నిర్ణయాలను, 10 ప్రాధాన్య రంగాలను గుర్తించాలని మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, తమ తమ మంత్రిత్వ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, దేశీయంగా ఉత్పత్తులను పెంచడం, తద్వారా ఎగుమతులను పెంచేందుకు ఆచరణపూర్వక సూచనలు ఇవ్వాలని మంత్రులను కోరారు. కొత్తగా ఏయే ఉత్పత్తులను ఎగుమతి చేయొచ్చో, ఏయే దేశాలకు ఎగుమతి చేయొచ్చో ఆలోచించాలన్నారు. అదే సమయంలో దేశీయంగా నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చూడాలని మంత్రులను కోరారు. బ్లాక్ మార్కెట్‌ను, ధరలను అక్రమంగా పెంచడాన్ని అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలని కోరారు. ఈ పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు కచ్చితంగా అందేలా చూడాలన్నారు. ప్రధాని నివాసంలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా మంత్రులు తమ కార్యాలయాలు, నివాసాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది సుదీర్ఘ పోరాటం: మోదీ కరోనా వైరస్‌పై భారత్ సుదీర్ఘ పోరు జరపాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటంలో అంతిమంగా భారత్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగనుంది. అలసట చెందినట్లు గానీ, ఓటమి పాలయినట్లు గానీ మనం భావించరాదు. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తాం. విజేతలుగా నిలుస్తాం. కరోనా మహమ్మారిపై గెలుపు సాధించడమే యావత్ జాతి లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్–19 తీవ్రతను అర్థం చేసుకుని సరైన సమయంలో సమగ్ర చర్యలు అమలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ తీసుకున్న చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. లాక్డౌన్ సమయంలో ప్రజలు చూపిన పరిణతి అపూర్వం. భారత్ వంటి పెద్ద దేశంలో ప్రజలు ఇలా క్రమశిక్షణ చూపుతారని ఎవరూ ఊహించి ఉండరు’ అని ప్రధాని అన్నారు. -
మత్తు దిగుతోంది
సాక్షి, గుంటూరు: ఎన్నో పచ్చని కుటుంబాలు మద్యం చిచ్చుకు నిలువునా కూలిపోతున్నాయి. దాంపత్య బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీటన్నింటినీ తన పాదయాత్రలో దగ్గరుండి చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే బెల్ట్ షాపుల రద్దు, ఎమ్మార్పీకే విక్రయాలు వంటి నిర్ణయాలతో ముందడుగు వేశారు. ఈ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మద్యం దుకాణాల రెన్యువల్ విషయంలో జిల్లాలో 20 శాతం యజమానులు వెనుకంజ వేశారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే మద్య నిషేధంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బెల్టుషాపుల నిర్మూలన, బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేసే మద్యం దుకాణాలపై కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలను సర్కార్ అమలులోకి తీసుకువచ్చింది. దీంతో జిల్లాలో విచ్చలవిడి మద్యం అమ్మకాలను అడ్డుకట్టపడింది. సమయపాలన కచ్చితంగా పాటించాలి, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. 20 శాతం తగ్గిన దుకాణాలు.. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగా జిల్లాలో మద్యం దుకాణాల్లో 20 శాతం మేర తగ్గాయి. గత నెల 30కి మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగిసింది. కొత్త మద్యం పాలసీ రూపలకల్పనకు కొంత సమయం పడుతుంటంతో ప్రభుత్వం మూడు నెలలు మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యూవల్‌కు అవకాశం ఇచ్చింది. జిల్లాలో 355 మద్యం దుకాణాలున్నాయి. జూన్ 30 నాటికి లైసెన్స్ రెన్యూవల్‌కు ప్రభుత్వం గడువు విధించగా 287 మద్యం దుకాణాల యజమానులు మాత్రమే లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్నారు. మిగిలిన 68 దుకాణాల నిర్వాహకులు ముందుకు రాలేదు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తగ్గిన మద్యం అమ్మకాలు.. ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల జిల్లాలో మద్యం అమ్మకాలు సైతం తగ్గుముకం పట్టాయి. సార్వత్రిక ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పాటై మద్యం అమ్మకాలపై నిబంధనలు కఠినతరం చేయడంతో జూన్ నెలకు ముందు జరిగిన అమ్మకాలతో పోల్చుకుంటే సుమారు రూ.20 కోట్లకు పైగా తగ్గాయి. జూన్ నెలలో రూ.149.66 కోట్ల మద్యం విక్రయాలు జరిగగా.. ఇక ముందు కూడా విక్రయాలు మరితం తగ్గుతాయని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మద్యం దుకాణాలు 355 లైసెన్సులు రెన్యువల్ చేయించుకున్న షాపులు 287 జూన్‌లో మద్యం అమ్మకాలు రూ.149 కోట్లు గత ఏడాది జూన్‌లో మద్యం అమ్మకాలు రూ.170 కోట్లు ఒక్క నెలలో తగ్గిన అమ్మకాలు రూ.21 కోట్లు -
హోంమేడ్ ఫేషియల్
న్యూ ఫేస్ ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఇకపై ఫేషియల్ చేసుకోవచ్చు. దాంతో ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు... అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకొని ఆకర్షణీయంగా తయారై వెళ్లొచ్చు. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం.. క్లెంజింగ్: ఫేషియల్‌లో మొదటి స్టెప్ క్లెంజింగ్. అంటే క్లీనింగ్. ముందుగా ముఖానికి కాస్తంత కొబ్బరి నూనె రాసుకొని అరనిమిషం పాటు మర్దనా చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌ను ముఖంపై పెట్టుకొని, రెండు నిమిషాల తర్వాత పొడి క్లాత్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. స్టీమింగ్: ముందుగా వేడి నీళ్లలో నిమ్మగడ్డి లేదా లావెండర్ ఆయిల్‌ను వేయాలి. ఆ నీటి ఆవిరి తగిలేలా, ముఖాన్ని గిన్నెకు కాస్తంత దగ్గరగా పెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా తల మీద ఏదైనా టవల్ కప్పుకోవాలి. అలా అయిదు నిమిషాలు ఉన్న తర్వాత ముఖాన్ని మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి. ఎక్స్ఫోలియేషన్: దీన్నే ఫేషియల్ స్క్రబ్ అని కూడా అంటారు. ఈ స్క్రబ్ కోసం ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టీ స్పూన్ బాదం నూనె, 1 టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్: ఇప్పుడు ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం లూజ్ కావడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ను వాడాలి. ముఖానికి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకొని 10-15 నిమిషాల తర్వాత పచ్చి పాలు లేదా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. టోనింగ్: ఈ స్టెప్‌లో నిమ్మరసం లేదా రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. దాంతో ముఖంపై జిడ్డుతనం పూర్తిగా పోతుంది. మాయిశ్చరైజర్: జిడ్డుచర్మం వారు 1 టేబుల్ స్పూన్ పాలలో పావు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖం, మెడ భాగాలకు రాసుకొని 10 నిమిషాలు మర్దనా చేసుకోవాలి. (మర్దనా ఎప్పుడూ కింది నుంచి మీదకు చేసుకోవాలి. పై నుంచి కిందకు చేస్తే చర్మం సాగుతుంది). పొడి చర్మం వారు మాయిశ్చరైజర్‌గా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవచ్చు.