![Lockdown must be lifted in stages Says FICCI - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/10/FICCI.jpg.webp?itok=Sg55uSNR)
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రతిపాదించింది. ఎకానమీని మళ్లీ పట్టాలెక్కించే దిశగా.. ముందుగా 22–39 ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్నవారు విధులకు హాజరయ్యేలా అనుమతించాలని సూచించింది. అలాగే, చిన్న.. మధ్య స్థాయి సంస్థలకు తోడ్పాటునివ్వాలని, వైరస్ పరీక్షా కేంద్రాలను మరింతగా పెంచాలని పేర్కొంది. లాక్‌డౌన్ నుంచి బైటపడాల్సిన వ్యూహానికి సంబంధించి రూపొందించిన నోట్‌లో ఫిక్కీ ఈ అంశాలు ప్రస్తావించింది. అటు లాక్‌డౌన్ ఉపసంహరణపై కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా దాదాపు ఇటువంటి సూచనలే చేసింది. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని సూచించింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరో 2 వారాలు లాక్‌డౌన్ కొనసాగించాలని పేర్కొంది. సంఘటితరంగ పరిశ్రమలను 50% సామర్థ్యంతో పనిచేయించి, వారం మార్చి వారం ఉపా«ధి కల్పిస్తే కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించవచ్చని తెలిపింది. ఏప్రిల్ 30 దాకా దేశీవిదేశీ విమానాలు, రైళ్ళు, ఇంటర్‌సిటీ బస్సులు, మెట్రోరైళ్ళు నడపకూడదని, 50% సామర్థ్యంతో ప్రజారవాణా కోసం బస్సులను అనుమతించవచ్చని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment