ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే! Henley and Partners Passport Index 2021, India at 90th Position | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!

Published Sun, Oct 24 2021 8:36 PM | Last Updated on Sun, Oct 24 2021 8:52 PM

Henley and Partners Passport Index 2021, India at 90th Position - Sakshi

ప్రపంచం దేశాల్లోని పాస్‌పోర్టుల్లో అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టుగా జపాన్, సింగపూర్ దేశాల పాస్‌పోర్టు నిలిచింది. జపాన్, సింగపూర్ దేశాల ప్రజలు పాస్‌పోర్టు ఉంటే చాలు వారికి వీసా లేకున్నా 192 దేశాలను చుట్టిరావచ్చు. హెన్లీ & పార్టనర్స్ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జాబితాలోలో భారతదేశం 6 స్థానాలు పడిపోయి 90కి చేరుకుంది. గత ఏడాది మన దేశ ర్యాంకు 85గా ఉంది. జపాన్, సింగపూర్ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ దేశాల వీసా రహిత స్కోరు 192తో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. 

అయితే, భారతదేశం వీసా రహిత స్కోరు 58గా ఉంది. అంటే భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు 58 దేశాలకు వీసా లేకున్నా ఆయా దేశాలకు ప్రయాణించవచ్చు. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ అనేది అంతర్జాతీయ వాయురవాణా అసోసియేషన్ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు) నుంచి సేకరించిన ప్రత్యేక సమాచారంతో ప్రతి ఏటా ప్రపంచ దేశాల్లోని అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టు వివరాలను హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ విడుదల చేస్తుంది. కరోనా మహమ్మారి తర్వాత అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను తొలగిస్తున్న సమయంలో ఈ సూచిక విడుదల అయ్యింది.  జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, పాకిస్తాన్, యెమెన్ దేశాలు ఈ జాబితాలో చిట్ట చివరలో ఉన్నాయి.(చదవండి: మీరు నిజమైన సూపర్ హీరో: ఆనంద్‌ మహీంద్రా)

టాప్ 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు

  1. జపాన్, సింగపూర్ (వీసా రహిత స్కోరు:192)
  2. జర్మనీ, దక్షిణ కొరియా (వీసా రహిత స్కోరు: 190)
  3. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ (వీసా రహిత స్కోరు: 189)
  4. ఆస్ట్రియా, డెన్మార్క్ (వీసా రహిత స్కోరు: 188)
  5. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ (వీసా రహిత స్కోరు: 187)
  6. బెల్జియం, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ (వీసా రహిత స్కోరు: 186)
  7. చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ (వీసా రహిత స్కోరు: 185)
  8. ఆస్ట్రేలియా, కెనడా (వీసా రహిత స్కోరు: 184)
  9. హంగరీ (వీసా రహిత స్కోరు: 183)
  10. లిథువేనియా, పోలాండ్, స్లోవేకియా (వీసా రహిత స్కోరు: 182)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement