కేరళకు చెందిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన వైద్యుడికి చెందిన ఇటలీలో పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు కొట్టేశారు. దీంతో దేశం కాని దేశంలో ఇబ్బందులు పడ్డారు. చివరికి కాంగ్రెస్ ఎంజీ శశిథరూర్ జోక్యంతో అత్యవరసర పాస్‌పోర్ట్‌ల జారీలో భారత కాన్సులేట్ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఈ ఘటన మార్చి 5న ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు ఇటలీలోని మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన డయాబెటిక్ రీసెర్చ్ చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లారు. ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు కొద్దిగా ఆలస్యమైంది. ఇంతలో రైలు రావడంతో లగేజీతో ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కేటుగాడు (ఆఫ్రికన్-అమెరికన్) వీరి బ్యాగును కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత సునీత తన హ్యాండ్‌బ్యాగ్‌ను తెరిచి చూసేసరికి పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు నగదుతో ఉన్న పర్సు పోయిందని గ్రహించారు. దీంతో షాక్ తిన్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు నమోదు తరువాత భారత కాన్సులేట్‌ను సంప్రదించమని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ని సంప్రదించారు. ఆయన వేగంగా స్పందించి, ఇటలీలోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. ఫలితంగా ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్‌పోర్ట్‌లను అందించారు.
దేశం కాని దేశంలో పాస్‌పోర్ట్, వాలెట్ పోగొట్టుకోవడం ఎంత భయంకరమైందో వివరిస్తూ జోతిదేవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్‌పోర్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండటం వల్ల తమకెదురైన ఈ అనుభవం నుంచి తోటి పర్యాటకులు నేర్చుకోవలసిన పాఠం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు.
Glad it all worked out in the end @jothydev ! So pleased our consulate did what was needed so well. @MEAIndia https://t.co/2pTt4DFd4u
— Shashi Tharoor (@ShashiTharoor) March 11, 2024
Comments
Please login to add a commentAdd a comment