Indian consulate
-
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
‘చాలా భయంకరం, ఇలా మీరు చేయకండి’: ఇటలీలో కేరళ వైద్యుడి చేదు అనుభవం
కేరళకు చెందిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన వైద్యుడికి చెందిన ఇటలీలో పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు కొట్టేశారు. దీంతో దేశం కాని దేశంలో ఇబ్బందులు పడ్డారు. చివరికి కాంగ్రెస్ ఎంజీ శశిథరూర్ జోక్యంతో అత్యవరసర పాస్‌పోర్ట్‌ల జారీలో భారత కాన్సులేట్ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? ఈ ఘటన మార్చి 5న ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు ఇటలీలోని మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన డయాబెటిక్ రీసెర్చ్ చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లారు. ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు కొద్దిగా ఆలస్యమైంది. ఇంతలో రైలు రావడంతో లగేజీతో ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కేటుగాడు (ఆఫ్రికన్-అమెరికన్) వీరి బ్యాగును కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత సునీత తన హ్యాండ్‌బ్యాగ్‌ను తెరిచి చూసేసరికి పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు నగదుతో ఉన్న పర్సు పోయిందని గ్రహించారు. దీంతో షాక్ తిన్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు తరువాత భారత కాన్సులేట్‌ను సంప్రదించమని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ని సంప్రదించారు. ఆయన వేగంగా స్పందించి, ఇటలీలోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. ఫలితంగా ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్‌పోర్ట్‌లను అందించారు. దేశం కాని దేశంలో పాస్‌పోర్ట్, వాలెట్ పోగొట్టుకోవడం ఎంత భయంకరమైందో వివరిస్తూ జోతిదేవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్‌పోర్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండటం వల్ల తమకెదురైన ఈ అనుభవం నుంచి తోటి పర్యాటకులు నేర్చుకోవలసిన పాఠం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. Glad it all worked out in the end @jothydev ! So pleased our consulate did what was needed so well. @MEAIndia https://t.co/2pTt4DFd4u — Shashi Tharoor (@ShashiTharoor) March 11, 2024 -
భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు..
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గత నెల ఖలిస్థాన్ వేర్పాటువాది భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు ఈ హింసాకాండకు తెరతీశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పేరిట వేర్పాటువాద సంస్థకు నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పై 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. కెనడాలో గురుద్వారా గుమ్మం వద్దే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు అక్కడి భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఖలిస్తానీలు హింసకు ప్రతిగా హింస అంటూ నినదించారు. గడిచిన ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయంపై దాడులు జరగడం ఇది రెండో సారి. దీంతో అమెరికా ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న దౌత్యాధికారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, శాంతికి భంగం కలిగిస్తే ఎవ్వరినీ సహించేది లేదని వైట్ హౌస్ జాతీయ భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా మాట్లాడుతూ.. నాకు భారత దౌత్యాధికారి సంధు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడన్నా మానవ హక్కుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచనతోనూ, పరిపక్వతతోనూ నిజాయతీగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణం, అప్రజాస్వామికం. అమెరికాలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేఛ్చ ఉంటుంది. అలాగని దాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, హింసను ప్రేరేపించమని కాదు దానర్ధం. ప్రభుత్వం ఈ హింసాకాండపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’ Khalistan supporters’ try to set on fire Indian consulate in San Francisco; US 'strongly condemns’@siddhantvm and @live_pathikrit share their views@Sriya_Kundu | #Khalistan #SanFrancisco pic.twitter.com/wEtGKyfn35 — News18 (@CNNnews18) July 4, 2023 -
అమెరికాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి..
శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఐదు నెలల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. గత మార్చి నెలలోనే ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడి చేశారు. దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగగా అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడినవారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. అమెరికా అధికార ప్రతినిధి ఈ దాడిని ఖండించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm — Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023 మార్చి లోనే.. మార్చి నెలలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు చేపట్టింది ప్రభుత్వం. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ను వదిలేయండి అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు నిర్వహించారు. The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense. — Matthew Miller (@StateDeptSpox) July 3, 2023 ఇదీ చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
ఇండియన్ కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
న్యూఢిల్లీ: ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమృత్‌పాల్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో భారత సంబంధిత దౌత్యపరమైన కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. లండన్‌లో భారత హైకమిషన్ భవనం వద్ద భారతీయ జెండాను కిందకు లాగి అవమానపరిచే యత్నం మరిచిపోకముందే.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడికి పాల్పడ్డారు. పంజాబ్‌లో ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను.. సినీ ఫక్కీ ఛేజ్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రభావం చూపెడుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు భారత దౌతకార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం లండన్‌లోని భారతీయ హైకమిషన్ భవనం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జెండాను కిందకు దించి.. ఖలీస్తానీ జెండాను ఎగరేసే యత్నం చేశారు. అయితే.. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ.. ఆ దేశపు దౌత్యవేత్తలకు వివరణ కోరుతూ సమన్లు సైతం జారీ చేసింది. అయితే.. తాజాగా శాన్ ఫ్రొన్సిస్కో(యూఎస్ స్టేట్ కాలిఫోర్నియా)లోని ఇండియన్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు దాడికి పాల్పడడంతో పాటు అక్కడి గోడలపై ఫ్రీ అమృత్‌పాల్(అమృత్‌పాల్‌ను విడుదల చేయాలి) అంటూ రాతలు రాశారు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ సంగీతం భారీ శబ్ధంతో వినిపిస్తోంది. దాడికి పాల్పడిన దుండగుల్లోనే కొందరు వీడియోలు తీయడం విశేషం ఇక్కడ. ఈ పరిణామంపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. After London, now San Francisco - Indian consulate in San Francisco is attacked by Khalistan supporters. For Modi’s security, Rs 584 crores spent every year, but India’s diplomatic missions are left unsecured. pic.twitter.com/scJ9rKcazW — Ashok Swain (@ashoswai) March 20, 2023 ఇదీ చదవండి: త్రివర్ణ పతాకాన్ని అవమానం నుంచి కాపాడారు! -
Passport: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశానికి వచ్చే పర్యాటకులు, వర్క్ వీసా పొందినవారు పాస్‌పోర్టులలో ఇంటిపేరును తప్పనిసరిగా జత చేయించుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం నిర్దేశించింది. యూఏఈకి వచ్చేవారి వివరాలు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం మేరకు భారతీయులు ఎవరైనా తమ పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకపోతే నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూఏఈలోని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. కొందరి పాస్‌పోర్టులలో ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ కార్డులలో ఇంటి పేరు ఉండకుండా పేరు మాత్రమే ఉంటుంది. పేరు ఒక్కటే ఉండటం వల్ల ఆయా వ్యక్తుల స్పష్టమైన వివరాలు తెలియడం లేదనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఎవరైనా పెళ్లి చేసుకోక ముందు పాస్‌పోర్టు తీసుకుని ఉంటే అందులో భర్త లేదా భార్య(స్పౌస్) పేరు ఉండదు. అలాంటివారు కూడా తమ జీవిత భాగస్వామి పేరును నమోదు చేయించుకోవాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కోరారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అనేక మంది పాస్‌పోర్టులలో వివరాలు స్పష్టంగా లేవు. కొత్త నిబంధనల వల్ల పాస్‌పోర్టులలో పూర్తి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. యూఏఈలో రెన్యువల్‌కు ఇక్కడ విచారణ యూఏఈలో ఉపాధి పొందుతున్నవారు తమ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అక్కడి భారత రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక పోలీసు విభాగం(స్పెషల్ బ్రాంచ్) అధికారులు విచారణ జరుపుతున్నారు. విదేశాల్లో ఉన్న వారు పాస్‌పోర్టు రెన్యువల్‌కు గడువు సమీపిస్తే తాము ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయంలో రెన్యువల్ చేసుకునేవారు. పాత పాస్‌పోర్టునే రెన్యువల్ చేసుకోవడం వల్ల ఎలాంటి విచారణ నిర్వహించకపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సమాచారంతో పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేవారి ఇంటి వద్దకు ఎస్బీ అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుండటం గమనార్హం. పాస్‌పోర్టుల జారీ పారదర్శకంగా ఉండాలన్న కారణంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..) -
భారత సంతతి విద్యార్థిపై దాడి...మోదీజీ సాయం చేయండి అంటూ వేడుకోలు
సిడ్నీ: భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్ గార్గ్‌గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉంటారు. శుభమ్ ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత నెల అక్టోబర్ 6న శుభమ్‌పై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే నిందితుడు 23 ఏళ్ల వ్యక్తి అని, అతను ఆ రోజు శుభమ్ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐతే శుభమ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కత్తితో పలు చోట్ల దాడి చేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత శుభమ్ ఏదోరకంగా సమీపంలోని తన ఇంటికి వెళ్లి తదనంతరం ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భాదితుడి తండ్రి రమణివాస్ గార్గ్ తన కొడుకుకి పొత్తి కడుపులో సుమారు 11 గంటల ఆపరేషన్ జరిగినట్లు చెప్పారు. దయచేసి తన కొడుకు చికిత్సకు సాయం అందించమని, అలాగే తాము ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా వచ్చేలా ఏర్పాటు చేయమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు బాధితుడి చెల్లెలు కావ్య గార్గే ట్విట్టర్లో..."సిడ్నీలో ఉన్న తన సోదరుడు శుభమ్ గార్గ్‌పై చాలా దారుణమైన దాడి జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చూసేందుకు మా కుటుంబానికి అత్యవసర వీసా ఏర్పాటు చేసి సాయం అందించండి" అని ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ మంత్రి జై శంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అభ్యర్థిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాదు తన సోదరుడికి త్వరితగతిన సర్జరీలు చేయకపోతే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారని వాపోయింది. ఈ మేరకు సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం బాధితునికి తగిన సాయం అందిస్తోంది. అంతేగాదు ఆస్ట్రేలియా హై కమిషన్ సదరు బాధిత కుటుంబ సభ్యునికి వీసా సౌకర్యం కల్పించనుందని హై కమిషన్ ప్రతినిధి తెలిపారు (చదవండి: మళ్లీ పేలిన తుపాకీ.. ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం) -
హాని చేస్తే ఎవరినీ వదలం
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే, ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టబోమని చైనాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఇచ్చిన విందులో పాలొన్నారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లతో ఆయన మాట్లాడారు. 2020 మేలో చైనాతో లద్దాఖ్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. ‘భారత సైనికులు సరిహద్దుల్లో ఎలా వీరోచితంగా పోరాడారు, ప్రభుత్వం ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలను బహిరంగంగా చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. హాని చేయాలని చూస్తే ఎంతటి వారినయినా సరే భారత్ వదిలిపెట్టదనే సందేశాన్ని మాత్రం పంపించగలిగాం’అని అన్నారు. అదే విధంగా, అమెరికా వైఖరిపైనా రాజ్‌నాథ్ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. ఒక దేశంతో కొనసాగించే సంబంధాలు మరో దేశానికి నష్టం కలిగించకూడదనేదే భారత్ విధానమన్నారు. ఒక్కరికి మాత్రమే లాభం కలిగించే దౌత్య విధానాలపై తమకు నమ్మకం లేదని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరిపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక దేశంతో సత్సంబంధాలను కలిగి ఉండటం అంటే..మరో దేశంతో తెగదెంపులు చేసుకోవడం కాదన్నారు. ఇరుపక్షాలకు లాభదాయకమైన ద్వైపాక్షిక సంబంధాలనే భారత్ కోరుకుంటుందన్నారు. భారత్ బలహీనం కాదు, శక్తివంతమైన దేశమనే విషయం ఇప్పుడు ప్రపంచదేశాలకు తెలిసిందన్నారు. భారత్–అమెరికా సంబంధాలు మరింత బలీయంగా కావడం వెనుక భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. సంస్కృతీ సంప్రదాయాలను మరవొద్దని కోరారు. గుటెరస్‌తో జై శంకర్ భేటీ విదేశాంగమంత్రి జై శంకర్ గురువారం ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో సమావేశమయ్యారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లలో పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు జై శంకర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం.. ముఖ్యంగా ఇంధన, ఆహార భద్రత. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతున్న ప్రభావం వంటివాటిపై గుటెర్రస్‌తో అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆయన వివరించారు. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు గుటెర్రస్ ఆసక్తి చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్–అమెరికా మధ్య జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు రాజ్‌నాథ్, జై శంకర్ ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నారు. -
దేశం మారినా.. మీ బుద్ధి మాత్రం మారదు కదా
వాషింగ్టన్: దేశం కాని దేశంలో మనవాళ్లకు ఏదైనా ప్రమాదం వాటిల్లినా.. ఆపద వచ్చినా.. కాన్సులేట్ అధికారులు ఆదుకుంటారనే నమ్మకం ఉంటుంది. కాన్సులేట్ అధికారులంటే విదేశాల్లో ఉన్న వారికి.. ఇక్కడ వారి కుటుంబీకులకు మధ్య వారధిగా ఉండాలి. కానీ మన దగ్గర కొందరు ప్రభుత్వ అధికారుల్లో ఒక లాంటి మనస్తత్వం ఉంటుంది. తాము ఇతరులకంటే అతీతులమని ఫీలవుతుంటారు. తాము ఉన్నది ప్రజా సేవకు అనే విషయం మర్చిపోయి.. సామాన్యులతో చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా అలానే ప్రవర్తిస్తారు. దేశం మారినా వీరి బుద్ధి మాత్రం మారదు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాక్ షో వ్యాఖ్యాత సిమి గరేవాల్ తన ట్విటర్లో షేర్ చేసిన వీడియో వివరాలు.. న్యూయార్క్ భారత కాన్సులేట్‌లో నవంబర్ 24న ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిలో ఓ మహిళ కాన్సులేట్ అధికారితో మాట్లాడుతూ ఉంటుంది. సదరు మహిళ తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఆమె ఇండియా వెళ్లడానికి వీసా కోసం అప్లై చేస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫీజు అన్ని సబ్మిట్ చేసినప్పటికి.. కాన్సులేట్ అధికారి ఆమెకు వీసా నిరాకరిస్తాడు. ఆమె తన పరిస్థితిని వివరించి.. వీసా మంజూరు చేయాల్సిందిగా కోరుతుంది. (చదవండి: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!) కానీ ఆ అధికారి ఆమె మాటలను అసలు పట్టించుకోడు. పైగా చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆమె సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని కూడా విసురుగా పడేస్తాడు. ఆమె ఎంత బ్రతిమిలాడుతున్నా.. ఆమె వాదన వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోతాడు. అయితే అంతసేపు జరిగిన తతంగాన్నంత ఆమె వీడియో తీస్తుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ సదరు మహిళ వద్దకు వచ్చి వీడియో తీయోద్దని కోరతాడు. (చదవండి: ఆనంద్ మహీంద్రా ట్వీట్: ‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్.. డబ్బా వాలీ’) ఈ వీడియోని సిమి గరేవాల్ తన ట్విటర్లో షేర్ చేసిన సదరు కాన్సులేట్ అధికారి ప్రవర్తన సరికాదని ట్వీట్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరలయ్యింది. చాలా మంది న్యూయార్క్ కాన్సులేట్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు చాలా సహజం అని.. అక్కడి అధికారులు ఇంతే రూడ్‌గా ప్రవర్తిస్తారని గతంలో తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేశారు. సదరు అధికారిని నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. On 24/11/2021. Indian embassy New York. Her father had died & she wanted a visa for India. This is the obnoxious behavior of an Indian officer in the New York Consulate towards her. @DrSJaishankar @MEAIndia @PMOIndia you can't ignore this. pic.twitter.com/7ckWXnJqP0 — Simi Garewal (@Simi_Garewal) November 30, 2021 చదవండి: తమ్ముడి కోసం చిట్టితల్లి సాహసం -
US returns 250 antiquities: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత
న్యూయార్క్: అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు15 మిలియన్ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్ తిరిగి ఇచ్చింది. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన వేడుకలో భారత్‌కి అందజేసారు. ఈ మేరకు ఈ వస్తువులు మాన్హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం, యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ జరిపిన సుదీర్ఢ దర్యాప్తులో వెలుగు చూశాయి. ఈ సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ.. డీలర్ సుభాష్ కపూర్ యునైటెడ్ స్టేట్స్కు పదివేల పురాతన వస్తువులపై అక్రమంగా తరలించారని ఆరోపణల నేపథ్యంలో విస్తృత దర్యాప్తు పై దృష్టి సారించాం. తమ సుదీర్ఘ దర్యాప్తు ఫలితంగా 143 మిలియన్ల డాలర్ల విలువైన 2,500 కళాఖండాలు తిరిగి సంపాదించగలిగాం. ఈ నేరానికి పాల్పడిన కపూర్ అతని సహ కుట్రదారులు తగిన శిక్ష పడుతంది. అయితే కపూర్ ప్రస్తుతం భారతదేశం జైలులో ఉన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు దర్యాప్తును యూఎస్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కపూర్ గ్యాలరీ నుంచి వాటిని సేకరించిన యూఎస్.. భారత్‌కు అప్పగించింది. భారతదేశం, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల నుండి దోచుకున్న నిధులను రవాణా చేయడానికి న్యూయార్క్‌లోని తన ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీని వినియోగించారు. ఈ క్రమంలో కపూర్ పురాతన వస్తువులను వెతకడానికి ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. దేవాలయాల నుంచి పురాతన వస్తువుల్ని దొంగలిస్తూ వాటిని రహస్యంగా తరలించేవాడు. -
భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు
న్యూఢిల్లీ: తాలిబన్ల మాటలకు చేసే చేష్టలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలో విదేశీ ప్రతినిధులకు, కార్యాలయాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన వారు తమ నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసేసినప్పటికీ తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలేమైనా దొరుకుతాయేమోనని కార్యాలయాల్లో అణువణువూ గాలించారు. కాందహార్, హెరాత్‌లో ఉన్న భారత కాన్సులేట్లలో బుధవారం తాలిబన్లు సోదాలు నిర్వహించి కార్యాలయం అంతటినీ చిందరవందర చేసి పడేశారు.ఆ కార్యాలయాల ఆవరణల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలను తమ వెంట తీసుకువెళ్లినట్టు శుక్రవారం దౌత్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. (చదవండి: ‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’) ‘‘మేము ఈ విషయం ముందే ఊహించాం. తాలిబన్లు భారత కాన్సులేట్లను అణువణువు తనిఖీ చేశారు. కీలక పత్రాలేమైనా లభిస్తాయేమోనని గాలించారు. మేము పార్క్ చేసిన వాహనాలను తీసుకువెళ్లి పోయారు’’అని అ అధికారి వెల్లడించారు. సోదాలకు కొద్ది రోజుల ముందే అఫ్గాన్‌లో భారత రాయబారి సిబ్బందికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తాలిబన్ రాజకీయ విభాగం నుంచి సందేశం వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారత్ దౌత్య సిబ్బంది, భద్రతా అధికారుల్ని వెనక్కి తీసుకు వచ్చేసింది. 31 వరకు వేచి చూసే ధోరణి అఫ్గానిస్తాన్‌లో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై తాలిబన్లకు ఈ నెల 31 వరకు ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని అఫ్గాన్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తన సైనిక బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరిస్తామని చెప్పడంతో అప్పటివరకు వారు వేచి చూసే ధోరణిలో ఉంటారని ఆ అధికారి తెలిపారు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు వరకు తాలిబన్లు చేసేదేమీ లేదన్నారు. ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని కొత్త ప్రభుత్వంలో చేర్చుకుంటామని తాలిబన్లు చెప్పినా మాటపై నిలబడతారన్న నమ్మకం ఎవరికీ లేదు. -
కాన్సులేట్‌పై దాడిలో 8 మంది మృతి
అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్ పట్టణంలో భారత రాయబార కార్యాలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఒక పోలీసు, ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. భారతీయ దౌత్యవేత్తలు, కార్యాలయ ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నారు. ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో 19 మంది పౌరులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నాన్గర్హర్ రాష్ట్ర రాజధాని అయిన జలాలాబాద్ నగరం తరచు తాలిబన్ ఉగ్రవాదుల దాడులకు లక్ష్యంగా మారుతుంది. 2013లో కూడా భారత కాన్సులేట్‌పై ఒకసారి దాడి జరిగింది. అయితే, బుధవారం నాటి దాడి చేసింది తామంటూ ఎవరూ ఇంతవరకు ప్రకటించుకోలేదు. ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ కాన్సులేట్ ముందుగేటు వద్దకు చేరుకుని, తనను తాను పేల్చుకున్నాడు. దాంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఆ సమయం చూసుకుని మిగిలిన ఉగ్రవాదులు భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసు అధికారి ఫజల్ అహ్మద్ షిర్జాద్ తెలిపారు. మజార్-ఇ-షరీఫ్ నగరంలో భారత దౌత్యకార్యాలయంపై గత జనవరిలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 2008, 2009, 2013, 2014 సంవత్సరాల్లో కూడా కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం పై ఉగ్రవాద దాడులు జరిగాయి. 2013 నాటి ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు చనిపోయారు. -
భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు
-
భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు
- అఫ్ఘానిస్థాన్ లో ఇరుదేశాల కాన్సులేట్ ల వద్ద ఉగ్రవాదుల దుశ్చర్య విదేశీ దౌత్యకార్యాలయాలే లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నంగార్హర్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ లో గల ఇండియన్ పాకిస్థానీ కానసులేట్ లకు అతి సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీనిని ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా అభివర్ణించిన స్థానిక అధికారులు.. పేలడులో నలుగురు పోలీసులు చనిపోయారని, పేలుడు తర్వాత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, అయితే భారత దౌత్యకార్యాలయ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. పేలుడు అనంతరం పాకిస్థాన్ తన దౌత్యకార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. మజర్ ఇ షరీఫ్ పట్టణంలోని భారత దౌత్యకార్యాలయం దాడి జరిగిన 10 రోజులకే, జలాలాబాద్ లో మరో సంఘటన చోటుచేసుకోవటంతో దౌత్యాధికారుల గుండెల్లో గుబులురేపింది. -
ప్రతీకారంతోనే దాడులు చేశామని నెత్తుటితో రాశారు!
కాబూల్: అఫ్జల్ గురు మృతికి ప్రతీకారంగానే అఫ్గనిస్థాన్ మజర్ ఇ షరీఫ్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశామంటూ ఉగ్రవాదులు నెత్తుటితో రాసిన రాతలు తాజాగా వెలుగుచూశాయి. 'అఫ్జల్ గురు తరఫున ప్రతీకారంగానే' (అఫ్జల్ గురుకా ఇంతెకామ్), 'ఒక అమరుడు, వేలమంది ఆత్మాహుతి బాంబర్లు' (ఏక్ షహీద్, హజార్ ఫిదాయి) అంటూ భారత కాన్సులేట్ గోడలపై ఉగ్రవాదులు నెత్తుటితో రాశారు. ఉత్తర అఫ్గన్ నగరమైన మజర్ ఇ షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదులు ఆదివారం దాడి చేసేందుకు ప్రయత్నించారు. కాన్సులేట్ ప్రాంగణంలోకి చొరబడే క్రమంలో బాంబులు పేల్చారు. వీరి దాడిని అఫ్గన్ భద్రతా దళాలు తిప్పికొట్టాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు తూర్పు అఫ్గన్ నగరమైన జలలాబాద్లోని భారత కాన్సులేట్ వద్ద మంగళవారం చిన్నపాటి పేలుడు సంభవించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో అఫ్గన్‌లో ఈ ఘటనలు జరుగడం గమనార్హం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడులకు దిగిన ఉగ్రవాదులు కూడా తాము అఫ్జల్‌గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు 2013 ఫిబ్రవరి 9న ఉరితీసిన సంగతి తెలిసిందే. -
భారత్‌పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..!
వాషింగ్టన్: భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగడంపట్ల అమెరికాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి భారీ ముంపు పొంచి ఉందనడానికి ఇదొక హెచ్చరికలాంటిదని అన్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపైనా, మరోపక్క, అఫ్గానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపైన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీలో కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మాన్(61) ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్లో పర్యటించిన మూలంగానే ఈ దాడి జరిగిందని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయినా, ఆ రెండు దేశాల నేతల ఏ మాత్రం వీటికి వెరువకుండా పరిష్కార మార్గాలకోసం ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంకోసం చిన్న మూలాన్ని కూడా వదిలిపెట్టవద్దని, దాన్ని రూపుమాపి ఇరు దేశాలకు న్యాయం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్, పాకిస్థాన్ కు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహకారం అందించాలని కోరారు. ఈ దాడులు ప్రపంచ దేశాలకు మరో హెచ్చరిక అనే విషయం ఏ మాత్రం మర్చిపోకూడదని చెప్పారు. -
భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్
కాబూల్: అఫ్గనిస్థాన్‌లోని భారత కాన్సులేట్ రక్షణార్థం సాక్షాత్తూ అక్కడి గవర్నర్ తుపాకీ పట్టి కాసేపు పహారా కాసారు. బాల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్ అయిన అతా మహమ్మద్ నూర్ సోమవారం తుపాకీ పట్టుకొని మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయంలో కనిపించారు. భారత కాన్సులేట్ లక్ష్యంగా ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని అఫ్గన్ భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో బాల్ఖ్ రాజధాని అయిన మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి నూర్ మద్దతుగా నిలిచారు. కాన్సులేట్ వద్ద పహారా కాస్తున్న సైనికులతో ఆయన కాసేపు ముచ్చటించి.. పరిస్థితి సమీక్షించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా తుపాకీ పట్టుకొని.. గురి చూసి కాలుస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను నూర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ఆన్లైన్ లో హల్చల్ చేశాయి. 'మజర్ ఆపరేషన్ పూర్తికావొస్తుంది. పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగాయి. గవర్నర్ నూర్ వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాన్సులేట్ లోని అందరూ క్షేమంగా ఉన్నారు' అని అఫ్గన్‌లోని భారత రాయబారి అమర్ సిన్హా ట్వీట్ చేశారు. ఆపదలో ఒక స్నేహితుడిలా అండగా నిలిచి.. గవర్నర్ తుపాకీ పట్టారంటూ స్థానిక జర్నలిస్టు చేసిన ట్వీట్ ను కూడా అమర్ సిన్హా రీట్వీట్ చేశారు. నూర్ మాజీ ముజాహిద్దీన్. అఫ్గన్ లో సొవియట్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ పోరాడిన ఆయన సైనిక శిక్షణ పొందారు. అఫ్గన్ లో తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అహ్మద్ షా మసూద్ సైన్యంలో కమాండర్ గా పనిచేవారు. భారత కాన్సులేట్ ముట్టడికి ఉగ్రవాదులు చేసిన దాడిని అఫ్గన్ బలగాలు విఫలం చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో ఈ ఆపరేషన్ సోమవారం రాత్రితో ముగిసింది. -
అఫ్గాన్ ఆపరేషన్ సక్సెస్
* ఉగ్రవాదులందరూ హతం * అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడిని తిప్పికొట్టిన భద్రతాదళాలు * ఉగ్రదాడిని సమర్ధంగా ఎదుర్కొన్న ఐటీబీపీ, అఫ్గాన్ నేషనల్ పోలీస్ కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లోని మజర్ ఇ షరీఫ్ పట్టణంలో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. దాదాపు 25 గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతమైంది. భారత దౌత్య కార్యాలయం ఉన్న భవనంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదివారం రాత్రే భద్రతాదళాలు అంతమొందించగా.. పక్కనే భవనంలో దాగి, కాల్పులు, గ్రెనేడ్ దాడులకు పాల్పడిన మిగతా వారిని సోమవారం హతమార్చారు. ఆపరేషన్ పూర్తయినట్లు అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించిందని భారతీయ అధికార వర్గాలు తెలిపాయి. టైస్టులందరినీ హతమార్చామని మజర్ ఇ షరీఫ్‌లోని పోలీస్ ఉన్నతాధికారి సయ్యద్ కమల్ సాదత్ ప్రకటించారు. ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. ఈ దాడిలో ఒక పోలీస్ చనిపోయాడని, 11 మంది గాయపడ్డారని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో భారత రాయబార కార్యాలయం ఉన్న ఐదంతస్తుల భవనంపైకి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. పక్కనే ఉన్న భవనం నుంచి రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలతో ముప్పేట దాడిని కొనసాగించారు. దౌత్యకార్యాలయానికి రక్షణగా ఉన్న సుశిక్షిత ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కమెండోలు తక్షణమే స్పందించి, ఎదురు దాడి ప్రారంభించారు. అనంతరం అఫ్గాన్ జాతీయ పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్ర మూకలను తుదముట్టించే ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య చాలా సేపు పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగాయి. దౌత్య కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముష్కరులను తుదముట్టించారు. ఉగ్రవాదులు దాగిన ఐదంతస్తుల భవనంపైకి హెలీకాప్టర్ ద్వారా దిగిన కమెండోలు ఒక్కో అంతస్తును జల్లెడబట్టి, మిగతా టైస్టులను కూడా అంతమొందించారు. ఈ ఆపరేషన్ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. భారత దౌత్య కార్యాలయంపైకి ఉగ్రవాదులు రాకెట్ ద్వారా ప్రయోగించిన దాదాపు 7 గ్రెనేడ్లు కొద్దిలో లక్ష్యాన్ని తప్పాయి. ఐదుగురు, లేదా ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొని ఉండొచ్చని భద్రతావర్గాలు భావిస్తున్నాయి. భారత కాన్సులేట్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని తెలిపాయి. మోదీకి ఘనీ ఫోన్: మజర్ ఇ షరీఫ్‌పై ఉగ్రదాడి ఘటన వివరాలను అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ భారత ప్రధాని మోదీకి వివరించారు. సోమవారం మోదీకి ఫోన్ చేసిన ఘనీ.. పఠాన్‌కోట్‌లో జరిగిన సీమాంతర ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రదాడిని సమర్ధంగా తిప్పికొట్టిన అఫ్గాన్ జాతీయ భద్రతా బలగాలను ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. అఫ్గాన్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాబూల్‌లో ఆత్మాహుతి దాడి కాబూల్‌లోని విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో సోమవారం ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దాడిలో మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. కానీ విమానాశ్రయానికి వెళ్తున్న విదేశీ భద్రతా దళాల వాహన శ్రేణి లక్ష్యంగా ఆ దాడి జరిగిందని భావిస్తున్నారు. కాబూల్‌లోనే జరిగిన మరో ఘటనలో కారుబాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, అమెరికాల మధ్య చర్చలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ నెల 11న పాకిస్తాన్లో మొదటి రౌండ్ చర్చలు జరగనున్న నేపథ్యంలో.. అఫ్గాన్‌లో ఉగ్ర బీభత్సం ఊపందుకోవడం గమనార్హం. -
అఫ్గానిస్తాన్‌లో భారత్ కాన్సులేట్‌పై దాడి
అఫ్గానిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్ నగరంలో గల భారత దౌత్యకార్యాలయంపై ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో) ఉగ్రవాదులు దాడికి దిగారు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులతో కార్యాలయ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అఫ్గాన్ ఉత్తర ప్రాంతంలో గల మాజర్-ఇ-షరీఫ్ నగరంలోని దౌత్య కార్యాలయంలో ముగ్గురు భారతీయ సిబ్బంది ఉన్నారు. కార్యాలయ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అక్కడి భారత కాన్సుల్ జనరల్ బి.సర్కార్ తెలిపారు. పొరుగున ఉన్న భవనం నుంచి సాయుధ దుండగులు కాల్పులు జరిపారని.. కార్యాలయ భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులతో తిప్పికొట్టారని ఆయన వివరించారు. అయితే.. తమపై దాడి జరుగుతోందని, ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని కార్యాలయంలోని భారతీయ అధికారి ఒకరు పేర్కొన్నారు. అఫ్గాన్‌లో దౌత్యకార్యాలయంపై దాడిని నిర్ధారించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ.. దానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని చెప్పింది. అయితే.. నలుగురు ఉగ్రవాదులు బాంబులు, తుపాకులతో దాడికి పాల్పడ్డారని.. వారిలో ఇద్దరిని భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయని టీవీ చానళ్లలో వార్తలు వెలువడ్డాయి. మరో ఇద్దరు పరారయ్యారని, వారు సమీపంలోని ఒక భవనంలో దాక్కున్నారని.. వారిపై అఫ్గాన్ దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయని ఆ కథనాలు తెలిపాయి. భారతదేశంలోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి దిగగా.. వారితో దాదాపు 40 గంటలుగా భద్రతాదళాల పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు అఫ్గాన్‌లో భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి దిగటం నిర్ఘాం తపరుస్తోంది. అదీగాక.. ప్రధానమంత్రి నరేం ద్రమోదీ అఫ్గానిస్తాన్‌లో పర్యటించి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి భారత దౌత్యకార్యాలయంపై దాడి జరగటం గమనార్హం. 2008, 2009, 2013, 2014 సంవత్సరాల్లో కూడా కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం పై ఉగ్రవాద దాడులు జరిగాయి. 2013 నాటి ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు చనిపోయారు. -
ఛోటారాజన్‌కు భారత పాస్‌పోర్ట్ ఎలా వచ్చింది?
ముంబై: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటారాజన్ అరెస్టుతో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజన్ వద్ద నుంచి ప్రామాణికమైన ఒరిజనల్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకోవడం భద్రతావర్గాలను విస్మయపరుస్తున్నది. సాధారణంగా సామాన్య ప్రజలు పాస్ పోర్టు కావాలంటే ప్రామాణికమైన పత్రాలున్నా.. అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటిది రాజన్ కు సిడ్నీలోని భారత కాన్సులేట్ ద్వారా ప్రామాణిక పాస్ పోర్టు లభించడంలో ఎవరు సహకారం అందించారు? అసలు సరైన తనిఖీలు చేయకుండానే రాయబార కార్యాలయం అధికారులు రాజన్ చేతిలో పాస్ పోర్టు పెట్టారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కర్ణాటక మాండ్యకు చెందిన మోహన్ కుమార్ పేరిట భారత పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్న ఛోటా రాజన్ ను బాలీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. అతనికి 2008 జూలై 8న భారత సిడ్నీలోని భారత కాన్సులేట్ ఈ పాస్ పోర్టు జారీచేసింది. అయితే రాజన్ కొత్త పాస్ పోర్టుకు ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకున్నాడా? లేక తన పాస్ పోర్టు పోయిందని మరో పాస్ పోర్టు పొందాడా? అన్నది తెలియాల్సి ఉంది. కొత్త పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా తన పాత పాస్ పోర్టు నెంబర్ తో సహా వివరాలు తెలియజేయాలి. అయితే, ఈ నిబంధనలన్నింటినీ దాటుకొని, మారుపేరుతో రాజన్ పాస్ పోర్టు ఎలా పొందాడన్నదే ఇప్పుడు భద్రతా వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది. సామాన్యులు పాస్ పోర్టు పొందడానికి సవాలక్ష ఇబ్బందులు పడుతుంటే, పేరుమోసిన డాన్ లు, నేరగాళ్లు అవలీలగా మారుపేర్లతో అక్రమంగా పాస్ పోర్టులు తీసుకొని విదేశాల్లో యథేచ్ఛగా తిరుగడంపై వారు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్
♦ 7 శాతం వృద్ధి రేటుతో ♦ 2050 నాటికి సాధ్యమే ♦ ప్రపంచబ్యాంక్ అంచనా న్యూయార్క్ : వచ్చే 30-35 సంవత్సరాల పాటు ఏటా ఏడు శాతం వృద్ధి రేటు కొనసాగించగలిగితే 2050 నాటికి లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ప్రపంచ బ్యాంకు ఈడీ సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. ప్రస్తుతం 2,000 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 40,000 డాలర్లకు చేరగలదని తద్వారా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు ప్రజలు కూడా సంపన్నులు కాగలరని ఆయన వివరించారు. ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఏకంగా 35 సంవత్సరాల పాటు ఏడు శాతం వృద్ధి రేటును నిలకడగా కొనసాగించగలగడం చాలా కష్టంతో కూడుకున్నదని, ఇందుకోసం ఎకానమీ నిర్వహణ తీరును భారీగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయాన్ని సమూలంగా సంస్కరించుకోవాలని, సర్వీసులు, తయారీ రంగాలతో పాటు హెల్త్‌కేర్, టూరిజం మొదలైన వాటికి ఊతమివ్వాలని గర్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత జనాభాలో 55 శాతం మంది ఇప్పటికే సర్వీసుల రంగంలో ఉన్నారని, దీన్ని 80-85 శాతానికి పెంచుకోవాలని గర్గ్ తెలిపారు. కానీ వ్యవసాయం నుంచి ప్రజలను తయారీ, సర్వీసుల రంగాల వైపు మళ్లించడం పెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా కొత్త అంశంలో నైపుణ్యం పొందిన పది-ఇరవై లక్షల మంది సుశిక్షితులను ప్రపంచానికి అందించేలా భార త్ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. -
మోడీపై సంధించిన ‘హెరాత్’
బైలైన్ ఎంజే అక్బర్ తాలిబన్లు అఫ్ఘాన్‌లోని మన దౌత్య కార్యాలయంపై సాగించిన విధ్వంసం, విధ్వంసం కోసమే జరిగింది కాదు. అంతకు మించిన మానసిక ప్రభావాన్ని కలుగజేయాలని ఉద్దేశించినది. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా... బందీలుగా పట్టుకున్న భారతీయులను ఒక్కొక్కరిని హతమార్చుతుండటం ఆయనకు ఎంతటి కఠిన పరీక్ష అయ్యేదో ఊహించవచ్చు. ముసుగు యుద్ధం ముందస్తు హెచ్చరికతో మొదలయ్యేది కాదు. అది సైన్యం చేసే యుద్ధం కాదు, మిలిటెంట్లు చేసేది. దేశం పేరు మీద లేక అందరి ఆమోదాన్ని పొందిన జెనీవా ఒప్పందం నిబంధనలకు కట్టుబడి చేసే యుద్ధం కాదు. ఏదో ఒక అభూత కాల్పనిక లక్ష్యాన్ని అన్వేషిస్తూ వర్తమాన వ్యవస్థను ధ్వంసించడానికి పాశవికత, ఉగ్రవాదాలతో చేసే కార్యాచరణ అది. ఈ యుద్ధంలోని హింసాకాండ చుక్కల్లాగా పదుల సంఖ్యలోని భౌగోళిక స్థలాలపై పరుచుకుని ఉంటుంది. ఉగ్రవాది మనస్సులో ఆ చుక్కలన్నీ ఒక దానితో ఒకటి కలిసి మొత్తం చిత్తరువు రూపుదిద్దుకుంటుంది. అఫ్ఘానిస్థాన్ నుంచి నాటో సేనల ఉపసంహరణ అనంతరపు శకంలోని తొలి దాడి మొదలైంది. అమెరికా మిలిటరీ అకాడమీలో పట్టభద్రులైన 2014 తరగతి క్యాడెట్లనుద్దేశించి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగిస్తుండగా ఆ దాడి జరగడం పూర్తిగా తార్కికమైనదే. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడి (9/11) తర్వాత అఫ్ఘాన్ లేదా ఇరాక్ యుద్ధాల్లో పాల్గొనాల్సిన అవసరం లేని మొదటి బ్యాచ్ క్యాడెట్లు వారేనని ఒబామా ఆ సందర్భంగా అన్నారు. 9/11కు చాలా ముందు నుంచి పోరాడుతూ, అమెరికా సేనలు (అమెరికా కూడా కాదనే ఆశ) రణ రంగాన్ని వీడిన చాలా కాలం తర్వాత సైతం పోరాడుతూనే ఉండే ‘వారికి’ ఆ సందేశం స్పష్టంగా, గట్టిగా వినిపించింది. ఇంతకూ ‘వారు’ ఎవరు? భిన్న తాలిబన్ గ్రూపులూ, లష్కరే తోయిబా వంటి వారి భావజాల సహోదరులూ, అలాంటి లక్ష్యాలనే కలిగివున్నా ఆయా సంస్థల ముద్రలు వేయించుకోకుండా పని చేయడమే తమ ఆశయ సాధనకు మంచిదని భావించే వ్యక్తులు, అధికారులందరితో కూడిన కూటమికి చెందినవారంతా. ఆ కూటమిని ‘తాలిబన్ ప్లస్’గా అభివర్ణించడం ఉత్తమం. వారి ప్రథమ శత్రువు భారతదేశమే. హెరాత్‌లోని మన దౌత్య కార్యాలయం వారి మొదటి లక్ష్యం. ఆ విధ్వంసం, విధ్వంసం కోసమే జరిగింది కాదు. అంతకు మించిన మానసిక ప్రభావాన్ని కలుగజేయాలని ఉద్దేశించినది. భారత్‌లో ప్రభుత్వం మారుతుండటమనే పెద్ద పరిణామం జరుగుతుండగా భారత దౌత్యవేత్తలను, ఇతర సిబ్బందిని బందీలను చేసి, వారి ప్రాణాలను పణంగా పెట్టి బేరసారాలు సాగించడమే వారి అసలు ఉద్దేశం. ఉగ్రవాదంపట్ల కఠోర వైఖరిని ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా... ఒక్కొక్కరుగా భారతీయులను హతమార్చుతుండటం ఆయనకు ఎంతటి కఠిన పరీక్ష అయ్యేదో ఊహించవచ్చు. దక్షిణ ఆసియా ప్రాంత ప్రభుత్వాల మధ్య ఏర్పడే ప్రవర్తనా పరమైన వివిధ సమీకరణలు, సమ్మేళనాలను పరిగణనలోకి తీసుకుని చూడండి. ఎంతమంది సార్క్ నేతలు ప్రమాణ స్వీకారానికి రాగలిగేవారు లేదా వచ్చి ఉండేవారు? ఇంత జరుగుతున్నా మోడీ తమను ఆహ్వానించాలనే అనుకుంటున్నారా? అని వారు తప్పక అనుకునేవారు. ప్రజాగ్రహం ఎంతగా కట్టలు తెంచుకునేది? మన టెలివిజన్ చానళ్లలో క్రమం తప్పకుండా దర్శనమిచ్చే పాక్ వ్యతిరేక దుందుడుకు వైఖరి వత్తాసుదార్లు ఉప్పందించడంతో ఆ ఆగ్రహం మరింకెంతో ఉప్పొంగిపోయేది కాదా? ఉద్వేగభరితమైన ఉద్రిక్తత లు మన వీధుల్లో హింసకు దారి తీసేవి కావా? సమాధానాలు మనకు తెలియదు. కానీ అవి మన భద్ర తా వ్యవస్థ నేతల ఆలోచనల్లో సుళ్లు తిరిగే ఉండాలి. అదృష్టవశాత్తూ ప్రధాని నరేంద్రమోడీ అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. దోవల్ మన ఇంటెలిజెన్స్ సంస్థల హీరో. ఆ శక్తులు విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తరలించి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని పరీక్షకు గురిచేయడాన్ని ఆయన చూశారు. మన పారా మిలిటరీ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాల ఫలితంగా హెరాత్ కుట్ర విఫలమైంది. ఏంతో కాలం గడవక ముందే మోడీ ప్రభుత్వం ఇలాంటి పరీక్షకు మళ్లీ గురికానున్నదనడం నిస్సందేహం. మన దేశంలోని ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి మూడు విస్పష్ట పార్శ్వాలున్నాయి. అఫ్ఘానిస్థాన్లోని భారతీయుల ఉనికి కచ్చితంగా దౌత్య కార్యకలాపాల పరిధికి, అంతకంటే విస్తృత స్థాయిలోని అభివృద్ధి ప్రాజెక్టుల పరిధికి మాత్రమే పరిమితం. అయినా తాలిబన్ ప్లస్ దాన్ని ‘ఇస్లామిక్ ప్రాంతంలోకి ప్రమాదకరమైన చొరబాటు’గానే చూస్తోంది. అది సోవియట్ లేదా అమెరికా జోక్యం కంటే ఏ మాత్రం తక్కువ తప్పు పట్టాల్సింది కాదని వారు భావిస్తున్నారు. సోవియట్, నాటో సేనలను తరిమేసినవాళ్లకు... భారత్ మనకెంత అనిపించకపోదు. ఈ వైఖరికి పాకిస్థాన్‌లోని అధిక సంఖ్యాకుల మద్దతు లభిస్తోందనడానికి ప్రత్యేకించి ఆధారాలు కావాలనుకునేవారు ఆ టీవీ చానళ్ల చర్చలను గమనించడం సరిపోతుంది. ఇక వారి రెండో లక్ష్యం, చెప్పాల్సిన పనే ముంది... కాశ్మీర్లోయే. అఫ్ఘాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక కాశ్మీర్లో హింసాకాండ వెల్లువెత్తింది. తాలిబన్లతో పాటూ పాక్ సైనిక నేతలు ఉంటడం, వారికి నాయక త్వం వహించడమే అందుకు ప్రధాన కారణం. అఫ్ఘాన్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు పాక్ ప్రభుత్వం తాలిబన్ శ్రేణులలోని తమ సైనికులను, ఆఫీసర్లను స్వదేశానికి రప్పించుకోవడానికి గడువును కోరింది. మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరీకరించడం వారి మూడవ లక్ష్యం. తాలిబన్లు ప్రతిపాదించే మతస్వామ్య నమూనాకు భిన్నంగా లౌకిక ప్రజాస్వామ్యం యువతను ఆకట్టుకునే ప్రత్యామ్నాయం. ఈ వాస్తవం చాలా మంది పాకిస్థానీలలోని ఉన్మాదాన్ని ఎందుకు నయం చేయలేకపోతోందనేది ఆశ్చర్యకరం. హఫీజ్ సయీద్, అతని అనుచరులది కేవలం ఒక్క భారత్‌కు మాత్రమే పరిమితమైన ఎజెండా అని భావిస్తే అది పెద్ద పొరబాటు. పాకిస్థానీల కోసం కూడా వారి వద్ద ఎజెండా ఉంది. భారత్‌ను మతస్వామ్య దేశంగా మార్చలేకపోతే, అప్పుడు వాళ్లు పాక్‌ను మతస్వామ్యంగా మార్చడానికి ప్రయత్నించే అవకాశం పూర్తిగా ఉంది. ఈ నాటో అనంతర యుద్ధం ఒక్క దక్షిణ ఆసియాకే పరిమితమయ్యేది కాదు. అది చైనాను, మధ్య ఆసియాలోని పలు ముస్లిం మెజారిటీ దేశాలను కూడా అందులోకి ఈడుస్తుంది. చైనా ఈ ముప్పు విస్తృతిని గ్రహించడం ప్రారంభించింది. అయితే అది తన విధానాలను మార్చుకోడానికి సమయం తీసుకుంటుంది. యదార్థాలే ఆ మార్పును తీసుకొస్తాయి. భారత, చైనాలు తమ తమ జాతీయ ప్రయోజనాల కోసమే అయినాగానీ సంక్లిష్టమైన ఈ యుద్ధంలో ఒకే పక్షాన నిలిచే సమయం రానుంది. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
భారత్ ఎంబసీపై దాడిని ఖండించిన మోడీ
న్యూఢీల్లీ : అఫ్ఘానిస్థాన్లోని భారత దౌత్య కార్యాలయంపై దాడిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ఆప్ఘన్లోని రాయబారితో చర్చించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మోడీ తెలిపారు. కాగా హెరాత్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడిన నలుగురు దుండగులు భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. దాడి ఘటనను విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా హెరాత్ నగరంలోని భారతీయ దౌత్య కార్యాలయంపై శుక్రవారం ఉదయం తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దౌత్య కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఐటీబీపీ, ఆఫ్ఘాన్ దళాలను రంగంలోకి దింపింది. దాంతో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా భారతీయ దౌత్య కార్యాలయంలోని సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఆఫ్ఘాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి
-
ఆఫ్ఘాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి
ఆఫ్ఘానిస్థాన్ హెరాత్ నగరంలోని భారతీయ దౌత్య కార్యాలయంపై శుక్రవారం తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దౌత్య కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఐటీబీపీ, ఆఫ్ఘాన్ దళాలను రంగంలోకి దింపింది. దాంతో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా భారతీయ దౌత్య కార్యాలయంలోని సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని భారత్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
భారత ఎంబసీపై దాడిని ఖండించిన అమెరికా
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులు, మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకోవడాన్ని గర్హనీయమని అమెరికా స్టేట్ డిపార్టమెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపనకు, సుస్థిరత, అభివృద్ధికి భారత్, అమెరికా దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను సానుభూతి తెలిపారు. అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్‌లో భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం.