![An Investigation Focused On Tens Of Thousands Of Antiquities Allegedly Smuggled Into The United States By Dealer Subhash Kapoor - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/29/antiquities1.jpg.webp?itok=sL8xeKie)
న్యూయార్క్: అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు15 మిలియన్ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్ తిరిగి ఇచ్చింది. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన వేడుకలో భారత్‌కి అందజేసారు. ఈ మేరకు ఈ వస్తువులు మాన్‌హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం, యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జరిపిన సుదీర్ఢ దర్యాప్తులో వెలుగు చూశాయి.
ఈ సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ.. డీలర్ సుభాష్ కపూర్ యునైటెడ్ స్టేట్స్‌కు పదివేల పురాతన వస్తువులపై అక్రమంగా తరలించారని ఆరోపణల నేపథ్యంలో విస్తృత దర్యాప్తు పై దృష్టి సారించాం. తమ సుదీర్ఘ దర్యాప్తు ఫలితంగా 143 మిలియన్ల డాలర్ల విలువైన 2,500 కళాఖండాలు తిరిగి సంపాదించగలిగాం. ఈ నేరానికి పాల్పడిన కపూర్ అతని సహ కుట్రదారులు తగిన శిక్ష పడుతంది.
అయితే కపూర్ ప్రస్తుతం భారతదేశం జైలులో ఉన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు దర్యాప్తును యూఎస్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కపూర్ గ్యాలరీ నుంచి వాటిని సేకరించిన యూఎస్.. భారత్‌కు అప్పగించింది. భారతదేశం, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల నుండి దోచుకున్న నిధులను రవాణా చేయడానికి న్యూయార్క్‌లోని తన ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీని వినియోగించారు. ఈ క్రమంలో కపూర్ పురాతన వస్తువులను వెతకడానికి ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. దేవాలయాల నుంచి పురాతన వస్తువుల్ని దొంగలిస్తూ వాటిని రహస్యంగా తరలించేవాడు.
Comments
Please login to add a commentAdd a comment