జలాలాబాద్లో దాడి జరిగిన ప్రదేశం
అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులు, మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకోవడాన్ని గర్హనీయమని అమెరికా స్టేట్ డిపార్టమెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపనకు, సుస్థిరత, అభివృద్ధికి భారత్, అమెరికా దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను సానుభూతి తెలిపారు.
అఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్లో భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం.