కువైట్: మానవతా దృక్పథంతో తమ వంతు సహాయంగా అవుట్ పాస్ దరఖాస్తు కొరకు భారతీయ రాయభార కార్యాలయానికి వచ్చిన వారికి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 వరకు భోజనం, మంచినీళ్లు అందజేశారు. వైఎస్ఆర్‌సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భోజనంతో పాటు నీళ్ల బాటిల్స్ అందించి మానవతా దృక్పథాన్ని చాటుకోవడం అభినందనీయమని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ అన్నారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్ల తర్వాత కువైట్ ప్రభుత్వం రెసిడెన్సీ (అకామా) మరియు పాస్ పోర్ట్ లేని విదేశీయలకు క్షమాబిక్ష పెట్టి ఫిబ్రవరి 22 వరకు వెళ్లిపోయిన వారు తిరిగి కువైట్ వచ్చే అవకాశం కల్పించిన కువైట్ దేశ రాజుకి ధన్యవాదాలు తెలిపారు.
భారత రాయబార కార్యాలయ అధికారులు సమయం తక్కువ ఉందని సెలవు రోజు కూడా పనిచేస్తూ కువైట్ ఇమ్మిగ్రేషన్ పనులన్నీ అంబాసిలోనే ఏర్పాటు చేసినందుకు, ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కొరకు ఎంతో అట్టహాసంగా పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రారంభించిన APNRT (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు) ఇంతవరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం దారుణమన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకొని స్వదేశానికి వచ్చిన తర్వాత పునరావాసం కల్పిస్తామని ప్రకటించడం హార్షణీయమని ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభాగ్యులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహమన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో వివిధ పార్టీ అభిమానులు, సామాజిక సేవా సంస్థ సభ్యులు గత జనవరి 29వ తేదీ నుంచి తమ పనులు పక్కనపెట్టి మరీ ప్రతిరోజు రాయభార కార్యాలయానికి వచ్చి బాధితులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి కళ్యాణ్, రమణా యాదవ్, బి.యాన్ సింహ, అబు తురాబ్, షా హుస్సిన్, బాలకిష్ణ రెడ్డి, రహంతుల్లా, పిడుగు సుబ్బారెడ్డి, గోవిందరాజు, వి.రమణ, హనుమంత్ రెడ్డి, ఏ.వి ధర్మారెడ్డి, పి. సురేష్ రెడ్డి, మన్నూరు భాస్కర్ రెడ్డి, సుబ్బయ్య, సింగమాల సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సంపత్, తుపాకుల కన్నయ్య, అయిత రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment