bali reddy
-
పచ్చదనాల పల్లె.. మరియపురం
గీసుకొండ: ఒకప్పుడు పల్లెలు పచ్చదనానికి పట్టుగొమ్మలు, ఇప్పుడంతా మారిపోయిందని అంటూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం మాత్రం ఇప్పటికీ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఏ ఇంటి ఆవరణ చూసినా, ఏ వీధిలో తిరిగినా పచ్చటి చెట్లు, మొక్కలు కనువిందు చేస్తున్నాయి. 2019 నుంచి ఇటీవలి వరకు సర్పంచ్‌గా పనిచేసిన అల్లం బాలిరెడ్డి చొరవే దీనికి కారణం. ఆయన సొంత ఖర్చుతో నర్సరీల నుంచి మొక్కలు తెప్పించారు. గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేయించారు. వివిధ పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను ఇంటింటికి అందించారు. మొక్కలు నాటి సంరక్షించిన వారికి బహుమతులు ఇచ్చారు. నిండా పచ్చదనంతో, కాలుష్యానికి దూరంగా ఉండే ఈ గ్రామానికి ఇప్పటికే జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు వచ్చి0ది. ఇటీవల రాష్ట్ర స్థాయి పర్యావరణ పరిరక్షణ అవార్డు ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు.. సోలార్ ఉత్పత్తిలోనూ.. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికీ సర్పంచ్ కృషి చేశారు. గ్రామంలో ఇంటింటికీ జనపనార, క్లాత్ సంచులను అందించారు. తనకు వచ్చే గౌరవ వేతనాన్ని మßహిళా సంఘాలకు ఇచ్చి.. వారితో వారంలో ఒకరోజు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులు చేయించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి విక్రయించి, ఆ సొమ్మును గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశారు. ఇక గ్రామంలో 20 మంది తమ ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సర్పంచ్ తన వంతుగా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గత ఐదేళ్లలో గ్రామంలో పుట్టిన 29 మంది బాలికలకు రూ.10వేల చొప్పున సాయం అందించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి.. ‘‘ప్రజలు, ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. అన్ని గ్రామాలు స్వయం సమృద్ధి చెందితే దేశం మరింత ప్రగతి సాధిస్తుంది.’’ – మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి -
రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
రైల్వేకోడూరు : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్, ఆ పార్టీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి పేర్కొన్నారు. ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామానికి చెందిన సీడీ నాగేంద్ర పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా కువైట్‌లో ఉన్న మహేష్ యాదవ్, వైకోట గ్రామ ప్రజలు కువైట్‌లోని పార్వానియా ఒమేరియా పార్క్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముమ్మడి బాలిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మహేష్ యాదవ్ మాట్లాడుతూ సీడీ నాగేంద్రను పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించి, గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, పీ రెహమాన్, నాయని మహేష్‌రెడ్డి, జగన్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు, కువైట్ యాదవ్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సేవలు అభినందనీయం
కువైట్: మానవతా దృక్పథంతో తమ వంతు సహాయంగా అవుట్ పాస్ దరఖాస్తు కొరకు భారతీయ రాయభార కార్యాలయానికి వచ్చిన వారికి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 వరకు భోజనం, మంచినీళ్లు అందజేశారు. వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భోజనంతో పాటు నీళ్ల బాటిల్స్ అందించి మానవతా దృక్పథాన్ని చాటుకోవడం అభినందనీయమని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ అన్నారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్ల తర్వాత కువైట్ ప్రభుత్వం రెసిడెన్సీ (అకామా) మరియు పాస్ పోర్ట్ లేని విదేశీయలకు క్షమాబిక్ష పెట్టి ఫిబ్రవరి 22 వరకు వెళ్లిపోయిన వారు తిరిగి కువైట్ వచ్చే అవకాశం కల్పించిన కువైట్ దేశ రాజుకి ధన్యవాదాలు తెలిపారు. భారత రాయబార కార్యాలయ అధికారులు సమయం తక్కువ ఉందని సెలవు రోజు కూడా పనిచేస్తూ కువైట్ ఇమ్మిగ్రేషన్ పనులన్నీ అంబాసిలోనే ఏర్పాటు చేసినందుకు, ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కొరకు ఎంతో అట్టహాసంగా పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రారంభించిన APNRT (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు) ఇంతవరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం దారుణమన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకొని స్వదేశానికి వచ్చిన తర్వాత పునరావాసం కల్పిస్తామని ప్రకటించడం హార్షణీయమని ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభాగ్యులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహమన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో వివిధ పార్టీ అభిమానులు, సామాజిక సేవా సంస్థ సభ్యులు గత జనవరి 29వ తేదీ నుంచి తమ పనులు పక్కనపెట్టి మరీ ప్రతిరోజు రాయభార కార్యాలయానికి వచ్చి బాధితులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి కళ్యాణ్, రమణా యాదవ్, బి.యాన్ సింహ, అబు తురాబ్, షా హుస్సిన్, బాలకిష్ణ రెడ్డి, రహంతుల్లా, పిడుగు సుబ్బారెడ్డి, గోవిందరాజు, వి.రమణ, హనుమంత్ రెడ్డి, ఏ.వి ధర్మారెడ్డి, పి. సురేష్ రెడ్డి, మన్నూరు భాస్కర్ రెడ్డి, సుబ్బయ్య, సింగమాల సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సంపత్, తుపాకుల కన్నయ్య, అయిత రమణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత
ఆళ్లగడ్డ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ ఆయనకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
మానవత్వం చాటుకున్న వైఎస్ఆర్ సీపీ కువైట్
కువైట్: ఇటీవల కువైట్‌లో మృతి చెందిన వైఎస్ఆర్ జిల్లా వాసి కుటుంబానికి అక్కడి వైఎస్ఆర్ సీపీ విభాగం అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. వివరాలు.. వైయస్ ఆర్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం పంచాయతి చెర్లోపల్లికి చెందిన దానసి వెంకటేష్(42) తన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం 16నెలలు క్రితం కువైట్ వెళ్లారు. ఈ నెల 26న గుండెపోటు రావడంతో వెంకటేష్ ఆకస్మికంగా మరణించారు. అతడికి భార్య రేణుక, కుమార్తె(13), కుమారుడు(11) ఉన్నారు. వెంకటేష్ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కువైట్ కన్వీనర్ ఎం. బాలిరెడ్డి .. కమిటీ సేవాదళ్ సభ్యులు, వైస్ ఇంచార్జ్ కె. నాగ సుబ్బారెడ్డి ద్వారా ఇమిగ్రేషన్ పనులు పూర్తి చేసి.. భౌతికకాయాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా.. విదేశాలలో మరణించే వారి భౌతికకాయాన్ని ఆఖరి చూపు కొరకు తపన పడే వారి కొరకు తమ దృష్టికి తీసుకోని వస్తే కుల మత ప్రాంతాలకు అతీతంగా భౌతికకాయాన్ని స్వస్ధలానికి పంపిస్తున్న కువైట్ వైకాపా కన్వీనర్ బాలిరెడ్డిని, కమిటీ సభ్యులకు పార్టీ తరపున గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అభినందించారు. బాలిరెడ్డి అభ్యర్థన మేరకు దానసి వెంకటేష్ మృతి దేహాన్ని చెన్నై నుండి స్వస్ధలం వరకు తీసుకురావడానికి రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంబులెన్స్‌ను ఎర్పాటు చేశారు. కువైట్ వైఎస్ఆర్ సీపీకి అన్నివిధాలుగా సహాయసహకారాలు అందిస్తున్న మిథున్ రెడ్డికి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కో- కన్వీనరు గోవిందు నాగరాజు, యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, సయ్యద్ సజ్జాద్, షేక్ సద్దార్, షేక్ ఖాదర్ భాష తదితరులు దానసి వెంకటేష్ పార్ధివ శరీరాన్ని సందర్శించి ఘననివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
- కువైట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో వక్తల పిలుపు కడప కార్పొరేషన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలని ఆ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కువైట్‌లోని సాల్మియా ప్రాంతంలో ఉన్న అవంతీ ప్యాలెస్‌లో శనివారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా వస్తే కొత్త పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిసినా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి మాట్లాడుతూ విభజనకు ముందు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడింది, ప్రస్తుతం ప్రజా సమస్యలపై, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీనే అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సమావేశంలో కువైట్ ప్రతినిధి ఫయాజ్, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎం. మహేష్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, సయీద్ నజర్, షేక్ ఇనాయత్, రామచంద్రారెడ్డి, సురేష్‌రెడ్డి, రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.