కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, పార్టీ అభిమానులు
రైల్వేకోడూరు : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్, ఆ పార్టీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి పేర్కొన్నారు. ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామానికి చెందిన సీడీ నాగేంద్ర పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా కువైట్‌లో ఉన్న మహేష్ యాదవ్, వైకోట గ్రామ ప్రజలు కువైట్‌లోని పార్వానియా ఒమేరియా పార్క్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముమ్మడి బాలిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మహేష్ యాదవ్ మాట్లాడుతూ సీడీ నాగేంద్రను పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించి, గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, పీ రెహమాన్, నాయని మహేష్‌రెడ్డి, జగన్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు, కువైట్ యాదవ్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment