సాల్మియాలో శనివారం కువైట్ వైఎస్సార్సీపీ సర్వసభ్య సమావేశం జరిగింది.
- కువైట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో వక్తల పిలుపు
కడప కార్పొరేషన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలని ఆ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కువైట్‌లోని సాల్మియా ప్రాంతంలో ఉన్న అవంతీ ప్యాలెస్‌లో శనివారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు.
ప్రత్యేక హోదా వస్తే కొత్త పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిసినా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి మాట్లాడుతూ విభజనకు ముందు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడింది, ప్రస్తుతం ప్రజా సమస్యలపై, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సమావేశంలో కువైట్ ప్రతినిధి ఫయాజ్, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎం. మహేష్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, సయీద్ నజర్, షేక్ ఇనాయత్, రామచంద్రారెడ్డి, సురేష్‌రెడ్డి, రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.