
వాషింగ్టన్: ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డ్ ఉన్న విదేశాల్లోని భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 20 ఏళ్ల లోపు, లేదా 50 ఏళ్ల పైబడిన వయసు ఉండి, ఇటీవలే తమ పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకుని, భారత్‌కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ శుభవార్త. వారు తమ ఓసీఐ కార్డ్‌తో పాటు కొత్త పాస్‌పోర్ట్, రద్దైన పాత పాస్‌పోర్ట్.. రెండూ తమ వద్ద పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్‌కు రావచ్చని భారత హోంశాఖ లోని విదేశాంగ విభాగం మంగళవారం ప్రకటించింది. 2020, జూన్ 30 వరకు ఈ వెసులుబాటు కల్పించామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment