dedication
-
కులగణనకు డెడికేషన్ కమిషన్.. ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్
హైదరాబాద్, సాక్షి: కులగణన కోసం తెలంగాణ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించినట్టు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.చదవండి: క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా -
అంకిత భావం
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు. అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు. వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు. వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు. తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు. అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో. చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు. తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం. కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు
పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పాకిస్తాన్లో వేలాదిమంది మృతి చెందారు. లక్ష్లలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్మీని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు సాయం అందించాల్సిందిగా పిలుపునిచ్చింది. మరోవైపు వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో ఒక రిపోర్ట్ర్ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధిచి లైవ్ రిపోర్టింగ్‌ని అందించడానికి పెద్ద సాహసమే చేశాడు. సదరు రిపోర్టర్ ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్ డెడికేషన్ వర్క్‌కి హ్యాట్సాప్ అని ప్రశంసిస్తే, మరికొందరూ టీఆర్పీ రేటింగ్స్ కోసైం కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్ట్‌లు చేత ఇలాంటి ప్రమాదకరమైన రిపోర్టింగ్‌లు చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది) -
లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది. మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి. మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు. నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం. త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు. దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు. త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి. బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి.. త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
సూపర్ వలంటీర్..!
దేవరాపల్లి(మాడుగుల): లబ్ధిదారుల చెంతకు పథకాలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సంకల్పం అక్షరాలా నెరవేరుతోంది. ఒక్క వృద్ధురాలికి పింఛన్ ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి నాటుపడవలో ఏరుదాటి అతికష్టం మీద గ్రామానికి చేరుకుని తన అంకితభావాన్ని చాటుకున్నాడు ఓ వలంటీర్. దేవరాపల్లి మండలం తామరబ్బ పంచాయతీ పరిధిలోని లోవ ముకుందపురం గ్రామంలో ఏటికి అవతలి వైపు వృద్ధురాలు వంతె పోతమ్మకు చెందిన ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే గుట్టలు, కొండల్లో ఏడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. లేదంటే నాటుపడవలో ఏరును దాటి.. మూడు కిలోమీటర్లు నడవాలి. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో స్థానిక వలంటీర్ టేడ సింహాచలం నాటు పడవలో ప్రయాణించి అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ సొమ్మును అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటికి తీసుకొచ్చిన వలంటీర్‌ను పోతమ్మ కుటుంబ సభ్యులు అభినందించారు. గతంలో పింఛన్ అందుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సివచ్చేదని గుర్తుచేసుకుంది పోతమ్మ. పథకాల్ని ఇంటికి చేర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో తమకు బాధలు తప్పాయని ఆనందం వ్యక్తం చేసింది. -
బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ
యాదగిరికొండ: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని బాలా లయంలో గురువారం వేద మంత్రాల నడుమ విగ్రహాలప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఉదయం 9.59 గంటలకు బంగారు కవచ మూర్తులను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి పూజలు కొనసాగించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకారం చేశారు. స్వామి అమ్మవార్లకు తిరుమంజనస్నపనం చేసి పట్టువస్త్రాలను ధరింపజేశారు. సకల దేవతలను ఆవాహనం చేసిన కలశాలను గర్భాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ గావించారు. చినజీయర్‌స్వామి చేతుల మీదుగా హవనం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం చినజీయర్ ఆధ్వర్యంలో అర్చకులు, రుత్విక్కులు, గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల అనుమతి తీసుకుని బంగారు కవచ మూర్తులను ఆలయ తిరువీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పూజలు నిర్వహించారు. యాదాద్రి చరిత్రలో నిలుస్తుంది... యాదాద్రి దేవస్థానం చరిత్రలో నిలిచి పోతుందని చినజీయర్ స్వామీజీ అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులకు ప్రవచనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ఆలయం నిర్మిస్తే ప్రపంచంలో నరసింహ స్వామి ఆలయం ఎక్కడా అంటే ఇదే గుర్తుకు రావాలన్నారు. భక్తులకు కొంగు బంగారంగా ఉన్న ఈ ఆలయం మున్ముందు ఎంతో మందికి ఉపాధి చూపిస్తుందన్నారు. మనకు ఎంత తోడు ఉన్నా భగవంతుడి తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత వరకు దేవాలయాల నుంచి మాత్రమే డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడమే లక్ష్యం గా ప్రభుత్వాలు పనిచేస్తే.. కేసీఆర్ మాత్రం ప్రభుత్వ డబ్బుతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించే అంశం అని పేర్కొన్నారు. ఏడాదిలోపే పనులు పూర్తి ఏడాదిలోపే యాదాద్రి పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. యాదాద్రిని సుమారు కొన్ని వందల సంవత్సరాల దాకా చెక్కు చెదరకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. -
కోహ్లికి అంకితభావం ఎక్కువ: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనకు అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణం కాదని టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. అవన్నీ మతిలేని ఆరోపణలని కొట్టిపారేశారు. ‘ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి నాలుగు సెంచరీలతో పాటు 700 పరుగులు సాధించాడు. నేను చూసిన ఆటగాళ్లలో ఇతనికే అంకితభావం ఎక్కువ. దేశం కోసం ఆడాలనే తపనతో ఉంటాడు’ అని శాస్త్రి మద్దతు పలికారు. ఇక టెస్టుల నుంచి తప్పుకున్న ధోని తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు సమయం లభించిందన్నారు. సెమీస్‌లో భారత్ ఓటమికి టాస్ ఓడిపోవడం కూడా కారణమన్నారు. -
హెచ్ఎంలు అంకితభావంతో పనిచేయాలి
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రధానోపాధ్యాయులు అంకితభావం తో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య కోరారు. జిల్లా విద్యాశాఖ, వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు స్ఫూర్తి పేరిట సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవ న్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహచర ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాబోధన చేయిం చాలని హెచ్ఎంలకు సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్ఎం అటెండర్, జిల్లా విద్యాశాఖకు డీఈఓ అటెండర్, జోనల్‌కు పాఠశాల ఆర్జేడీ అటెండర్ లాంటివాడని అభివర్ణించారు. అటెండర్లు ఒక గంట ముందు పాఠశాల కు వస్తారని, అందరు వెళ్లిన తర్వాతే వెళ్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు కూడా ఇలా గే విధులు నిర్వర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అమలుచేయాలని, టెన్త్ పరీక్షల ఫలితాలు కూడా ఇంకా మెరుగుపర్చుకోవాలన్నారు. మొదటి దశలో పాఠశాలలను సందర్శించి సూచనలు, సల హాలు ఇస్తానని, రెండో దశలోను ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తానని, మూడో దశలో మారకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు వేణుభగవాన్ అనేక అంశాలను ఉదాహరణలతో వివరించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన విద్యార్థులు గీసుకొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, ఊకల్, కొమ్మాల, ధర్మారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో కొంతకాలంగా శిక్షణ ఇస్తున్నారు. వారిని హెచ్ఎంల స్ఫూర్తి కార్యక్రమానికి తీసుకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్, ఆత్మకూరు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నామని డీఈఓ తెలి పారు. ‘ఎల్టా’ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరిస్తామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, అశోక్‌దాస్, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు రవీందర్, రవీందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ బత్తిని కొమురయ్య, రిసోర్స్పర్సన్లు దేవేందర్‌రెడ్డి, వి.లక్ష్మణ్, ఎల్.వంశీమోహన్, ఎస్.సత్యం, పి.శ్రీనివాస్, కె.రవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, గీసుకొండ ఎంఈఓ ఎస్. జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట ఉపాధ్యాయుడు వల్స పైడి ఆధ్వర్యంలో నరేంద్రనగర్ పాఠశాల విద్యార్థుల నృత్యరూపకం ఆకట్టుకుంది. హెచ్ఎంలకు స్ఫూర్తి కార్యక్రమాలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. -
అవాస్తవాల పునాదులపై వేర్పాటువాదం
చోడవరం, న్యూస్‌లైన్ : విభజనపై వెనక్కు తగ్గకపోతే సోనియా గాంధీ ఇల్లు ముట్టడించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వాస్తవాల పునాదులపై ఉద్యమం సాగాలి తప్ప రాజకీయ స్వలాభం కోసం కాకూడదన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం సమైక్యాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్యాంధ్ర లక్ష గళ గర్జనసభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఐక్యవేదిక కన్వీనర్ కేఎల్‌ఎన్‌వీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ లాంటి స్వార్ధ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు రాకూడదన్నారు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసి తెలంగాణ వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్నది వందల ఏళ్ల నుంచి పెద్దల ఆకాంక్ష అన్నారు. రాష్ర్ట విభజనకు కేసీఆర్‌లా సెలైన్ బాటిళ్ల దీక్షలు చేయలేదని, అంకిత భావంతో కూడిన తెలుగు ప్రజల ఐక్యత కోసం నాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దీక్ష చేసి అమరులయ్యారన్నారు. సీమాంధ్ర ప్రజల రక్తమాంసాలతో హైదరాబాద్ ఏర్పడిందని, ఈ మహానగరం ఎవరి సొత్తూ కాదని అన్నారు. అమరావతి స్థూపంపై ఉన్న చిహ్నం తెలుగు జాతి సంస్కృతి ఐక్యతకు దేశంలోనే గుర్తింపు పొందిందని, అంతటి గొప్ప చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాన్ని విభజించడం తగదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో అమాయకులని, ఇక్కడి విద్యుత్ విభాగం పరోక్షంగా అదనపు భారం వేసి బిల్లుల రూపంలో వసూలు చేసినా తెలుసుకోలేని అమాయకులని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ కుతంత్ర రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఏదో రోజు తెలుసుకుని అతనికి గోరీ కట్టడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని, తెలుగు వాళ్లంతా అన్నదమ్ములుగా ఉన్నారే తప్ప ఎవరూ విభజన కోరుకోవడం లేదన్నారు. విజయనగరం నుంచి తెలంగాణ వచ్చిన కేసీఆర్ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ర్ట యువజన జేఏసీ అధ్యక్షుడు ఆడారి కిషోర్ మాట్లాడుతూ సోనియా గాంధీ రాజకీయ స్వార్ధం కోసం విభజనకు పూనుకొన్నారన్నారు. తెలుగు వారి మనోభావాలను అర్థం చేసుకోలేదన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆగ్రహిస్తే టీఆర్ఎస్ భవనాన్ని కూకటివేళ్లతో పెకళిస్తామని హెచ్చరించారు. మ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్పీకర్ఫార్మట్లో రాజీనామాలు చేసి నేరుగా ఉద్యమంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు ముంగా వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ సిబ్బంది సంఘం అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఈశ్వరరాజు, విశాలాంధ్ర ఉపాధ్యాయుల ఉద్యమ నాయకుడు సింహాద్రప్పడు, ఉత్తరాంధ్ర మహిళా ఉపాధ్యాయుల సంఘం నాయకురాలు ఎం.నీలావతి, జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టాలి అనకాపల్లి రూరల్: రాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరిచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టాలని తద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. గవరపాలెంలోని ఆడారి కిశోర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్రలోని పార్లమెంట్ సభ్యులందరూ రాష్ట్రపతి వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా పత్రాలు అందజేయాలన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్, ఆడారి కిషోర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యుడు కె.ఎన్.వి. సత్యనారాయణ, దూలం గోపి పాల్గొన్నారు. -
కోల్‌కతా టు కన్యాకుమారి
భోగాపురం, న్యూస్‌లైన్ : దీక్ష పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని అంటున్నాడు తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల ఆర్.తంగరాజు. పుట్టు వికలాంగుడైన అతను కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు మూడు చక్రాల సైకిల్‌పై వెళ్తూ.. ఆదివారం భోగాపురం చేరుకున్నాడు. ఈ సందర్భంగా రాత్రి అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తన స్వగృహంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో తంగరాజు మాట్లాడాడు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సంస్థలో తన తల్లి 25 సంవత్సరాలుగా పని చేస్తుందని చెప్పారు. తాను అక్కడే ఇంజినీరింగ్ చదివానని, స్వామి వివేకానందుని ప్రవచనాలపై ఆసక్తితో సంఘ సేవకునిగా మారానని తెలిపారు. జనవరి 12, 2013 నుంచి 12 జనవరి 2014 వరకు వివేకానందుని కేంద్రం, కన్యాకుమారి ఆధ్వర్యంలో 150వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వివేకానందుని జన్మస్థలం కోల్‌కతాలో నుంచి బేలూరు మఠం నుంచి ఆయన తపస్సు చేసిన కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టానని అన్నారు. జూలై 22న ఈ యాత్ర ప్రారంభించానని తెలిపారు. సెప్టెంబరు 11నాటికి అంటే 536 రోజుల్లో 2,400 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 800 కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెప్పారు. రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ.. దారిపొడువునా విద్యార్థులకు, యువతకు వివేకానందుని జీవిత చరిత్ర, సంఘం కోసం అతని సూచించిన మార్గాన్ని తెలుపుతున్నానని చెప్పారు. తనను చూసి కొంతమందైనా ఆయన మార్గం అవలంబిస్తే తన ఆశయం నెరవేరుతుందని అన్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఫిబ్రవరి 6 వరకు కోల్‌కతా నుంచి వివేకానందుడు సంచరించిన వివిధ ప్రదేశాల్లో 995 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశానని, ఇది రెండోయాత్ర అని పేర్కొన్నారు. కృషి, పట్టుదల, ఒక దృఢ సంకల్పంతో ప్రయాణిస్తున్న తనకు అంగవైకల్యం అడ్డుకాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద 150వ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి శ్రీధర్, బాలాజీ పాణిగ్రహి, కె.ఉమామహేశ్వరరావు, కన్వీనరు జీఎస్ఏ నరసింహం, ఉమాశ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా లీ గల్ సెల్ అధ్యక్షుడు వరుపుల సుధాకర్, శిరుగుడు గోవిందరావు పాల్గొన్నారు.