పాఠశాలల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు కృషి చేయాలి
పాఠశాలల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు కృషి చేయాలి
Published Wed, Jul 27 2016 12:41 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
లక్కోర(వేల్పూర్) : పాఠశాలల అభివృద్ధికి పూ ర్వవిద్యార్థులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య పే ర్కొన్నారు. మండలంలోని లక్కోర ఉన్న త పాఠశాలకు చెందిన 1989–90 బ్యా చ్ ఏడవ తరగతి విద్యార్థులు, 2015– 16 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు విరాళం గా ఇచ్చిన ప్రొజెక్టర్, ప్రింటర్‌ను డీఈవో మంగళవారం పాఠశాలకు అందజేశారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 300 పా ఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు గణితం, సైన్స్ బోధించం డం, చార్టులు, పిక్చర్స్ చూపించడం వ ల్ల అన్ని అంశాలు విద్యార్థులకు బాగా గుర్తుంటాయన్నారు. ప్రొజెక్టరు, ప్రింట ర్ వితరణ చేసిన విద్యార్థులను డీఈవో సన్మానించారు. ఎంఈవో లింగమూర్తి, సర్పంచ్ తిరుమల శ్రీనివాస్, రిటైర్డు ఎంఈవో విద్యాసాగర్‌రెడ్డి,అమీనాపూర్ సర్పంచ్ కె. రాజాగౌడ్, ఎంపీటీసీ లో లం నర్సుగంగారాం, ప్రైమరీస్కూలు హెచ్‌ఎం సురేందర్, ఎ స్సెమ్సీ చైర్మన్ శారద, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయు లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement