పెడన (కృష్ణా): విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు హనుమంతరావును సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని నందమూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులతో ఉపాధ్యాయుడు హనుమంతరావు అసభ్యంగా ప్రవర్తించగా... అతడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం విదితమే.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా డీవైఈవో పి.గిరికుమార్ నందమూరు జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లి విద్యార్థినుల నుంచి వివరాలు తెలుసుకుని డీఈవోకు నివేదిక అందజేశారు. దీంతో హనుమంతరావును సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెడన ఎంఈవో ఖాసిం షరీఫ్ ఉపాధ్యాయుడికి సస్పెన్షన్ ప్రతిని అందజేశారు.
కీచక ఉపాధ్యాయుడిపై వేటు
Published Sun, Mar 6 2016 9:50 PM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement
Advertisement