రోబో చిల్డ్రన్స్ | Robot Children | Sakshi
Sakshi News home page

రోబో చిల్డ్రన్స్

Published Tue, Feb 10 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

రోబో చిల్డ్రన్స్

రోబో చిల్డ్రన్స్

స్విచ్ వేస్తే లైటు వెలుగుతుంది. ఫ్యాను తిరుగుతుంది. కరెంటు పోతే ఏవీ పనిచేయవు. ఇంతకు మించి కరెంటు గురించి, వివిధ యంత్రాల పనితీరు గురించి పిల్లలకు తెలిసే అవకాశం లేదు. ఇక నగరంలో... ఆడుకోవటానికి చోటు లేదు, చుట్టూ ఉన్న విషయాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకునే అవకాశం కూడా లేదు. పుస్తకాల జ్ఞానాన్ని మార్కులకు మాత్రమే పరిమితం చేస్తున్న ఈ తరుణంలో చదువుకున్న విషయాలను నిత్య జీవితంలో అన్వయించుకునేందుకు, ప్రాక్టికిల్‌గా తెలుసుకునేందుకు ఓ చక్కటి ప్రయత్నం చేస్తున్నది కిడిహౌ చిల్డ్రన్స్ మ్యూజియం. అమెచ్యూర్ రోబోటిక్ క్లబ్ పేరుతో జరిగే ఆ మేథోమదనం గురించి...
..:: ఓ మధు
 
ఆరేళ్ల పిల్లాడి చేతికి బంతి ఇస్తే ఏం చెయ్యాలో చెప్పక్కర్లేదు. పిల్లలకు కొన్ని బేసిక్ విషయాలు చెప్తే చాలు.. అద్భుతాలు ఆవిష్కరిస్తారు. తరగతి గదుల్లో నేర్పే పాఠాలను ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా నేర్చుకోగలిగితేనే వారు నిజమైన జ్ఞానవంతులు కాగలరు. కానీ అలాంటి వెసులుబాటు స్కూళ్లు, ఇళ్లు ఎక్కడా కల్పించటం లేదు. ఈ విషయాన్ని గ్రహించి పిల్లలు శాస్త్ర, సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవడానికి సరైన వాతావరణం కల్పించింది రోబోటిక్ క్లబ్.

భావి సైంటిస్టులను, క్రియేటివ్ జూనియర్స్‌ను తయారు చేయడమే తమ ఉద్దేశమంటున్నారు క్లబ్ ఫౌండర్ నిరంజన్ వాసిరెడ్డి. పిల్లలకు రెడీమేడ్ గిఫ్ట్స్, బొమ్మలు కొని ఇస్తుంటారు తల్లిదండ్రులు. కానీ వారిలో సృజనను గుర్తించి అందుకు తగిన వనరులు సమకూర్చి... దానికి కొంత సాంకేతిక జోడించడమెలాగో చెబితే వాళ్లే చక్కని బొమ్మలు, రోబోలు తయారు చేసుకోగలుగుతారు. రోబో తయారు చెయ్యాలంటే ఒక లెగో కిట్ కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇంట్లో వుండే వస్తువులతోనే క్రియేటివ్‌గా రోబోని తయారు చెయ్యొచ్చని చెబుతోంది రోబోటిక్ క్లబ్. అనటమే కాదు ఇక్కడికి వచ్చే పిల్లలతో అలాంటి రోబోలను తయారు చేయిస్తోంది.

బేసిక్స్‌తో మ్యాజిక్స్...

ఇక్కడ బ్యాటరీ బేసిక్స్ నేర్పిస్తారు. బ్యాటరీ ఎలా కనెక్ట్ చెయ్యాలి, దాని పనితీరు, బ్యాటరీలలో ఎన్ని రకాలుంటాయి? వాటిని ఎలా వాడుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ వారికి ప్రాక్టికల్ నేర్పిస్తారు. ఆలోచనలకు పదును పెట్టే ఆటలు ఆడిస్తారు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించిన అవగాహన కల్పిస్తుంటారు. అందుకు కావలసిన సర్క్యూట్ బోర్డ్స్, బ్యాటరీస్ ఇక్కడ చాలానే ఉన్నాయి. వాటికి తమ సృజనను జోడించి రోబోలుగా మలిచేందుకు పిల్లలకు కావలసిన విషయ జ్ఞానాన్ని, సహకారాన్ని మేం అందిస్తాం అంటున్నారు క్లబ్ నిర్వాహకుల్లో ఒకరైన ప్రియా అయ్యంగార్.
 
స్కిల్ ఓరియంటెడ్...

ప్రతి పిల్లవాడు డిఫరెంట్. ఒక్కొక్కరికీ ఒక్కో నైపుణ్యం ఉంటుంది. ఒక్కోదాని మీద ఆసక్తి ఉంటుంది. వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటికి  తేవడమెలాగో ఈ క్లబ్ నిర్వాహకులకు బాగా తెలుసు. పిల్లలకు ఎటువంటి హాని కలుగకుండా వస్తువులను వినియోగిస్తూ, వారికి నచ్చే విధంగా అంశాలను బోధిస్తున్నారు. నెలలో రెండో శుక్ర, శని, ఆది వారాలు రోబోటిక్స్ సంబంధించిన యాక్టివిటీస్ నిర్వహిస్తారు. ఈ యాక్టివిటీలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటుంటారు. 40 నిముషాల పాటు బేసిక్ క్లాస్ అనంతరం యాక్టివిటీ నిర్వహిస్తారు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి కిచెన్, గార్డెన్‌లో ఉండే సైన్సు పాఠాలు ఇక్కడి క్లాసుల్లో అవలీలగా నేర్చుకోవచ్చంటున్నారు పిల్లల తల్లిదండ్రులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement