
మర్యాద పలకరింపు కూడా లేకుండా– ‘ఏమిటి నీ గొప్ప? మామూలు బోధనలే కదా నువ్వు చేసేది! మరి నేను అలా కాదే! ఎన్నో అద్భుతాలు చేయగలను’ అన్నాడు గర్వంగా.
ఒక పట్టణంలో రెండు ఆశ్రమాలుండేవి. ఇద్దరు గురువులు ఉండేవారు. మొదటి ఆశ్రమంలో గురువు బోధనలు చక్కగా ఉండేవి. ప్రేమ, కరుణ, శాంతం గురించి ఎక్కువగా చెబుతుండేవాడు. దాంతో వినడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఎంతోమంది జనం వచ్చేవారు. రెండో గురువు గొప్ప శక్తులను సంపాదించడం మీద తన దృష్టి సారించేవాడు. అలా ఎన్నో అద్భుతాలను ఆయన చేయగలిగేవాడు. అయితే, రెండో గురువు దగ్గర ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ మొదటి గురువుకే ఎక్కువ ఆదరణ ఉండేది. ఇది రెండో గురువుకు తీవ్రమైన అసూయ కలిగించేది. దాంతో ఒకరోజు నేరుగా మొదటి గురువు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆయన చుట్టూ శ్రోతలు కూర్చునివున్నారు.
మర్యాద పలకరింపు కూడా లేకుండా– ‘ఏమిటి నీ గొప్ప? మామూలు బోధనలే కదా నువ్వు చేసేది! మరి నేను అలా కాదే! ఎన్నో అద్భుతాలు చేయగలను’ అన్నాడు గర్వంగా.‘ఏమిటా అద్భుతాలు?’ కుతూహలంగా అడిగాడు మొదటి గురువు.‘నేను మన ఊళ్లోని చెరువు ఈ ఒడ్డున బ్రష్ పట్టుకుని నిల్చుంటాను. అవతలి ఒడ్డున నా సహాయకుడు కాన్వాస్ పట్టుకుని నిలుచుంటాడు. నేను ఇక్కడ గీస్తే అక్కడ బొమ్మ రూపుకడుతుంది తెలుసా?’ అన్నాడు.‘ఓహో, నిజంగా బాగుంది. అయితే, నేను అంత ఇంద్రజాలం ప్రదర్శించలేనుగానీ నేను పడుకోగానే మాత్రం వెంటనే నిద్ర పడుతుంది’ నవ్వుతూ బదులిచ్చాడు మొదటి గురువు.
Comments
Please login to add a commentAdd a comment