
ఈ ఫొటోలో వ్యక్తిని చూడగానే ఏమనిపిస్తోంది.. ఆ ఏముంది.. స్మార్ట్‌ఫోన్‌లో ఏదో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఫొటోను అలా మార్చేశారులే అనుకుంటున్నారా..? చూసిన వెంటనే అలాగే అనిపిస్తుంది కూడా.. అయితే మీరనుకున్నదంతా అబద్ధం. అందులో ఉన్న వ్యక్తి తన ముఖాన్నే కాన్వాస్‌గా మలుచుకున్నాడు. ఇదిగో ఇలా త్రీడీ చిత్రాలను తన ముఖంపైనే గీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. అతడి పేరు లూస్. మామూలుగానైతే ఇటలీలోని ఓ టీవీ చానల్‌లో 18 ఏళ్లుగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు.
అయితే తను చేసే పనిలో ఎప్పుడూ ఆనందం వెతుక్కునే లూస్.. తనపైనే ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. దీంతో మొదటగా తన చేతులను కాన్వాస్‌గా మలుచుకుని భ్రమ కలిగించే బొమ్మలను గీయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముఖంపైనే త్రీడీ బొమ్మలు చిత్రించడం స్టార్ట్ చేశాడు. 2015లో తొలిసారి తన చేతిపై గీసిన ఇలాంటి ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ కావడం.. లూస్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment