త్రీడీ రంగంలో ‘మేకర్ గ్లోబల్’ వెలుగులు
21 ఏళ్లకే స్టార్టప్..నడిపిస్తున్న క్రవీంతర్ కమల్
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ‘రాకెట్’ తయారీ
ఇప్పుడంటే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత గురించి అందరికీ తెలిసింది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అందరికీ అవగాహన వచ్చింది. కానీ 8 ఏళ్ల క్రితం త్రీడీ ప్రింటింగ్ గురించి ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. కానీ 21 ఏళ్ల కుర్రాడు త్రీడీ ప్రింటింగ్‌లో భవిష్యత్తు ఉందని గుర్తించాడు. త్రీడీ ప్రింటింగ్‌లో ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనకు పదును పెట్టాడు. ఓ స్టార్టప్ కూడా స్థాపించాడు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి కంపెనీ స్థాపించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎన్నో అవమానాలు.. ఎన్నో భయాలు.. వాటన్నింటినీ దాటుకుని ముందడుగు వేశాడు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌లోని త్రీడీ ప్రింటింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి.. తన సత్తా చాటుకున్నాడు. అతడి పేరే.. క్రవీంతర్ కమల్.. అతని సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని విశేషాలు..
మేకర్ గ్లోబల్ పేరుతో 2016లో త్రీడీ ప్రింటర్స్ తయారుచేసే చిన్న స్టార్టప్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుండటమే కాకుండా.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అని అనుమానం వ్యక్తం చేసిన వారికి ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్‌తోనే భవిష్యత్తు ఉంది అని నిరూపిస్తూ కమల్ ముందుకు సాగుతున్నాడు.
మొక్కవోని ధైర్యంతో..
కంపెనీ స్థాపించిన సమయంలో త్రీడీ ప్రింటింగ్‌పై డెలాయిట్, టాటా ఏరోస్పేస్ వంటి కంపెనీల వద్దకు వెళ్లి అవగాహన కలి్పంచేవాడినని కమల్ గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత త్రీడీ ప్రింటింగ్ మెషీన్లను సొంతంగా తయారు చేసి, కంపెనీలకు విక్రయించేవాడినని చెప్పుకొచ్చాడు. త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన తర్వాత వాటిని తయారుచేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మేకర్ గ్లోబల్‌కు క్లయింట్స్‌గా మారారు. వారికి కావాల్సిన త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులను వీరి దగ్గరి నుంచే చేయించుకోవడం మొదలు పెట్టారు.
ఎన్నో సినిమాలకు సాయం..
త్రీడీ ప్రింటింగ్‌లో రోజువారీ ఉపయోగించే ఎన్నో వస్తువులు, ఉత్పత్తులను మేకర్ గ్లోబల్ తయారుచేస్తోంది. హైదరాబాద్‌లోని స్కైరూట్ కంపెనీకి రాకాట్ మోడల్స్‌ను త్రీడీ ప్రింటింగ్‌లో రూపొందించి ఇచ్చామని కమల్ పేర్కొన్నాడు. అది చాలా గర్వకారణంగా ఉందని చెప్పాడు. ఇక, ఎన్నో సినిమాల ఆర్ట్ డైరెక్టర్లకు కావాల్సిన వస్తువులను సులువుగా తయారు చేసి ఇస్తుంటామని, ఏటా కనీసం నాలుగు సినిమాలకు పనిచేస్తుంటామని వివరించాడు. ఇక, ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్, ఆపరేషన్ వాలెంటైన్, పుష్ప వంటి సినిమాలకు అవసరమైన వస్తువులను నటీనటులకు ఇబ్బంది కాకుండా తేలికగా ఉండేలా తయారు చేసి ఇచ్చామని చెబుతున్నారు.
అప్పటి నుంచే ఆసక్తి..
తమిళనాడులోని తిరుచి్చలో జన్మించిన కమల్.. చెన్నైలోని లయోలా కాలేజీలో 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పారిస్‌లోని తులుజ్‌లో ఏరోస్పేస్ హబ్‌లో నెల రోజుల పాటు ఉండే అవకాశం కమల్‌కు వచి్చంది. అక్కడే తొలిసారి త్రీడీ ప్రింటింగ్‌తో ఉన్న లాభాల గురించి తెలుసుకున్నా డు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. డిజైనింగ్‌పై ఇష్టంతో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో చేరాడు. కానీ ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా ఎదగాలని, నలుగురికీ ఉపాధి కలి ్పంచాలని ఆలోచన చేశాడు. అప్పుడే త్రీడీ ప్రింటింగ్ గురించి వచ్చిన ఆలోచనతో వెంటనే మేకర్ గ్లోబల్ స్టార్టప్ స్థాపించాడు. ఇప్పుడు ఏటా రెండున్నర కోట్ల టర్నోవర్‌తో ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్తులో సంస్థను మరింత విస్తరించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment