సాక్షి,ముంబై: ట్రాక్ సూట్‌లా బాడీ స్కానర్‌గురించి విన్నారా. కొత్త తరహా ట్రాక్‌సూట్ నిజానికి ట్రాక్‌సూట్ కాదు, బాడీ స్కానర్! అమెరికన్ కంపెనీ ‘జోజోఫిట్’ ఇటీవల తేలికగా ట్రాక్‌సూట్‌లా తొడుక్కోవడానికి అనువైన ఈ త్రీడీ బాడీ స్కానర్‌ను రూపొందించింది. ఇది యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తొడుక్కుని, యాప్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, క్షణాల్లోని శరీరంలోని పది కీలక భాగాలకు చెందిన కొలతలను అత్యంత కచ్చితంగా తెలియ జేస్తుంది. (రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు)
అంతేకాదు, శరీరంలోని ఏయే భాగాల్లో ఏ మేరకు కొవ్వు పేరుకుపోయి ఉందో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఎత్తు, బరువు వివరాలతో పాటు శరీరం కొలతలతో పోలిస్తే కొవ్వు నిష్పత్తి ఎంత ఉందో ఏమాత్రం తేడా లేకుండా చెప్పేస్తుంది. ప్రొఫెషనల్ క్రీడాకారులతో పాటు ఔత్సాహికులకు కూడా పనికొచ్చేలా దీన్ని తీర్చిదిద్దినట్లు ‘జోజోఫిట్’ సంస్థ చెబుతోంది. ఈ త్రీడీ బాడీ స్కానర్ ట్రాక్‌సూట్ విక్రయాల కోసం ‘జోజోఫిట్’ త్వరలోనే టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో షోరూమ్‌ను ప్రారంభించనుంది. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!)
Comments
Please login to add a commentAdd a comment