Body Mass Index
-
ఆయన పుట్టినరోజు నాడు.. వరల్డ్ డయాబెటిస్ డే
మధుమేహం (డయాబెటిస్) బాధితులు దాదాపు ప్రతి కుటుంబంలో ఉంటున్నారు. ఇంతగా వ్యాప్తి చెందుతున్నా ప్రజలు దీని నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసుగల వారిలో గుర్తించిన మధుమేహం, ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల్లోపే గుర్తించడం కనిపిస్తోంది. ఇది భారతీయులకు ఆందోళన కలిగించే విషయమే.మధుమేహ సమస్య గ్లోబల్ సమస్య. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్ ఆవిష్కర్తలలో ఒకరైన సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ జన్మదినమైన నవంబర్ 14వ తేదీన ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’ (వరల్డ్ డయాబెటిస్ డే)గా ప్రకటించింది. అధిక శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గి పోయింది. చాలామందిలో మానసిక ఒత్తిడి తప్ప, శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత్వం, జీవన సరళిలో వచ్చిన అసంగత మార్పులు... మధుమేహం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తల్లిదండ్రులలో ఇద్దరికీ మధుమేహం ఉన్నా, వారి పిల్లలలో కేవలం 7% మందిలో మాత్రమే జీవిత కాలంలో మధుమేహం బారిన పడ్డట్టు పరిశోధనలు చెప్పడం ఇందుకు నిదర్శనం.మన తాత ముత్తాతలు దంచిన లేదా తక్కువ పాలిష్ పట్టిన బియ్యం, చిరుధాన్యాలు తినేవారు. వాటిలో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుతున్నాం. చిరుధాన్యాలు తినడం మానేశాం. దీనికి తోడు ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడకం పెరిగిపోయింది. కాలినడక తగ్గిపోయింది. వాహనాల వినియోగం పెరిగిపోయింది. చాలామందిలో కుటుంబ, వృత్తి, సామాజిక పర సమస్యలు పెరిగి పోయి మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధిక మయ్యాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణాలే. ఊబకాయం తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుందని అర్థం. బీఎంఐ ఎక్కువగా కలవారే ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?చేసే పనికి తగ్గ పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి. ఊబకాయస్థుల శరీరం బరువు 7 శాతం తగ్గితే మధుమేహం వచ్చే అవకాశాలు 60 శాతం తగ్గిపోతాయని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమి షాలైనా నడక, అవకాశం ఉన్నవారు ఈదటం, పరుగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్య లేచి నాలుగు అడుగులు వేయడం మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల నుండి లభించే శాకాహారం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రజారోగ్యం పైన, ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపే మధుమేహం నిరోధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతగా వ్యహరించాలి.– డాక్టర్ టి. సేవకుమార్ ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ వ్యవస్థాపకులు(నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే) -
ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!
సాక్షి,ముంబై: ట్రాక్ సూట్‌లా బాడీ స్కానర్గురించి విన్నారా. కొత్త తరహా ట్రాక్‌సూట్ నిజానికి ట్రాక్‌సూట్ కాదు, బాడీ స్కానర్! అమెరికన్ కంపెనీ ‘జోజోఫిట్’ ఇటీవల తేలికగా ట్రాక్సూట్లా తొడుక్కోవడానికి అనువైన ఈ త్రీడీ బాడీ స్కానర్‌ను రూపొందించింది. ఇది యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తొడుక్కుని, యాప్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, క్షణాల్లోని శరీరంలోని పది కీలక భాగాలకు చెందిన కొలతలను అత్యంత కచ్చితంగా తెలియ జేస్తుంది. (రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు) అంతేకాదు, శరీరంలోని ఏయే భాగాల్లో ఏ మేరకు కొవ్వు పేరుకుపోయి ఉందో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఎత్తు, బరువు వివరాలతో పాటు శరీరం కొలతలతో పోలిస్తే కొవ్వు నిష్పత్తి ఎంత ఉందో ఏమాత్రం తేడా లేకుండా చెప్పేస్తుంది. ప్రొఫెషనల్ క్రీడాకారులతో పాటు ఔత్సాహికులకు కూడా పనికొచ్చేలా దీన్ని తీర్చిదిద్దినట్లు ‘జోజోఫిట్’ సంస్థ చెబుతోంది. ఈ త్రీడీ బాడీ స్కానర్ ట్రాక్‌సూట్ విక్రయాల కోసం ‘జోజోఫిట్’ త్వరలోనే టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో షోరూమ్‌ను ప్రారంభించనుంది. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) -
Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం. తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అన్నీ ఉన్నా...ఆరోగ్యం? నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కోవిడ్ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. వేగం.. నగర జీవననాదం.. నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. ‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ వేదస్విరావు వెల్చల చెప్పారు. -
World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 1980 నుండి రెట్టింపు అవుతూ వస్తుంది. 2014లో, 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది పెద్దలు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 600 మిలియన్లకు పైగా స్థూలకాయులు ఉన్నారు. 2014లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 41 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. 'CRAP': కు దూరంగా ఉండండి. అంటే కార్బోనేటేడ్ పానీయాలు,శుద్ధి చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. స్థూలకాయానికి దూరంగా ఉండాలంటే ఈ పదార్థాలకు కచ్చితంగా నో చెప్పాల్సిందే. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేద్దామా? అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కింగ్‌లాగా బ్రేక్ ఫాస్ట్ ఉండాలి అలా ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆహారంతో రోజు ప్రారంభించాలి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే ఆకలి ఎక్కువై ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లే అవకాశం ఉంది. మనం ఏం తాగుతున్నాం: ఈ మధ్య కాలంలో లెమన్ టీ, గ్రీన్ టీ పై అవగాహన బాగా పెరిగింది. గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ, అల్లం టీ, తులసి, పుదీనా టీ ఇలాంటి సహజ మూలికల టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు క్రమేపీ కరుగుతాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ నీరుతాగడం వల్ల జీర్ణవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నీరు మన శరీరంలోని మలినాలను కూడా శుభ్రపరుస్తుంది. వంటింట్లో డైట్ మేక్-ఓవర్ : వంటగదిలో "జంక్" ఫుడ్‌ని పూర్తిగా తొలగించేద్దాం. దీనికి బదులు వంట గదిలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కనిపించేలా పెట్టుకోండి. ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వండి. రుచికోసం కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే..రుచికి రుచితోపాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మోర్ ఎక్సర్సైజ్: ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం చురుగ్గా ఉండటం. ఎక్కువ సేపు కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోకుండా ఉండటం చాలా ముఖ్యం. లిఫ్ట్‌కు కాకుండా సాధ్యమైన ప్పుడల్లా మెట్లు ఎక్కడం. అలాగే మన రోజువారీ షెడ్యూల్లో సైక్లింగ్, నడక, స్కిప్కింగ్ లేదా స్విమ్మింగ్‌తోపాటు, పెంపుడు జంతువుతో షికారు చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది. మింగేయకండి.. నమలండి: తిన్నది ఎంతైనాగానీ ఆహారాన్ని బాగా నమలండి. తిన్న ప్రతిసారీ మీ పోర్షన్ పరిమాణాన్ని తగ్గించుకుంటే..తక్కువ కేలరీలు తగ్గుతాయి. ప్రతీ ముద్దా ఎంత ఎక్కువ నమిలితే అంత మంచిది. తద్వారా కేలరీల మోతాదు తగ్గుతాయి. పోషకాలు పెరుగుతాయి. ఇంటి భోజనమే అమృతం: ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వేస్ట్ అయిపోతోందనో, టేస్టీగా ఉందనో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో..సాధ్యమైనంతవరకు ఇంటిలో తయారు చేసిన ఫుడ్ తినడం ఉత్తమం. లేదంటే ఆ తరువాత అద్దం ముందు నిలబడి, ఏం తిన్నా.. ఇక్కడికే వస్తోంది అనుకోవాలి పెరుగుతున్న నడుమును చూసి. -
మీ BMI సరిచూసుకోండి.. తేడా వస్తే ఇబ్బందులే!
న్యూఢిల్లీ: కోవిడ్ బారినపడిన ఊబకాయులకు రిస్క్ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేరాల్సి రావడం వంటివి ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ రిస్క్‌కు, శరీర బరువు(బాడీ మాస్ ఇండెక్స్, బీఎంఐ)తో సంబంధమున్నట్లు మొట్టమొదటిసారిగా చేపట్టిన తమ విస్తృత అధ్యయనంలో రుజవైందని యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి బరువు(కిలోగ్రాములు), అతని ఎత్తు(మీటర్లు)ను భాగించడం ద్వారా శరీరంలోని కొవ్వును బీఎంఐ ద్వారా లెక్కిస్తారు. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు. బీఎంఐ 23 కేజీ/ఎం2(కిలోగ్రాములు పర్ స్క్వేర్ మీటర్) ఉంటే దానిని ఆరోగ్యకరమైన స్థాయిగా భావిస్తారు. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువున్నా కోవిడ్‌తో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే చాన్స్ 10 శాతం పెరుగుతుందని తెలిపారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్న వారికీ కోవిడ్–19తో రిస్క్ ఎక్కువేనని వారు వివరించారు. ఇలాంటి రిస్క్ 20–39 ఏళ్ల మధ్య వారిలో అత్యధికం కాగా, 60 ఏళ్ల వారి నుంచి తగ్గుతుందని వెల్లడించారు. 19 ఏళ్లలోపు వారితోపాటు 80 ఏళ్లపైబడిన కోవిడ్ బాధితుల్లో బీఎంఐ చూపే ప్రభావం తక్కువని తెలిపారు. మొత్తమ్మీద చూస్తే 20–39 ఏళ్ల వారిలో మిగతా వయస్సు గ్రూపుల వారితో పోలిస్తే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని వెల్లడించారు. -
బరువు పెరిగితే రిస్కే
సాక్షి, అమరావతి: తాజా పరిస్థితుల్లో శరీర బరువు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాయామం చేసి శ్రమించడం వల్ల శరీరం అలసట నుంచి బయటపడాలి. కానీ.. మోయలేని భారంతో శరీరం ఎప్పుడూ శ్రమకు గురి కాకూడదు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా ఉంది. ఎత్తుకు మించి బరువు పెరిగితే ఆహార నియమాలు లేదా వ్యాయామం పాటించి జాగ్రత్త వహించాలి. తాజాగా కరోనా వచ్చే హై రిస్క్ కారణాల్లో ఊబకాయం ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ► తాజా గణాంకాల ప్రకారం మధుమేహం, హైపర్ టెన్షన్ తర్వాత ఊబకాయం హైరిస్క్ కేటగిరీలో ఉంది.బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం 25 కంటే తక్కువగా ఉంటే సరైన బరువున్నట్టు లెక్క. ► 30 కంటే ఎక్కువగా ఉంటే మెల్లిగా రిస్కులోకి వెళుతున్నట్టు సూచన. ► 35కు మించి ఉంటే బాగా రిస్కులో ఉన్నామని గమనించాలి. ► ప్రస్తుతం కోలుకుంటున్న వారిని పరిశీలిస్తే.. డయాబెటిక్, హైపర్ టెన్షన్, అధిక బరువు ఉన్న వారు కోలుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఊబకాయం ఉన్న వారిలో అవయవాలు (ఆర్గాన్స్) పరిమితంగా (రిజర్వుడుగా) పనిచేస్తాయి. -
ఆరోగ్యకరమైన బరువుకు సూచిక బీఎంఐ కాదు..!
ఊబకాయం ఉంటే బోలెడన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం వినే ఉంటాం. చాలా ఆరోగ్య సమస్యలకు చికిత్స ‘తగినంత’ కంటే ఎక్కువ బరువు ఉండటమేనని అనడమూ కద్దు. అందుకే దాదాపు వందేళ్లుగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అనే లెక్కకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ఆరోగ్యకరమైన బరువు ఎంత అనేందుకు బీఎంఐ ఒక్కటే సూచిక కాదని అంటోంది. శరీరం బరువుకు, ఎత్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపే బీఎంఐ చాలా ఎక్కువన్నప్పటికీ పదిశాతం కంటే తక్కువ కొవ్వు ఉండేవాళ్లు మనచుట్టూ ఎందరో ఉన్నారు. అంతేకాదు.. ఊబకాయంతో ఉన్న వారందరికీ మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి వచ్చే అవకాశాలు లేవని కూడా ఇప్పటికే చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బరువుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకునేందుకు చుక్క రక్తం ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తంలోని జీవక్రియలకు ఉపయోగపడే అనేకానేక రసాయనాల మోతాదులను గుర్తించడం ద్వారా గుండెజబ్బులు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలను 80 – 90 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చునని వీరి అంచనా. కొన్ని వేల మందిని పరిశీలించిన తరువాత తామీ అంచనాకు వచ్చినట్లు సెల్ ప్రెస్ శాస్త్రవేత్తలు తెలిపారు -
ఫిట్ ‘ఫోర్’ హెల్త్
ఫిట్‌గా వయసుకు తగ్గ బరువుతో ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఇందుకోసం మనం చేయని పనంటూ లేదు. మిగిలినవాటి సంగతెలా ఉన్నా మన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కరెక్టుగా ఉండాలంటే మాత్రం నాలుగు విషయాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు లోమా లిండా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. రోజుకు ఒకట్రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవడం వీటిల్లో మొదటిదైతే.. మధ్యాహ్నం లేదా సాయంత్రం భోజనం అనంతరం మళ్లీ మరుసటి రోజు వరకు (సుమారు 18 గంటలపాటు) నిరా హారంగా ఉండటం రెండోది. అలాగే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మానేయకుండా చూడటం మూడో అంశమైతే రోజులో తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్ మోతాదు ఎక్కు వగా ఉండేలా చూసుకోవడం నాలుగోది. ఇక బీఎంఐ పెర గడానికి ముఖ్యంగా రెండు కారణాలని వారు చెబుతున్నారు. అవి రోజుకు మూడు కంటే ఎక్కువసార్లు ఆహారం తీసుకో వడం, రాత్రిపూట సుష్టుగా భోంచేయడమని అంటున్నారు శాస్త్రవేత్తలు. చెకస్లోవేకియాలో దాదాపు 50 వేల మందికి సంబంధించిన ఆరోగ్య సర్వే వివరాలను పరిశీలించిన తరువాత ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొ న్న శాస్త్రవేత్త హనా కహ్లెలోవా చెప్పారు. సమతుల శరీర బరువు కావాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనా లు మాత్రమే తీసుకోవాలని, చిరుతిళ్లజోలికి అస్సలు పోకుం డా ఉంటే మేలని సూచిస్తున్నారు. కొంచెం కష్టమే కదా..!