ఫిట్ ‘ఫోర్’ హెల్త్
ఫిట్‌గా వయసుకు తగ్గ బరువుతో ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఇందుకోసం మనం చేయని పనంటూ లేదు. మిగిలినవాటి సంగతెలా ఉన్నా మన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కరెక్టుగా ఉండాలంటే మాత్రం నాలుగు విషయాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు లోమా లిండా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. రోజుకు ఒకట్రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవడం వీటిల్లో మొదటిదైతే.. మధ్యాహ్నం లేదా సాయంత్రం భోజనం అనంతరం మళ్లీ మరుసటి రోజు వరకు (సుమారు 18 గంటలపాటు) నిరా హారంగా ఉండటం రెండోది. అలాగే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మానేయకుండా చూడటం మూడో అంశమైతే రోజులో తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్ మోతాదు ఎక్కు వగా ఉండేలా చూసుకోవడం నాలుగోది.
ఇక బీఎంఐ పెర గడానికి ముఖ్యంగా రెండు కారణాలని వారు చెబుతున్నారు. అవి రోజుకు మూడు కంటే ఎక్కువసార్లు ఆహారం తీసుకో వడం, రాత్రిపూట సుష్టుగా భోంచేయడమని అంటున్నారు శాస్త్రవేత్తలు. చెకస్లోవేకియాలో దాదాపు 50 వేల మందికి సంబంధించిన ఆరోగ్య సర్వే వివరాలను పరిశీలించిన తరువాత ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొ న్న శాస్త్రవేత్త హనా కహ్లెలోవా చెప్పారు. సమతుల శరీర బరువు కావాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనా లు మాత్రమే తీసుకోవాలని, చిరుతిళ్లజోలికి అస్సలు పోకుం డా ఉంటే మేలని సూచిస్తున్నారు. కొంచెం కష్టమే కదా..!