integrated
-
11న సమీకృత గురుకులాలకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టు’కు ఈనెల 11వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దసరా పండుగకు ముందురోజున రాష్ట్రవ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకుల పాఠశా లల నిర్మాణ పనులకు భూమిపూజ జరుగుతుందని తెలిపారు. ఏడాదిలో వాటి నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాల ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదివారం సచివా లయంలో సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పనులపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మీడి యాతో మాట్లాడారు.‘‘సమీకృత గురుకుల విద్యాసంస్థల నిర్మాణాల కోసం 2024–25 బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావాల్సిన నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు.ప్రస్తుతం రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవు. 1,023 గురుకుల స్కూళ్లు ఉంటే అందులో 662 స్కూళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పక్కా భవనం లేనప్పుడు బోధన, అభ్యసన కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడుగు, బలహీనవర్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు.తొలుత 19 నియోజకవర్గాల్లో..ఇప్పటివరకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమి, ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయని భట్టి తెలిపారు. అందులో ఈ నెల 11న 19 చోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని.. మిగతా నియోజ కవర్గాల్లో పూర్తిస్థాయి సమాచారం అధారంగా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మా ణాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించా లని నిర్ణయించామని.. విద్యార్థులకే కాకుండా బోధన, బోధనేతర సిబ్బందికి అక్కడే క్వార్టర్స్ ఉంటాయని చెప్పారు. ఈ పాఠశా లల్లో చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి కూడా విద్యార్థులకు అందిస్తామన్నారు.ఒకరోజు ముందే దసరా పండుగ: మంత్రి వెంకట్రెడ్డిరాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 19 సమీకృత గురుకుల పాఠశాలల పనుల కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురుకుల పిల్లలకు ఒకరోజు ముందే దసరా పండుగ వచ్చినట్టేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న గురుకులాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మంచి భవిష్యత్తు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు.అన్ని నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలు: మంత్రి పొన్నంరాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేశామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో కొత్త నియామకాలు పూర్తి చేశామని.. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతులు చేపట్టామని చెప్పారు.11న శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకులాలు ఇవే..కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి. -
గడువులోపు పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సదరు కాంట్రాక్ట్ సంస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. విమానాశ్రయంలో నిర్మించిన అప్రోచ్ రోడ్డును శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి మొక్కలు నాటారు.అనంతరం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. కోవిడ్ పరిస్థితులు, వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. టెర్మినల్ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా 52 శాతం పనులనే పూర్తి చేయడంపై కేంద్ర మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 జూన్ 30 నాటికి టెర్మినల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై అవసరమైతే ప్రతి వారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అనకాపల్లి ఎంపీ రమేష్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, సివిల్ విభాగం జనరల్ మేనేజర్ రామాచారి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.ఇండిగో–ఢిల్లీ సర్వీస్ ప్రారంభంతొలుత న్యూఢిల్లీ–విజయవాడ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నడపనున్న విమాన సర్వీస్ ప్రారంభ వేడుకలను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
‘నకిలీ విత్తు’ చిత్తు!
ఇతని పేరు బుద్ధా సన్యాసిరావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం. ఈయన 5 ఎకరాల్లో సొంత విత్తనంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మొలక శాతం ఎంతుందో తెలుసుకునేందుకు ఆర్బీకే ద్వారా కోరుకొండ ల్యాబ్‌కు శాంపిల్ పంపి ఉచితంగా పరీక్ష చేయించారు. మొలక శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించడంతో వాటిని పక్కన పెట్టి, డెల్టా సీడ్స్ కంపెనీ నుంచి బీపీటీ 5204 విత్తనాన్ని కొని మరోసారి పరీక్షించుకుంటే మొలక శాతం బాగా వచ్చింది. అదే విత్తనాలు నారుమడి పోసుకొని సాగు చేశాడు. నిజంగా మొలక శాతం లేని సొంత విత్తనంతో సాగు చేసి ఉంటే ఎకరాకు విత్తనానికి రూ.1,000, నారుమడి, దమ్ముకు రూ.500, బాటలు తీసి ఎరువులు, పురుగు మందులకు మరో రూ.200 చొప్పున 5 ఎకరాలకు రూ.8,500కు పైగా నష్టం వచ్చేది. పంటపై పెరిగే పురుగులు, చీడపీడల నియంత్రణకు ఎకరాకు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. మొక్కలు ఎదగడానికి పట్టే 25 రోజుల విలువైన కాలమే కాకుండా, ఎకరాకు 4–6 బస్తాల దిగుబడి కోల్పోవాల్సి వచ్చేది. ‘ఆ విత్తనం ఉపయోగించకపోవడం వల్ల పెట్టుబడి కోల్పోకుండా జాగ్రత్త పడడమే కాదు.. మొలక శాతం ఎక్కువగా ఉన్న బీపీటీ 5204 రకం విత్తనంతో సాగు వల్ల ఆశించిన దిగుబడులను సాధించగలిగాను. కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్ వల్ల నా పంట కాపాడుకోగలిగాను’ అని ఈ రైతు ఆనందంగా చెబుతున్నాడు. పంపాన వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నుంచి సాక్షి ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొరుకొండ గ్రామం. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారు కొలువైన ఈ గ్రామంలో ఓ వైపు పంట పొలాలు.. మరో వైపు ఆయిల్ పామ్, మామిడి, జీడిమామిడి తోటలు. గ్రామంలో కొత్తగా నిరి్మంచిన సచివాలయం, ఆర్బీకే కేంద్రాలున్నాయి. గ్రామం మధ్య కాపవరం రోడ్డులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అత్యంత అధునాతనంగా నిరి్మంచిన భవనం ఉంది. అదే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్‌కు అనుబంధంగా పసు వ్యాధి నిర్ధారణ ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ పరిధిలో 16,691 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా, 14,162 మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది కౌలుదారులే. ల్యాబ్‌లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అత్యాధునిక పరికరాలే. విత్తన, ఎరువుల శాంపిల్స్‌ను పరీక్షించే సీడ్ బ్లోవర్, మైక్రోస్కోప్, ప్యూరిటీ బోర్డు, డిస్టిలేషన్ యూనిట్, బోర్నర్, గోనెట్ డివైడర్, సీడ్ జెర్మినేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, మప్లే పర్నేస్, హాట్ప్లేట్, సెక్షన్ పంప్, డేస్కికేటర్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పరికరాలు ఉన్నాయి. రైతులు తెచ్చిన శాంపిల్స్ పరీక్షించడంలో ల్యాబ్ ఇన్చార్జి, వ్యవసాయాధికారి దేవరపల్లి రామతులసితో పాటు ల్యాబ్ సిబ్బంది తలమునకలైఉన్నారు. అదే సమయంలో శాంపిల్స్ పట్టుకొని కొంతమంది, ఇచ్చిన శాంపిల్స్ ఫలితాల కోసం మరికొంత మంది రైతులు ల్యాబ్‌కు రావడం మొదలైంది. ల్యాబ్ ఏమిటో? ఎవరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీకు తెలుసా? అని ఆరా తీయగా, అక్కడకు వచ్చిన రైతులే కాదు.. గ్రామంలోని పలువురు రైతులు కూడా ల్యాబ్ ఏర్పాటుతో మాకు ఎంతో మేలు జరుగుతోందని ఆనందంగా చెప్పారు. ‘గతంలో ఏదైనా పరీక్షించుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లేందుకు ఆరి్థక భారం కావడంతో డీలర్లు ఇచ్చిన విత్తనాలను కనీసం పరీక్ష కూడా చేయించుకోకుండానే విత్తుకునే వాళ్లం. మొలక వస్తే అదృష్టం.. లేకుంటే మా దురదృష్టం.. అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ ల్యాబ్ రావడంతో విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయించుకోగలుగుతున్నాం’ అని తెలిపారు. విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ అద్భుత పనితీరుతో రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టిపాలు కాకుండా ముందుగానే పరీక్షించి హెచ్చరిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం, నకిలీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేసుకోగలుగుతున్నారు. సొంతంగా తయారు చేసుకున్నవైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ల్యాబ్‌కు వెళ్లి విత్తన నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని, ఫలితాల ఆధారంగా ధైర్యంగా సాగు చేసుకోగలుగు తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నష్టపోకుండా అగ్రి ల్యాబ్‌లు అండగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీలదే రాజ్యం రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి ఉండేదికాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయేవారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడంతో రైతుల్లో నమ్మకం, భరోసా కలిగింది. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి రూ.82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్, రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. కాగా 2021 జూలై 8న రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే ల్యాబ్‌లలో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును 2–3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, పురుగు మందులకు సంబంధించి రూ.3,500, విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తోంది. ఏటా 50 వేల శాంపిళ్ల చొప్పున ఇప్పటి వరకు 1,03,215 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. వీటిలో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకం దారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. అత్యాధునిక పరికరాలు నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతున్నాయి. ల్యాబ్‌లో ఏబ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు.. నాణ్యత సరి్టఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్ లో ఒక అఫీషియల్ అనలిస్టు, ఇద్దరు జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్‌ల ద్వారా ఏటా 50 వేలకు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలపాలవ్వకుండా చూశారు. అత్యుత్తమ ల్యాబ్‌గా కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లలో కోరుకొండ ల్యాబ్ నంబర్ వన్‌గా నిలిచింది. ల్యాబ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు 1038 శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో యాక్ట్ శాంపిల్స్‌లో 74 విత్తన, 26 ఎరువు శాంపిల్స్, ఆర్బీకే శాంపిల్స్‌లో 16 విత్తన, 35 ఎరువులు, రైతు శాంపిల్స్‌లో 716 విత్తన, 75 ఎరువులు, ట్రేడ్ శాంపిల్స్‌లో 66 విత్తన, 25 ఎరువు శాంపిల్స్ పరీక్షించారు. రైతు శాంపిల్స్‌లో 21 నమూనాలు నాణ్యతలేనివని గుర్తించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా కాపాడగలిగారు. ల్యాబ్‌లలో పరీక్షలు ఇలా జిల్లా ల్యాబ్స్‌లో బీటీ, హెచ్‌టీ పత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్‌లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. 4 కేటగిరిల్లో శాంపిల్స్ పరీక్ష.. యాక్ట్ శాంపిల్స్ : ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి మండలంలోని డీలర్ల దగ్గర, వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్‌ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ ద్వారా వివిధ ల్యాబ్స్లకు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ : ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, విత్తన శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ : రైతులు సొంతంగా, నేరుగా తెచ్చుకునే శాంపిల్స్ డీలర్ శాంపిల్స్: డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్ డీలర్లలో భయం నేను 10 ఎకరాల్లో ఇటీవల కొత్తగా వచ్చిన వరి వంగడం ఎంటీయూ 1318 సాగు చేయాలనుకున్నా. కొత్త రకం కదా.. మొలక శాతం ఏలా ఉంటుందోననే ఆందోళనతో కోరుకొండ ల్యాబ్‌కు తీసుకొచ్చి పరీక్ష చేయించాను. మంచి ఫలితం వచ్చింది. నేను నారుమడి పోసి సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ ల్యాబ్‌ల వల్ల గతంలో మాదిరిగా డీలర్లు ఏది పడితే వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేయడం లేదు. ల్యాబ్‌ల ఏర్పాటుతో ఇన్పుట్స్ క్వాలిటీపై రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – చిల్పారాశెట్టి అప్పలరాజు, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి నాణ్యత ప్రమాణాలపై దృష్టి జిల్లా, నియోజకవర్గ స్థాయి ల్యాబ్ సేవలు దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యాధునిక ఎక్యూప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ల్యాబ్‌లలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు నాలుగు జోన్లుగా విభజించాం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి, పల్నాడు జిల్లా వ్యవసాయాధికారులను ఈ జోన్లకు కస్టోడియన్ అధికారులుగా నియమించాం. వీరి సేవలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
ఎవరికి వారు పెంచుకునేలా..వెటరన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్!
ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో తనకు నైపుణ్యం ఉన్న రంగంలో కృషిని కొనసాగించడం ఇటు తనకు, అటు సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వ్యక్తి వెస్లీ రొసారియో. తన నమ్మకాన్ని ఆచరణలో పెట్టి వాహ్ అనిపించుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన వెస్లీ చేపలు, రొయ్యల పెంపకంలో నిపుణుడు. బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నత స్థాయిలో సేవలందించి దగుపన్ నగరంలో మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బదిలీల వల్ల టపుయాక్ జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ ఇంటితో పాటు వెయ్యి చదరపు మీటర్ల పెరడు కూడా నిరుపయోగంగా పాడు పడింది. రిటైరైన తర్వాత ఆయన ఇంటికి చేరుకొని కొద్ది నెలల్లోనే ఫిష్‌టెక్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫార్మింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పటంతో ఇంటికే కాదు పెరటికి కూడా కళ వచ్చింది. ఇంటిపట్టునే కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లతో పాటు చేపలను కూడా నిశ్చింతగా ఎవరికివారు పెంచుకొని ఇంటిల్లపాదీ పౌష్టికాహారాన్ని ఆస్వాదించవచ్చని వెస్లీ రొసారియో తన అర్బన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్‌లో ఆచరించి చూపుతున్నారు. యూత్, సెకండ్ యూత్ అన్న తేడా లేకుండా బ్యాచ్‌ల వారీగా అందరికీ శిక్షణ ఇస్తున్నారాయన. ట్యాంకు నుంచి అజోలాను వెలికితీస్తున్న రొసారియో వెస్లీ రొసారియో పెరటి తోటలో మొత్తం ఎనిమిది (మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవైన) చిన్న చెరువులు ఉన్నాయి. నేలపై తవ్విన చెరువుతో పాటు సిల్పాలిన్ షీట్, ఫైబర్‌తో చేసిన కృత్రిమ చెరువులు కూడా ఉన్నాయి. రీసర్కులేటరీ ఆక్వా చెరువు కూడా అందులో ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యే మడులతో పాటు కంటెయినర్లు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థలో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఆక్వాపోనిక్స్ వ్యవస్థ అదేవిధంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ ఉంది. చేపల విసర్జితాలు, వాటికి వేసే మేత వ్యర్థాలతో కూడిన ఆ నీరు పోషకవంతమై ఆకుకూరలకు ఉపయోగపడుతోందని వెస్లీ రొసారియో తెలిపారు. నేలపై ఉన్న చెరువులో జెయింట్ గౌరామి, తిలాపియా, ఫంగాసియస్, క్యాట్‌ఫిష్‌లు పెరుగుతున్నాయి. నాటు కోళ్లు, బాతులకు ఆయన ప్రధానంగా అజోలాని పండించి మేతగా వేస్తున్నారు. అజోలాను నీటిలో వేస్తే చాలు, పెరుగుతుంది. ప్రాసెసింగ్ అవసరం లేదు. నేరుగా చేపలు, జంతువులకు, పక్షులకు మేతగా వేయొచ్చని ఆయన అన్నారు. అజోలా పెరిగే చెరువుల్లో దోమలు గుడ్లుపెట్టే అవకాశం ఉండబోదన్నారు. చెరువు నీటిలో చేపలు పెంచుతూనే, ఆ చెరువు నీటిపై తేలాడే మడు(ఫ్లోటింగ్ బెడ్)లను ఏర్పాటు చేసి అజోలాను పెంచుతుండటం విశేషం. సందర్శకులకు హైడ్రోపోనిక్స్ గురించి వివరిస్తున్న వెస్లీ రొసారియో చేపల తలలు, తోకలు, రెక్కలు, పొలుసులు, లోపలి భాగాలు వంటి వ్యర్థాలను సేకరించి మీనామృతం తయారు చేసి, పంటలపై పిచికారీ చేస్తే బలంగా పెరుగుతాయని రోసారియో తెలిపారు. వంకాయలు, మిరపకాయలు, బెండకాయకాయలు తదితర కూరగాయలను పండిస్తాం. బాతులు, నాటు కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. పట్టణ ప్రజలు పెరట్లో చేపలు, కూరగాయలు పెంచుకోవడానికి శ్రద్ధ కావాలే గానీ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అంటున్నారు రొసారియో. అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది నేను పదవీ విరమణ తర్వాత జీవితం ఉండేలా చూడాలనుకున్నాను. నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఏమి చేయాలో ముందుగానే ప్లాన్ చేసాను. నా వృత్తిపరమైన జీవితమంతా ఫిషరీస్‌లో పనిచేశాను కాబట్టి ఫిష్‌టెక్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫామ్‌ని ఏర్పాటు చేశాను. నా అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అలాగే, వచ్చి సలహాలు అడిగే మాజీ సహోద్యోగులతో సంబంధాలు కొనసాగటం సంతోషంగా ఉంది. – వెస్లీ రొసారియో, దగుపన్ నగరం, ఫిలిప్పీన్స్ (చదవండి: పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!) -
ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!
సాక్షి,ముంబై: ట్రాక్ సూట్‌లా బాడీ స్కానర్గురించి విన్నారా. కొత్త తరహా ట్రాక్‌సూట్ నిజానికి ట్రాక్‌సూట్ కాదు, బాడీ స్కానర్! అమెరికన్ కంపెనీ ‘జోజోఫిట్’ ఇటీవల తేలికగా ట్రాక్సూట్లా తొడుక్కోవడానికి అనువైన ఈ త్రీడీ బాడీ స్కానర్‌ను రూపొందించింది. ఇది యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తొడుక్కుని, యాప్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, క్షణాల్లోని శరీరంలోని పది కీలక భాగాలకు చెందిన కొలతలను అత్యంత కచ్చితంగా తెలియ జేస్తుంది. (రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు) అంతేకాదు, శరీరంలోని ఏయే భాగాల్లో ఏ మేరకు కొవ్వు పేరుకుపోయి ఉందో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఎత్తు, బరువు వివరాలతో పాటు శరీరం కొలతలతో పోలిస్తే కొవ్వు నిష్పత్తి ఎంత ఉందో ఏమాత్రం తేడా లేకుండా చెప్పేస్తుంది. ప్రొఫెషనల్ క్రీడాకారులతో పాటు ఔత్సాహికులకు కూడా పనికొచ్చేలా దీన్ని తీర్చిదిద్దినట్లు ‘జోజోఫిట్’ సంస్థ చెబుతోంది. ఈ త్రీడీ బాడీ స్కానర్ ట్రాక్‌సూట్ విక్రయాల కోసం ‘జోజోఫిట్’ త్వరలోనే టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో షోరూమ్‌ను ప్రారంభించనుంది. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) -
ఏపీలో విష్ణు కెమికల్స్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో స్పెషాలిటీ కెమికల్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. విష్ణు కెమికల్స్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా 57 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఆటోమొబైల్, ఫార్మా, ఉక్కు తదితర పరిశ్రమలకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. -
AP: ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా ఆర్టీసీ
సాక్షి, అమరావతి: వనరుల సద్వినియోగం ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధన దిశగా ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో విలువైన స్థలాల్లో ‘నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లోని ఆర్టీసీ స్థలాలను కూడా లీజుకు ఇవ్వాలని, ఆ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. చదవండి: ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు.. మొదటి దశలో 48 కేంద్రాల్లో స్థలాలను లీజుకు ఇవ్వనుంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల పరిధిలోని మొత్తం 1,98,393 చ.గజాల విస్తీర్ణంలోని స్థలాలను ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల కాలపరివిుతికి ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి జోన్ పరిధిలో 14 కేంద్రాల్లో 38,188 చ.గజాలు, రెండో జోన్ పరిధిలో 10 కేంద్రాల్లో 21,125 చ.గజాలు, మూడో జోన్ పరిధిలో 11 కేంద్రాల్లో 33,326 చ.గజాలు, నాలుగో జోన్ పరిధిలో 13 కేంద్రాల్లో 1,05,754 చ.గజాల స్థలాలు ఉన్నాయి. వాటిలో కనిష్టంగా 250 చ.గజాల నుంచి గరిష్టంగా 15,500 చ.గజాల స్థలాల వరకు ఉండటం విశేషం. ఆ స్థలాల్లో జి+1 విధానంలో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతిస్తారు. లీజు కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ సముదాయాలు ఆర్టీసీ సొంతమవుతాయి. ఈ స్థలాల లీజుకు సంబంధించి ఆయా జోన్ల వారీగా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. -
ఎక్కువ దరఖాస్తులు వాటికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసమే వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్ల కోసం అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్లు, కాల్ సెంటర్ల ద్వారా వచ్చే ఈ దరఖాస్తులకు సంబంధించిన సర్టిఫికెట్లను సులభంగా జారీచేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలుచేస్తోంది. అలాగే, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనపడుతోంది. సర్టిఫికెట్ల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణాలు గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. దరఖాస్తుల తీరూతెన్నూ ఎలా ఉందంటే.. ► గత నెలలో 26 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ (క్యాస్ట్, నేటివిటీ, పుట్టిన తేదీ) సర్టిఫికెట్ల కోసం 1.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 92 వేల సర్టిఫికెట్లను ఆమోదించి జారీచేయగా, 1,050 సర్టిఫికెట్లను తిరస్కరించారు. 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే 30 శాతం సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా చూస్తే ఈ సర్టిఫికెట్ల కోసం 2.68 లక్షల దరఖాస్తులు రాగా, 2.15 లక్షల దరఖాస్తులను మంజూరు చేశారు. 8,100 దరఖాస్తులను తిరస్కరించగా, 45 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 నెలల్లో ఈ సర్టిఫికెట్ల పెండింగ్ శాతం 16 శాతంగా ఉంది. ► అలాగే, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 1.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 95 వేల దరఖాస్తులను మంజూరు చేశారు. 2,700 దరఖాస్తులను తిరస్కరించగా, 18 వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మూడు నెలలుగా చూసుకుంటే.. మొత్తం 2.20 లక్షల దరఖాస్తులు రాగా 1.93 లక్షల దరఖాస్తులను ఆమోదించి, 7,500 దరఖాస్తులను తిరస్కరించారు. 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. ► ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం గత నెలలో 15,500 దరఖాస్తులు రాగా 7,500 దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 1,600 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 6,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ దరఖాస్తులు 41% పెండింగ్‌లో ఉంటున్నాయి. మూడు నెలలుగా చూసుకుంటే 44 వేల దరఖాస్తులు రాగా 28 వేల దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 8,300 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 7,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారు. 3 నెలల్లో ఈ దరఖాస్తులు 16% పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తుకు సంబంధించి గతంలో కుటుంబ పెద్ద సర్టిఫికెట్ పొంది ఉంటే దాని ప్రకారం అప్పటికప్పుడు వెంటనే సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉంటుంది. ► పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా చేసుకున్న దరఖాస్తులు గత నెలలో 4,100 రాగా ఇందులో 570ని జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించగా, 3,500కి పైగా పెండింగ్‌లో ఉంచారు. వీటి పెండింగ్ శాతం 86గా ఉండడం గమనార్హం. ► డెత్ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా పెట్టుకున్న దరఖాస్తులు గత నెలలో 1,600 రాగా కేవలం 128నే ఆమోదించి జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించారు. 1,400కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 90 శాతానికి పైగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ► అలాగే, పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా వచ్చే దరఖాస్తులకు సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సీసీఎల్ఏ ఆదేశాలిచ్చింది. -
ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం అధికారులు, గ్రీన్కో ప్రతినిధులతో కలెక్టర్ కోటేశ్వరరావు సమావేశమయ్యారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. గ్రీన్కో ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి 5,410 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించే పవర్ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇలా ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కర్నూలు జిల్లాలో నిర్మితం అవుతుండటం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో సీఎం పర్యటన ఏర్పాట్లపై డైరెక్టర్ విద్యాసాగర్‌తో చర్చించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ హరిప్రసాదు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..) 800 మంది పోలీసులతో బందోబస్తు కర్నూలు (టౌన్): సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, 122 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 283 మంది కానిస్టేబుళ్లు, 28 మంది మహిళా పోలీసులు, 169 మంది హోంగార్డులు, 03 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, 02 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, 7 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు తెలిపారు. -
ప్రయాణికుల కోసం ఒకే నంబర్: రైల్వే
న్యూ ఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే సమాచార సౌకర్యం కోసం భారత రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ 139ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌ను జనవరి 1న భారత రైల్వే ప్రారంభించింది. గతంలో రైల్వే సమాచారం కోసం పలు రకాల సహాయక నంబర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రయాణికులకు అన్నిరకాల సేవలను ఒకే నంబర్లతో అందించటం కోసం ఇండియన్ రైల్వే 139 నంబర్‌ను తీసుకువచ్చింది. దీంతో పాటు భారత రైల్వే ప్రయాణికుల కోసం ‘రైల్ మాడాడ్’ అనే యాప్‌ను లాంచ్ చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా భారత రైల్వే గతంలో ఉన్న సహాయక నంబర్లు నిలిపివేసి 139 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జనవరి 1 నుంచి కేవలం 139, 182 నంబర్లతో పాటు ‘రైల్ మాడాడ్’ పోర్టల్‌తో అన్ని సేవలను అందించనున్నట్లు భారత రైల్వే పేర్కొంది. సాధారణ ఫిర్యాదు సంఖ్య-138, క్యాటరింగ్ సేవ-1800111321, విజిలెన్స్-152210, ప్రమాదం, భద్రత- 1072, క్లీన్ మై కోచ్ - 58888/138, ఎస్ఎంఎస్ ఫిర్యాదు-9717630982 వంటి సహాయక నంబర్లు జనవరి ఒకటి నుంచి పనిచేయవని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. -
నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా రెండ వ నెల నవంబర్లోనూ తగ్గాయి. రూ.80,808 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వసూళ్లలో ఇది కనిష్టస్థాయి. కొత్త జాతీయ అమ్మకపు పన్ను విధానాన్ని మరింత ఆమోదనీయంగా మలచడంలో భాగంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణం. తాజా వసూళ్లపై ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగా చూస్తే... అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.83,000 కోట్లు , నవంబర్‌లో ఇవి రూ. 80,808 కోట్లకు చేరాయి. జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ. 95,000 కోట్లు. ఆగస్టులో రూ.91,000 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.92,150 కోట్లు. నవంబర్ వసూళ్లు రూ.80,808 కోట్లలో రూ. 7,798 కోట్లు కాంపెన్సేగా సెస్‌గా వసూలయ్యాయి. రూ.13,089 కోట్లు సెంట్రల్ జీఎస్టీకాగా రూ.18,650 కోట్లు రాష్ట్ర జీఎస్టీ. రూ.41,270 కోట్లు ఇంటిగ్రేటెడ్ గూడ్స్ జీఎస్టీ. -
చేతులు కలిపారు
► ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల విలీనం ► డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ ► సీఎం, పార్టీ ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ► శశికళ తొలగింపునకు త్వరలో జనరల్ కౌన్సిల్ భేటీకి నిర్ణయం ► శశికళ వర్గం ఎమ్మెల్యేల అసంతృప్తి ► నేడు గవర్నర్‌తో భేటీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని రెండు కీలక వర్గాలు విలీనమయ్యాయి. మూడు నాలుగు రోజులుగా విలీనంపై చర్చలు కొలిక్కి రాకపోవటంతో పెరిగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. తాజా మార్పుల నేపథ్యంలో దినకరన్, శశికళ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు రేపు గవర్నర్‌ను కలవనున్నారు. అటు, అన్నాడీఎంకే విలీనంపై సినీనటుడు కమల్ హాసన్ స్పందించారు. తమిళ ప్రజల నెత్తిన ఈ రెండు వర్గాల నేతలు టోపీ పెడుతున్నారని ట్విటర్ ద్వారా విమర్శించారు. నాటకీయ పరిణామాలు రెండు వర్గాల మధ్య నాలుగు రోజులుగా చర్చలు జరగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. శని, ఆది వారాల్లో పన్నీర్, పళని వర్గాల దూతలు సమావేశమైనా పార్టీ, ప్రభుత్వంలో పదవులపై పట్టుబట్టడంతో కలవటం కష్టమేననే సంకేతాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పన్నీర్‌సెల్వం మరోసారి తన అనుచరులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం పళనిస్వామి దూతలుగా వచ్చిన సీనియర్ మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణిలు.. పన్నీర్‌సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి, పాండియన్‌కు మంత్రి పదవికి సమ్మతి వ్యక్తం చేశారు. అయితే, శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించాలని పన్నీర్‌వర్గం మరోసారి పట్టుబట్టడంతో మళ్లీ ప్రతిష్టంభన తలెత్తింది. అటు సీఎం కూడా సోమవారం తన నివాసంలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఇంతలో.. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నట్లు ఇరువర్గాల నుంచి కార్యకర్తలు, మీడియాకు సమాచారం వచ్చింది. అయితే మధ్యాహ్నం 2 కావస్తున్నా.. ఇద్దరు నేతలూ వారి ఇళ్లనుంచి బయటకు రాలేదు. దీంతో కార్యకర్తల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇరువురు నేతలు పార్టీ కార్యాలయానికి బయలుదేరి 3.15 గంటలకు సంయుక్త మీడియా సమావేశంలో చేతులు కలిపారు. ‘మనల్ని ఎవరూ విడదీయలేరు. మనమంతా అమ్మ పిల్లలం’ అని పన్నీర్ సెల్వం తెలిపారు. ‘మనమంతా కలిసిపోయినందుకు నేడు ఎంజీఆర్, అమ్మ చాలా సంతోషిస్తారు. ఆర్నెల్లలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇకపై వాటిని అధిగమిద్దాం’ అని పళనిస్వామి వెల్లడించారు. దీంతో సమావేశ మందిరంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. శశికళ తొలగింపునకు కొన్ని న్యాయ అడ్డంకులున్నందున.. త్వరలోనే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేసి ముందడుగేయనున్నట్లు తెలిసింది. డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం అనంతరం ఇద్దరు నేతలు మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్, జయలలిత సమాధి వద్దకెళ్లి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం.. పన్నీర్‌సెల్వం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖలను నిర్వహించనున్నారు. పన్నీర్వర్గానికే చెందిన కే పాండియన్ తమిళనాడు అధికార భాష, సంస్కృతి సంప్రదాయాల శాఖలను పొందారు. ప్రమాణ చేసిన పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామిని ప్రధాని మోదీ అభినందించారు. ‘తిరు ఓ పన్నీర్సెల్వంతోపాటుగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇదో కొత్త టోపీ.. కమల్: అన్నాడీఎంకే వర్గాల విలీనంపై సినీనటుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. సోమవారం విలీనం జరుగుతుండగానే.. ట్విటర్ దాడి చేశారు. ‘గాంధీ టోపీ, కాషాయ టోపీ, కశ్మీర్ టోపీలను చూశాం. ఇప్పుడు తమిళ ప్రజల నెత్తిన జోకర్ టోపీ పెడుతున్నారు. ఇది చాలా? ఇంకా ఏమైనా కావాలా? తమిళులారా మేల్కొనండి!’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘మరో స్వాతంత్య్ర సంగ్రామం, ముఖ్యంగా అవినీతిపై పోరాటం కోసం మీలో ఎవరికి ధైర్యముంది?’ అని మరో ట్వీట్లో కమల్ తమిళప్రజలను ప్రశ్నించారు. -
విలీనమా..వ్యూహమా!
► స్పందించని చిన్నమ్మ ► వేటుపై దినకరన్ సానుకూల ధోరణి ► అన్నాడీఎంకేలో పరిణామాలపై అనుమానాలు ► విలీనం ఒక డ్రామా అంటున్న కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అమ్మ మరణం తరువాత చీలికలు పేలికలై అనేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకే తాజాగా వైరివర్గాల విలీనం దశకు చేరుకుంది. పార్టీలో ముసలానికి ప్రధాన కారణమైన శశికళ కుటుంబంపై వేటువేయడం ద్వారా అన్నాడీఎంకేకు పూర్వవైభవం తెస్తామని చాటుకుంటూ సాగుతున్నది చిత్తశుద్ధితో కూడిన విలీనమా మరేదైనా వ్యూహమా అనే అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే శకం ఇక ముగిసిపోయిందని అందరూ తీర్మానించుకోగా, తాజాగా చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల వల్ల పార్టీతోపాటూ రెండాకుల చిహ్నం కూడా చేరువకాగలదని ఇరువర్గాలు నమ్ముతున్నాయి. అయితే విలీనం వెనుక కేవలం పార్టీ ప్రయోజనాలేనా..ఇరువర్గాల విలీనం విశ్వసనీయమైనదేనా అనే చర్చ మొదలైంది. అమ్మ మరణం తరువాత అనా«థగా మారిన అన్నాడీఎంకేకు అండగా నిలవ డం ద్వారా తమిళనాడుల వేళ్లూనుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదిపింది. సీఎం పన్నీర్‌సెల్వంకు బాసటగా నిలుస్తూ రాజకీయంగా రాజబాట వేసుకోవాలని భావించింది. అయితే బీజేపీ అంచనాలు తారుమారుకాగా శశికళ వర్గం అధికారంలోకి వచ్చింది. ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లినా పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారకపోగా రాజకీయంగా పన్నీర్‌సెల్వం మరింత బలహీనపడిపోయారు. ఇక పూర్తిగా కార్యాచరణలోకి దిగిన కేంద్రం అదనుకోసం వేచిచూడటం ప్రారంభించింది. సరిగ్గా ఈసమయంలో దినకరన్ పలు కేసుల్లో ఇరుక్కోవడం కేంద్రానికి అయాచిత వరాలుగా మారాయి. అవినీతి ఆరోపణల్లో అధికార పార్టీ అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందనే భయం శశికళ వర్గంలో నెలకొంది. ఈ భయానికి ఊతమిస్తూ ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు నాలుగురోజుల క్రితం అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. పన్నీర్‌సెల్వం దూరమైన నాటి నుండే తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం టార్గెట్ చేసిందని శశికళ వర్గం అనుమానిస్తోంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే ఒకవైపు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తే మనుగడ లేదని శశికళ వర్గానికి తెలుసు. చేజేతులా అధికారాన్ని చేజార్చుకునే కంటే శశికళ, దినకరన్‌లపై వేటువేయడం ద్వారా పన్నీర్ సెల్వంతో రాజీపడితే కేంద్రంతో సత్సంబంధాలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కూడా దక్కుతాయని ఎడపాడి పన్నాగంగా ఉంది. కేంద్రం కల్పించిన కష్టాల నుండి గట్టెక్కేందుకు పన్నీర్‌సెల్వంను శశికళ వర్గం పావుగా వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. తనను బహిష్కరిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ఎమ్మెల్యేల బలం ఉందని రెండురోజుల క్రితం హెచ్చరించిన దినకరన్ వేటుకు వంతపాడటం, శశికళ నోరుమెదపక పోవడం వెనుక అంతరార్థం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ వ్యూహం మరోలా ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే గెలుపు నల్లేరుమీద నడకకాగలదు. కాంగ్రెస్ మిత్రపక్ష డీఎంకే అధికారంలోకి వచ్చేకంటే అస్తవ్యస్తంగా తయారైన అన్నాడీఎంకేను దారికితెచ్చుకుని తనకు అనుకూలంగా మలుచుకోవడం మేలనే ఆలోచనతోనే తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ పలుకోణాల్లో వత్తిడిపెంచినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుని తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే వీలీనం వెనుక వ్యూహమని భావించవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రమాదం నుంచి గట్టేక్కేందుకు శశికళ వర్గం, తమిళనాడులో జెండా పాతేందుకు బీజేపీ..విలీనానికి వ్యూహకర్తలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనం ఒక నాటకం: కేంద్ర మంత్రి పొన్ కాగా, అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. నాగర్‌కోవిల్‌లో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏ కారణం చేత విడిపోయారు, నేడు ఏ కారణం చేత విలీనం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. జయ మరణ మిస్టరీపై విచారణ కమిషన్ వేస్తానని పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటన విలీనం తరువాత నీరుగారిపోవడమో లేదా కంటితుడుపు కమిషన్‌గా మారడమో జరుగుతుందని ఆయన అన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు తేవడం ద్వారా లబ్ది పొందాల్సిన అగత్యం బీజేపీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
విలీన బాటలో స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్
ముంబై: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ సంస్థ విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా స్టాక్స్ డీల్‌గా ఉండొచ్చునని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే సంప్రతింపులు మళ్లీ ప్రారంభం కావొచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్‌ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్నాప్‌డీల్‌తో ఈ–కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్‌కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్‌డీల్‌లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది. స్నాప్‌డీల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ–కామర్స్‌లో రూ. 1,350–1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. తద్వారా భారత మార్కెట్లో ఆన్లైన్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో పోటీపడుతోంది. పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. పేటీఎంలో రిలయన్స్ క్యాప్ వాటా సేల్..! పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో తమకున్న 1 శాతం వాటాను విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ యోచిస్తోంది. తద్వారా 50–60 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించాయి. -
ఫ్రెంచి సంస్థతో ఆర్టీసీ ఒప్పందం
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టం సాఫ్ట్వేర్ దిగుమతికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టం సాఫ్ట్వేర్ ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దేశ పర్యటనకు వెళ్లిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు దీన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేస్తారు. ఏ బస్సు ఎక్కడ ఉంది, ఎంత సేపట్లో నిర్ధారిత బస్టాప్‌నకు చేరుకుంటుంది.. తదితర వివరాలను సోలార్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులు తెలుసుకునే వెసులుబాటు ఈ సాఫ్ట్‌వేర్‌తో ఏర్పడుతుంది. పలు దేశాల్లో ఈ తరహా వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉంది. ఈ సాఫ్ట్వేర్లలో మెరుగైన వ్యవస్థ ఫ్రాన్స్‌లోని ఐఎక్స్ఎక్స్ఎన్ఏఎన్ యూ వద్ద ఉందని ఆర్టీసీ గుర్తించింది. గతంలో ఆ సంస్థ నిర్వాహకులు హైదరాబాద్‌కు ఓ సారి వచ్చి అధికారులకు సాఫ్ట్వేర్ గురించి వివరించారు. ఇప్పుడు జర్మ నీ, ఫ్రాన్స్ పర్యటనల్లో ఉన్న ఆర్టీసీ చైర్మన్, ఎండీలు ఆ సంస్థ ప్రతినిధులతో పారిస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముగిసిన పర్యటన.. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీసీయూ) ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆర్టీసీ ప్రతినిధుల బృందం గత నెల 25న జర్మనీ, ఫ్రాన్స్‌లలో పర్యటించింది. సెమినార్లు, సదస్సుల్లో పాల్గొనటంతోపాటు ఆయా దేశాల్లో అమలులో ఉన్న పద్ధతులను పరిశీలించింది. అక్టోబర్ ఒకటితో పర్యటన ముగిసింది. జర్మనీలో నిహ్యాన్నోవర్లో ఆటోమొబైల్ ఎక్స్‌పోలో వివిధ నమూనాల ఆధునిక బస్సులనూ వీరు పరిశీలించారు. ఆర్టీసీ సికింద్రాబాద్ ఆర్ఎం కొమురయ్య కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
ఎలా కదిలేది..! కదిలించేది..!
సిటీబ్యూరో: జిల్లా పాలనలో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయం శిథిలమై ప్రమాదకరంగా మారింది. కొత్త భవనానికి ప్రభుత్వం సరిపడినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ కలెక్టరేట్ భవన సముదాయం పూర్తిగా శిథిలమైంది. ఇందులో ప్రస్తుతం తొమ్మిది ప్రభుత్వ శాఖలకు చెందిన 300 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణానికి రూ.19.80 కోట్ల నిధులను గత ఏడాది నవంబర్‌లో విడుదల చేసింది. అయితే, జిల్లా కలెక్టరేట్లను ఇంటిగ్రేటేడ్ భవన సముదాయంగా నిర్మించుకుంటే పరిపాలన సులభమవుతుందని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీందో కలెక్టరేట్‌తో సహా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నాంపల్లిలోని పాత కలెక్టరేట్ భవనం స్థానంలోనే కొత్త భవన సముదాయం నిర్మించుకునేందుకు జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇది 18 అంతస్తులు ఉండేలా ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం తక్కువ నిధులు మంజూరు చేయటంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. రెండవ దశ నిధుల మంజూరుకు పట్టుదలతో అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా.. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనంలోని తొమ్మిది ప్రభుత్వశాఖలను ఎక్కడి తరలించాలని మథనపడుతున్నారు. -
బడా టౌన్షిప్
ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు ఉడా ప్రతిపాదన అటవీ భూముల్లో భారీ హౌసింగ్ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేత ఉడా చరిత్రలో ఇదే భారీ ప్రాజెక్టు సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) మరో భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈసారి సుమారు 1,400 ఎకరాల్లో ఇంటిగ్రేటెట్ టౌన్షిప్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.700 కోట్ల అంచనాతో ఈ మెగా హౌసింగ్ వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును తమకు అనుకూలంగా ఉన్న అటవీ భూమిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఆ భూములను అటవీ శాఖ చట్టం 1980 సెక్షన్(2) కింద కన్వర్షన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు ఇవీ.. మొత్తం 1,400 ఎకరాల భూమిలో 700 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం, మిగిలిన 350 ఎకరాల్లో పార్కు, బ్యాంకులు, పోలీసుస్టేషన్ తదితర అన్ని కార్యాలయాలకు అనువుగా భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఉడా సిద్ధం చేసిన ప్రతిపాదనల్లో ఇదే అత్యంత పెద్దది కావడం విశేషం. రాజధానితో లింకు..! ఉడా అధికారులు ప్రతి ప్రతిపాదనకు రాష్ట్ర రాజధానితో ముడిపెడుతున్నారు. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన క్రమంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. శాశ్వత రాజధాని కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ఉడా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఉడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని కూడా కోరుతున్నారు. ఏక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎక్కడి నుంచి నిధులు వచ్చినా తక్షణమే ప్రతిపాదనలను అచరణలోకి పెట్టాలని భావిస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ కొరత ఉడాకు మొదటి నుంచి ల్యాండ్ బ్యాంకు కొరత అధికంగా ఉంది. గతంలోనూ అనేక ప్రాజెక్టులు సిద్ధం చేయడంతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించినా భూమి కొరత వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు కేటాయించాలని ఉడా విస్తరించి ఉన్న రెండు జిల్లాల కలెక్టర్లకు అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. -
ట్రిపుల్ఐటీకి 35,877 దరఖాస్తులు
పెరుగుతున్న ఆదరణ గతేడాది కంటే 2వేలు అధికంగా దరఖాస్తులు మొత్తం సీట్లు మూడువేలు సీటొస్తే ఆరేళ్లవరకూ అన్నీఫ్రీయే నూజివీడు : ట్రిపుల్‌ఐటీలో అందిస్తున్న ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరడానికిగాను 35,877 దరఖాస్తులు అంది నట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కంటే రెండువేల దరఖాస్తులు అధికంగా రావడం గమనార్హం. రాష్ట్రంలోని నూజివీడు, బాసర, కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్క దానిలో వెయ్యి సీట్ల చొప్పున మొత్తం మూడువేల సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరడానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్జీయూకేటీ అధికారులు గత నెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 16వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు పంపడానికి గడువు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో పంపిన దరఖాస్తుల ప్రింట్అవుట్లను ఈనెల 21 సాయంత్రం 5గంటల లోపు ఆర్జీయూకేటీకి అందాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులలో సక్రమంగా ఉన్నవి ఎన్ని, ఇన్వేలిడ్ దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రిపులఐటీలోని ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా మొదటి రెండు సంవత్సరాల పీయూసీ, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగు విద్యను బోధించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి సెలక్షన్ జాబితాను జులై 7న ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. జులై 23, 24వతేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించి 28నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ట్రిపుల్ ఐటీలపై ఆసక్తి ఎందుకంటే ఏడాదికేడాది ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థులలోను,వారి తల్లిదండ్రులలోను ఆసక్తి పెరుగుతుండడంతో ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 32వేల దరఖాస్తులు రాగా, అంతకుముందు 28వేలువచ్చాయి. ఈ ఏడాది 35వేలు దాటాయి. ట్రిపుల్‌ఐటీలో సీటు లభిస్తే ఆరేళ్లపాటు ఎలాంటి ఫీజులు చెల్లించకుండా నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేయవచ్చు. అంతేగాకుండా పీయూసీ నుంచే ఏసీ తరగతి గదులుతోపాటు విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు సైతం ఇస్తారు. భోజన, వసతి సదుపాయాలతో పాటు డ్యూయల్ డిగ్రీలు, మైనర్కోర్సులు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవేగాక విద్యార్థులకు సంగీతం, నృత్యం, యోగాలలో కూడా ప్రతి రోజూ శిక్షణ ఇస్తుంటారు. ఇన్ని అవకాశాలు వేరే ఎక్కడా లేని నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. -
హరిహరీ....
=నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌పై మళ్లీ ఏసీబీ దాడులు =48,150 రూపాయలు స్వాధీనం =తీరు మార్చుకోని సిబ్బంది =కఠిన చర్యలు లేకపోవడమే కారణం సరిగ్గా ఈ నెల 21న అక్కడ ఏసీబీ దాడులు జరిగాయి. ఐదుగురు అధికారుల వద్ద భారీ మొత్తంలో అక్రమ సొమ్ము పట్టుబడింది. పది రోజులూ గడవక ముందే ఏసీబీ అధికారులు మళ్లీ దాడులు చేశారు. అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సొమ్ముతో పట్టుబడిన అధికారుల్లో ముగ్గురు ఈ నెల 21న నాటి దాడుల్లోనూ నిందితులు కావడం గమనార్హం. చర్యలు లేకపోవడంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుడిపాల, న్యూస్‌లైన్: గుడిపాల మండలంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ఉంది. ఇక్కడ ఉప వాణిజ్యపన్నులశాఖ అధికారి, సహాయ వాణిజ్య పన్నులశాఖ అధికారి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, సహాయ మోటారు వాహనాల తనిఖీ అధికారి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖకు సంబంధించి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అటవీశాఖ సిబ్బంది తదితరులు విధులు నిర్వహిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులోని ఈ చెక్‌పోస్ట్ మీదుగా నిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి. ఇక్కడ అక్రమ వసూళ్లు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఈ నెల 21న దాడులు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏసీటీవోలు సురేష్, గోపాల్, పళణి, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,02,690 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం లో మరోమారు దాడులు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏసీటీవోలు గణేష్, సురేష్, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి రశీదులూ లేకుండా ఉన్న 48,150 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, కిషోర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళారులదే రాజ్యం ఈ చెక్‌పోస్ట్‌లో దళారులదే ఇష్టారాజ్యంగా మారుతోంది. ఏడు శాఖలకు సంబంధించి 30 మంది వరకు దళారులు ఉన్నారు. వీరు అధికారుల్లా వ్యవహరిస్తున్నారు. లారీ డ్రైవర్లను దుర్భాషలాడుతూ అయిన కాడికి లాక్కుంటున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడే వారు వీరిని సంప్రదిస్తే చాలు అన్ని పనులూ అయిపోతున్నాయి. దిష్టి తగిలిందట.. చెక్‌పోస్ట్‌లో దాడుల తర్వాత ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అనంతరం సిబ్బంది ప్రయివేటు వ్యక్తులను పిలిపించి చెక్‌పోస్ట్‌లోని అన్ని గదులనూ శుభ్రం చేయించారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. తమపై ఏసీబీ అధికారుల చూపు పడకుండా ఉండాలని పూజలు చేయడం గమనార్హం. దీనిని బట్టి సిబ్బంది తీరు మార్చుకోవడం లేదని స్పష్టమవుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది.