న్యూ ఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే సమాచార సౌకర్యం కోసం భారత రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ 139ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌ను జనవరి 1న భారత రైల్వే ప్రారంభించింది. గతంలో రైల్వే సమాచారం కోసం పలు రకాల సహాయక నంబర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రయాణికులకు అన్నిరకాల సేవలను ఒకే నంబర్‌లతో అందించటం కోసం ఇండియన్ రైల్వే 139 నంబర్‌ను తీసుకువచ్చింది. దీంతో పాటు భారత రైల్వే ప్రయాణికుల కోసం ‘రైల్ మాడాడ్’ అనే యాప్‌ను లాంచ్ చేసింది.
నూతన సంవత్సరం సందర్భంగా భారత రైల్వే గతంలో ఉన్న సహాయక నంబర్లు నిలిపివేసి 139 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జనవరి 1 నుంచి కేవలం 139, 182 నంబర్లతో పాటు ‘రైల్ మాడాడ్’ పోర్టల్‌తో అన్ని సేవలను అందించనున్నట్లు భారత రైల్వే పేర్కొంది. సాధారణ ఫిర్యాదు సంఖ్య-138, క్యాటరింగ్ సేవ-1800111321, విజిలెన్స్-152210, ప్రమాదం, భద్రత- 1072, క్లీన్ మై కోచ్ - 58888/138, ఎస్ఎంఎస్ ఫిర్యాదు-9717630982 వంటి సహాయక నంబర్లు జనవరి ఒకటి నుంచి పనిచేయవని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment