
బెంగళూరు: 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోతపోసిన తపాలా కార్యాలయం దేశంలో తొలిసారిగా బెంగళూరులో కొలువు తీరనుంది. దీన్ని ఎల్ అండ్ టీ సంస్థ 45 రోజుల్లో 1,000 చదరపు అడుగుల్లో నిర్మించనుంది. పూర్తిగా ఆటో మేటిక్‌గా పనిచేసే రోబోటిక్ ప్రింటర్ దీన్ని తయారు చేస్తుంది. కాంక్రీట్‌ను పొరలు పొరలుగా 3డీ మోడల్‌కు తగ్గట్లు పోస్తుంది.
ఎక్కడా కాంక్రీట్ పడే వేగం తగ్గకుండా చూస్తూ వెనువెంటనే గట్టిపడేలా చేస్తుంది. పొరల మధ్య బలమైన బంధం ఉండేలా ‘గ్రీన్ కాంక్రీట్’ను నింపుతుంది. ‘‘జీ+3 నిర్మాణాలు, విల్లాలు, సైనిక బ్యారక్‌లు, ఒకే అంతస్తుండే పాఠశాలలు, పోస్టాఫీసులు, ఫ్యాక్టరీల నిర్మాణంపై దృష్టిపెట్టాం’’ అని సంస్థ పూర్తికాల డైరెక్టర్, ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్ (బిల్డింగ్స్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీశ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment