l&t company
-
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. -
పోతపోసిన పోస్టాఫీస్...!
బెంగళూరు: 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోతపోసిన తపాలా కార్యాలయం దేశంలో తొలిసారిగా బెంగళూరులో కొలువు తీరనుంది. దీన్ని ఎల్ అండ్ టీ సంస్థ 45 రోజుల్లో 1,000 చదరపు అడుగుల్లో నిర్మించనుంది. పూర్తిగా ఆటో మేటిక్‌గా పనిచేసే రోబోటిక్ ప్రింటర్ దీన్ని తయారు చేస్తుంది. కాంక్రీట్‌ను పొరలు పొరలుగా 3డీ మోడల్‌కు తగ్గట్లు పోస్తుంది. ఎక్కడా కాంక్రీట్ పడే వేగం తగ్గకుండా చూస్తూ వెనువెంటనే గట్టిపడేలా చేస్తుంది. పొరల మధ్య బలమైన బంధం ఉండేలా ‘గ్రీన్ కాంక్రీట్’ను నింపుతుంది. ‘‘జీ+3 నిర్మాణాలు, విల్లాలు, సైనిక బ్యారక్‌లు, ఒకే అంతస్తుండే పాఠశాలలు, పోస్టాఫీసులు, ఫ్యాక్టరీల నిర్మాణంపై దృష్టిపెట్టాం’’ అని సంస్థ పూర్తికాల డైరెక్టర్, ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ (బిల్డింగ్స్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీశ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. -
హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న భారీ రియాక్టర్
మల్కాపురం (విశాఖ పశ్చిమ): విశాఖ షిప్‌యార్డ్ నుంచి భారీ రియాక్టర్‌ను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హెచ్‌పీసీఎల్‌కు తరలించారు. గత రెండేళ్ల నుంచి హెచ్‌పీసీఎల్ సంస్థ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన భారీ రియాక్టర్లను గుజరాత్‌లోని ఎల్అండ్టీ సంస్థ తయారుచేస్తోంది. గుజరాత్ నుంచి రియాక్టర్లు సముద్రమార్గం ద్వారా షిప్‌యార్డ్‌కు వస్తున్నాయి. అక్కడ నుంచి భారీ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు తరలిస్తున్నారు. ఇదేవిధంగా మంగళవారం షిప్‌యార్డ్‌కు వచ్చిన భారీ రియాక్టర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన భారీ హైడ్రాలిక్ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు చేరవేశారు. ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెల్లవారుజామునే అధికారులు రియాక్టర్‌ను తరలించారు. -
అతిపెద్ద ఆర్డర్- ఎల్అండ్టీ జూమ్
ముంబై, సాక్షి: మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ నుంచి అతిపెద్ద ఆర్డర్ లభించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. కాంట్రాక్టులో భాగంగా నిర్మాణం, మైనింగ్ సంబంధ ఎక్విప్మెంట్ను సపఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్‌కు ఒడిషా, జార్ఖండ్లోగల మైన్స్‌కు మొత్తం 46 యూనిట్ల పరికరాలను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఆర్డర్లో భాగంగా 100 టన్నుల కోమత్సు డంప్ ట్రక్కులు 41తోపాటు.. 3 వీల్ లోడర్లు, 2 క్రాలర్ డోజర్లు అందించవలసి ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ఆర్డర్ విలువను వెల్లడించనప్పటికీ కంపెనీ చరిత్రలో లభించిన అతిపెద్ద ఆర్డర్లలో ఇది ఒకటని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 1154ను తాకింది. -
ఎల్అండ్టీ నుంచి భారీ డివిడెండ్?
ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్అండ్టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ బిజినెస్‌ను ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
అసెంబ్లీ అంతర్గత డిజైన్లకు స్పీకర్ ఆమోదం
విజయవాడ : అమరావతిలో చేపడుతున్న అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎల్అండ్టీ ప్రతినిధులతో చర్చించారు. విజయవాడలో శనివారం ఆయన ఆ సంస్ధ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు అసెంబ్లీ అంతర్గత డిజైన్ల వివరాలను కోడెలకు వివరించారు. కొద్దిపాటి మార్పులతో వారు ప్రతిపాదించిన డిజైన్లకు స్పీకర్ ఆమోదం తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోడెల ఆదేశించారు. -
ఎల్ అండ్ టీ ఔధార్యం
కోహీర్: మండలంలోని కవేలి క్రాస్‌రోడ్డు వద్ద 65 నంబరు జాతీయ రహదారి పక్కన ఎల్ అండ్ టీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్ధం బస్‌షెల్టర్ నిర్మించారు. రోడ్డు విస్తరణలో భాగంగా 20 ఏళ్ల క్రితం నిర్మించిన బస్‌షెల్టర్‌ను కూల్చివేశారు. నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదు. నిలువ నీడ లేక ఏడాది కాలంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ షెల్టర్‌ను నిర్మించడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయి. -
తిరుమల ఘాట్రోడ్లో చైన్‌లింక్ కంచె
కొండ చరియలు కూలకుండా తాత్కాలిక ఏర్పాటు సాక్షి, తిరుమల: తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడిన 14వ కి.మీ.వద్ద శుక్రవారం తాత్కాలికంగా చైన్‌లింక్ కంచె ఏర్పాటు చేస్తున్నా రు. కూలేందుకు సిద్ధంగా ఉన్న రాళ్లు ప్రయాణికులపై పడకుండా ఈ కంచె నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గోడ (సేఫ్టీ బ్రెస్ట్వాల్) నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. రాళ్లు కూలిన ప్రాంతాన్ని శుక్రవారం ఎల్అండ్టీ సంస్థ నిపుణులు పరిశీలించారు. మరమ్మతులపై టీటీడీ ఇంజినీర్లతో చర్చించారు. -
ఆకాశమంత... సాంకేతికత
నగర వాసుల కలల మెట్రో రైలు అత్యంత ఎత్తులో పరుగులు తీయనుంది. డబుల్ డెక్కర్ రైళ్లు వెళ్లినా ఏమాత్రం ఇబ్బంది కలగనంత ఎత్తులో... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్ఓబీల నిర్మాణానికి ఎల్అండ్టీ సంస్థ శ్రీకారం చుట్టింది. బుధవారం భరత్‌నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు సమీపంలో ఈ పనులు ప్రారంభించారు. ఎనిమిది ప్రాంతాల్లో ఈ తరహా ఆర్ఓబీలు నిర్మించనున్నారు.